
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జూలూరుపాడు(ఖమ్మం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి.. చుంచుపల్లి మండలం ఎస్.కె.నగర్‌లో నివాసముంటున్నారు. శనివారం వరకు విధులు నిర్వర్తించిన ఆమెకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న విజయలక్ష్మి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు.
చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూక్యా వీరబాబు, ఎంఈవో గుగులోత్ వెంకట్ ఆధ్వర్వంలో 124 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యాహ్న భోజన వర్కర్లకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇవ్వడం ఆలస్యమైందని..
Comments
Please login to add a commentAdd a comment