సాక్షి, హైదరాబాద్ : అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు హైదరాబాద్‌లోనే అధికంగా కోవిడ్ కేర్ సెంటర్లుండగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో నెలకొల్పినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ మంథనీలోని జేఎన్‌టీయూ కాలేజి, వరంగల్ పరకాలలోని పాలిటెక్నిక్ కాలేజి, ఖమ్మంలోని శారద ఇంజనీరింగ్ కాలేజీ సహా పలు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ప్రభుత్వం కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవారు, ఇంట్లో సరైన వసతి లేనివారు కోవిడ్ కేంద్రాల్లో ఉండొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నొవాటెల్, రెడిసిన్, ది మనోహర సహా పలు స్టార్ హటళ్లు ఇప్పటికే కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 14 ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లుండగా, 13 ప్రైవేట్ కేంద్రాలున్నాయి. అయితే ఈ రెండింటిలోనూ వైద్యులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటారు. అంబులెన్స్ సౌకర్యం సైతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31,699 యాక్టివ్ కరోనా కేసులుండగా వారిలో 24,598 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment