ప్రేమోన్మాదానికి యువతి బలి
సాక్షి, చెన్నై: ఓ యువకుడు వన్ సైడ్ లవ్‌తో ప్రేమోన్మాదిగా మారాడు. చర్చిలో ప్రార్థనలో నిమగ్నమై ఉన్న యువతిని నరికి చంపాడు. తమిళనాడులోని తూత్తుకుడి జార్జ్ రోడ్డులో ఇందిరానగర్‌కు చెందిన ఫ్రాన్సీనా(24) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
బుధవారం ఉదయం చర్చిలో ప్రార్థన చేస్తుండగా కీనన్ అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి హత మార్చాడు. అతని ప్రేమను తిరస్కరించడంతో పాటు మరో వ్యక్తితో పెళ్లికి ఫ్రాన్సీనా సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకే కీనన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు.