oneside love
-
వన్ సైడ్ లవ్ ఉన్మాదంతో చివరకు..
మిత్రుడే కదాని నాలుగురోజులు ఇంట్లో ఉండేందుకు అనుమతిస్తే, చివరకు యువతితో పాటు ఆమె కుటుంబాన్ని సజీవదహనం చేయడానికి యత్నించాడో ప్రేమోన్మాది. వన్ సైడ్ లవ్ ఉన్మాదంతో చివరకు ఆ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, చెన్నై: చెన్నై వలసరవాక్కం అన్బునగర్కు చెందిన ఓ యువతి, అరియలూరుకు చెందిన జీవానందం(22) కళాశాల మిత్రులు. వీరిద్దరు బీఎస్సీ పట్టభద్రులు. చదువుకునే సమయంలో ఉన్న చనువుతో తన ఇంటి చిరునామాను జీవానందంకు ఆ యువతి ఇచ్చింది. అయితే, అతడిలో వన్ సైడ్ లవ్ ప్రేమోన్మాది ఉన్నాడన్న విషయాన్ని ఆ యువతి పసిగట్ట లేకపోయింది. గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో చెన్నైకు వచ్చిన జీవానందం, తన వద్ద ఉన్న చిరునామా మేరకు అన్భునగర్కు వెళ్లాడు. పని నిమిత్తం మిత్రుడు దూరం నుంచి వచ్చేశాడుగా అనుకున్న ఆ యువతి తల్లిదండ్రుల అనుమతితో ఆ రాత్రి ఇంట్లో ఆశ్రయం కల్పించింది. ఒక రోజు అన్నది నాలుగు రోజులకు చేరింది. శుక్రవారం రాత్రి తమ కుమార్తెను తల్లిదండ్రులు మందలించారు. ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మిత్రుడ్ని పంపించేయాలని హెచ్చరించారు. ఉన్మాదిగా.. ఈ మాటల్ని చాటుగా విన్న జీవానందం అర్ధరాత్రి వేళ ఉన్మాది అయ్యాడు. ఇంట్లో ఉన్న స్నేహితురాలి తల్లిదండ్రులు నిద్ర లేపి మరీ తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అదే సమయంలో తన గది నుంచి బయటకు వచ్చిన స్నేహితురాల్ని చూసి, ‘తాను ప్రేమిస్తున్నానని, పెళ్లంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరొకర్ని చేసుకోనని, నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిందేనని’ ఒత్తిడి తెచ్చాడు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న ఆ యువతి జీవానందంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కలిసి చదువుకున్న మిత్రుడి కదా అని ఆశ్రయం ఇస్తే, తన తల్లిదండ్రుల ముందు పరువు తీశావంటూ తీవ్రంగా మండిపడింది. (ప్రేమించి పెద్దల్ని ఎదిరించి.. అంతలోనే..) దీంతో జీవానందంలోని ఉన్మాది రెచ్చిపోయాడు. ఆ యువతిని, ఆమె తల్లిదండ్రుల్ని ఓ గదిలోకి నెట్టి వంట గదిలో ఉన్న గ్యాస్ తెరిచేశాడు. అందర్నీ తగల బెట్టేస్తానంటూ హెచ్చరించడం మొదలెట్టాడు. అదే సమయంలో పక్కింటో ఉన్న వాళ్లు గ్యాస్ లీక్ వాసనను పసిగట్టారు. ఆ యువతి ఇంట్లో నుంచి వాసన వస్తున్నట్టుగా గుర్తించి తలుపు తట్టడం జీవానందం ఆందోళనలో పడ్డాడు. భయంతో తలుపు తీసి బయటకు పరుగు తీయబోతుండగా, ఇరుగుపొరుగు వారు పట్టుకున్నారు. గదిలో ఉన్న ఆ యువతి, ఆమె తల్లిదండ్రుల్ని రక్షించాడు. ఇక, తనను కొట్టి చంపేస్తారేమో అన్న భయంతో కిటికి అద్దాలను పగులగొట్టి, గొంతు కోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడ్ని కీల్పాకం ఆస్పత్రికి తరలించగా, మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఒన్ సైడ్ ప్రేమ కారణంగా జీవానందం బలవన్మరణానికి పాల్పడినట్టు నిర్ధారించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. -
బస్సులో యువతికి తాళికట్టే యత్నం
చెన్నై,టీ.నగర్: బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి మంగళవారం ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఆంబూర్ టౌన్ ప్రాంతానికి చెందిన జగన్ (25) మంగళవారం వాణియంబాడి వెళ్లే ప్రభుత్వ బస్సు ఎక్కాడు. అదే బస్సులో ఆంబూరుకు చెందిన యువతి ఉన్నారు. వాణియంబాడి వద్ద వెళుతుండగా వెంట తెచ్చుకున్న తాళిబొట్టును యువతి మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో ప్రయాణికులు జగన్‌కి దేహశుద్ధి చేశారు. బస్సు వాణియంబాడికి చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. జగన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అతను తాళికట్టేందుకు ప్రయత్నించిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఇలా ఉండగా యువతిని జగన్ వన్‌సైడ్ లవ్‌తో ప్రేమిస్తూ వచ్చినట్లు తెలిసింది. -
ఆమె!!! ప్రేమ!!!
ఆమె ఆఫీస్ ముగించుకుని గేట్ నుంచి బయటకి వస్తోంది. అది వర్షాకాలం కావడంతో సాయంత్రం ఆరు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలికి తోడు చిన్నగా వర్షపుజల్లు కూడా తోడైంది. బస్టాప్ ఆమె ఆఫీస్ ముందే! అతను ఆ బస్టాప్‌లో వెయిట్ చేస్తున్నాడు. ఆమె బ్యాగ్‌లో ఏదో సర్దుకుంటూ నెమ్మదిగా ఆ వర్షంలో నడచి వస్తూ ఎవరో పిలిచినట్టు తల పైకి ఎత్తి చూసింది. ఎదురుగా కాస్త దూరంలోఅతను. చూడగానే అతనికి పడిపోయింది అనుకుంటా, అందుకే అతన్ని ఎలాగైనా చూడడానికి 10 రోజుల నుంచి నానా అవస్థలు పడుతూ ముందుకు, పక్కకి చూస్తోంది. ఇప్పుడు అతను కొంచం పక్కకి నిలబడి ఉండటం వల్ల తన ముఖం ఆమెకి సరిగ్గా కనిపించడం లేదు. ఇంతలో బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతాడేమో అనుకుంది. కానీ అతను బస్సు కోసం కాకుండా ఇంక దేనికోసమో ఎదురుచూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్ మాట్లాడుతూ ఐనా తన ముఖం ఆమె వైపుగా తిప్పుతాడేమో అని ఆశతో తన వైపే చూస్తోంది. గాలికి చెరిగిపోతూ, రేగిపోతూ ఉన్న జుట్టు తప్ప ఆమెకి ఇంకేం కనిపించడం లేదు. అతని పర్సనాలిటీ, ఆ హెయిర్ స్టైల్‌కి పడిపోయింది. ఆ ఫోన్లో మాట్లాడుతున్న మనిషి 'రాను' అని చెప్పినట్టున్నారు, అందుకే అతను నడక మొదలుపెట్టాడు. ఆమె ఆ బస్టాప్ కాకుండా, ఎదురుగా ఉన్న బస్టాప్‌కి వెళ్ళాలి. అందులోనూ అతను అటువైపుగా నడుస్తున్నాడు. అందుకే ఆమె కూడా అతని వెంట నడక మొదలుపెట్టింది.ఈసారి అతని వెనుకభాగం తప్ప ఆమెకి ఇంకేదీ కనిపించడంలేదు. ఒక్కసారైనా వెనక్కి చూస్తాడు అనే ఆశతో ఆమె అతని వెనుక నడుస్తూ ఉంది. కానీ పక్కన జీబ్రా క్రాసింగ్ రావడంతో ఆమెకి గుర్తొచ్చినట్టుంది తాను ఎదురుగా ఉన్న బస్టాప్‌కి వెళ్ళాలి అంటే రోడ్ దాటాలి అని. నిరాశగా అతన్ని మళ్ళీ ఒకసారి వెనుకనుంచి చూసి రోడ్ క్రాస్ చేస్తోంది. ఆమె పక్కకి చూసింది. పక్కనే అతను. కానీ ఇప్పుడు కూడా ఆమెకి అతని ముఖం పూర్తిగా కనిపించడం లేదు. ఇద్దరు రోడ్ క్రాస్ చేసాక ఓ పది మీటర్ల దూరంలో ఉంది బస్టాప్. అతను, తనని అనుసరిస్తూ ఆమె, చెప్పాలంటే అతనికంటే వేగంగా నడుస్తోంది. అలా ఐనా ముందుకెళ్లి, వెనక్కి తిరిగి తనముఖం చూడచ్చు అనేమో! కానీ అది కుదరట్లేదు. ఈలోపు బస్సు రానే వచ్చింది. ఆమెకి అతని ముఖం ఎంతకీ కనిపించకపోవడంతో నిరాశగా బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిందనేకానీ ఆమె ధ్యాస అంతా అతని పైనే ఉంది. అలా ఏదో ఆలోచించేలోపు ఆమె దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఈసారి అదేస్టాప్లో అతను కూడా దిగాడు. ఆమె ముఖం 1000 వాట్స్ బల్బ్‌లా వెలిగింది, ఈసారి ఐతే ఖచ్చితంగా చూడాలి అనునుకుని చూసింది కానీ, బాగా చీకటిగా ఉండడంతో అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. సరే ఇక వెళ్దాం అని ఆమె అనుకున్న టైంలో అతని ముఖం బస్సు నుంచి వస్తున్న లైట్ వల్ల చాలాహుందాగా, మంచి మేని మెరుపుతో కనిపించింది. గత 10 రోజులుగా ప్రయత్నిస్తుంటే లేనిది ఒక్కసారిగా అతను కనిపించడంతో ఆమెకి ఆనందం ఒకవైపు, ఆశ్చర్యం ఒకవైపు. అతను రోడ్ క్రాస్ చేస్తుంటే, అతని వెంబడించి ఆమె కూడా రోడ్ దాటింది. బాగా చీకటి. దానికి తోడు చిన్న తుంపరులుగా పడుతున్న వర్షం వల్ల ఆమె , తాను వెళ్లాల్సిన రోడ్ వైపు తన నడక సాగించింది. 'ఓయ్, నీకోసం నేను వస్తుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి' అనే మాటలు వినపడగానే అటుగా తిడరగంతో ఎదురుగా అతను. ఏమీ అర్థం కాని చూపుతో అలా అయోమయంగా నిలబడి ఉన్న ఆమెను, 'నీకోసం రోజూ మీ ఆఫీస్ దగ్గర నిలబడి, నువ్వు వచ్చేవరకు. వెయిట్ చేసి, నిన్ను ఫాలో అవుతుంటే ., ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోతావ్ ఏంటి?' అని అడిగాడు. ఆమె సిగ్గుతో అలా తలెత్తకుండా నవ్వింది. -
నిండు ప్రాణాలు బలిగొన్న వన్‌సైడ్ లవ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఓ ప్రేమోన్మాది వన్‌సైడ్ లవ్ ఒక అమాయక విద్యార్థిని నిండు ప్రాణాలను బలికొంది. తనకు దక్కని యువతి ఎవరికీ దక్కకూడదనే ఉక్రోషంతో ఆమె గొంతుకోసి చంపేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా తిరువాడానై సమీపం అడుత్తకుడి గ్రామానికి చెందిన పళనిస్వామి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి, కుమార్తె ధరణి (19) గ్రామంలో ఉంటున్నారు. శివగంగై జిల్లా మహిళా కళాశాలలో ధరణి బీఏ ఫస్టియర్ చదువుతోంది. వీరి పొరుగింటిలో నివసించే బంధువు సేతురామన్ కుమారుడు కుమార్ (29) చెన్నైలో లెదర్ సంచులు కుడుతూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా ధరణిపై ప్రేమ పెంచుకున్న కుమార్ తరచూ గ్రామానికి వచ్చి వెళ్లేవాడు. ఆరు నెలల క్రితం తన బంధువులతో కలిసి ధరణి ఇంటికి వెళ్లి సంబంధం కోరాడు. కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు ధరణి తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తరువాత పదే పదే ధరణి వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి గొడవ పడేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా ధరణి తల్లి, అన్న కలిసి కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ధరణి తల్లి మహేశ్వరి, అన్న ధర్మలింగం ఆదివారం ఊరికి వెళ్లగా, కాలేజీకి సెలవు కావడంతో పెరటి తలుపును తెరచి ఉంచి ధరణి ఇంటిలో ఒంటరిగా నిద్రించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుమార్ ఇంట్లోకి చొరబడి తలుపులకు లోపలి నుంచి తాళం వేశాడు. అనంతరం టీవీ ఆన్ చేసి వాల్యూమ్ పెద్దగా పెంచాడు. ఇంతలో ధరణి మేల్కోగా కుమార్ తన వెంట తెచ్చుకున్న వేటకొడవలితో విచక్షణా రహితంగా ఆమె గొంతు నరికివేయడంతో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. -
ప్రేమోన్మాదానికి యువతి బలి
సాక్షి, చెన్నై: ఓ యువకుడు వన్ సైడ్ లవ్‌తో ప్రేమోన్మాదిగా మారాడు. చర్చిలో ప్రార్థనలో నిమగ్నమై ఉన్న యువతిని నరికి చంపాడు. తమిళనాడులోని తూత్తుకుడి జార్జ్ రోడ్డులో ఇందిరానగర్‌కు చెందిన ఫ్రాన్సీనా(24) ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బుధవారం ఉదయం చర్చిలో ప్రార్థన చేస్తుండగా కీనన్ అనే వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేసి హత మార్చాడు. అతని ప్రేమను తిరస్కరించడంతో పాటు మరో వ్యక్తితో పెళ్లికి ఫ్రాన్సీనా సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేకే కీనన్ ఈ దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. -
హవ్వా.. వన్‌సైడ్ లవ్వా!
పదునైన మాటలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడం సీపీఐ నారాయణ స్టయిల్. వెనుకాముందు ఆలోచించకుండా పరుష పదజాలంతో ఎవరినైనా కడిగిపారేయడం ఆయన ప్రత్యేకత. ఎంత పెద్ద నాయకుడి పైనా విమర్శలు చేసినా ఆయన మాటల వాడి తగ్గదు. తాజాగా తన సహచర కామ్రేడ్ నాయకుడు తమ్మినేని వీరభద్రంపై 'ప్రేమ పూర్వక' విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పొత్తుకు సుముఖంగా ఉన్న సీపీఎం వైఖరిని 'లవ్ కామెంట్స్'తో ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో సీపీఐ కలిసి వెళ్లడాన్ని సీపీఎం తప్పుబట్టింది. దీనిపై నారాయణ స్పందిస్తూ.. ఏ సిద్ధాంతం ప్రకారం టీఆర్ఎస్ను సీపీఎం వన్‌సైడ్ లవ్ చేస్తోందని గట్టిగా ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కట్టుబడిన సీపీఎం, విభజనకు కోరుకున్న టీఆర్ఎస్తో కలిసి వెళ్లడానికి సిద్ధపడడాన్ని ఏమంటారని నిలదీశారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీఆర్ఎస్ను వన్‌సైడ్ లవ్ చేస్తున్నా... కేసీఆర్ తిరిగి చేయడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సినిమాలకే పరిమితమైన 'వన్‌సైడ్ లవ్' నారాయణ పుణ్యమాని రాజకీయాలకూ పాకింది. ఒకవైపు ప్రేమ పాలిటిక్స్‌లో ఫలిస్తుందో, లేదో చూడాలి.