
బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి మంగళవారం ప్రయాణికులు దేహశుద్ధి చేశారు.
చెన్నై,టీ.నగర్: బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి మంగళవారం ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఆంబూర్ టౌన్ ప్రాంతానికి చెందిన జగన్ (25) మంగళవారం వాణియంబాడి వెళ్లే ప్రభుత్వ బస్సు ఎక్కాడు. అదే బస్సులో ఆంబూరుకు చెందిన యువతి ఉన్నారు. వాణియంబాడి వద్ద వెళుతుండగా వెంట తెచ్చుకున్న తాళిబొట్టును యువతి మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో ప్రయాణికులు జగన్‌కి దేహశుద్ధి చేశారు. బస్సు వాణియంబాడికి చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. జగన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అతను తాళికట్టేందుకు ప్రయత్నించిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఇలా ఉండగా యువతిని జగన్ వన్‌సైడ్ లవ్‌తో ప్రేమిస్తూ వచ్చినట్లు తెలిసింది.