Thali
-
సుస్మితా సేన్ 'తాలి'.. ఆసక్తిగా ట్రైలర్
బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'తాలి'. ఈ చిత్రంలో సుస్మితాసేన్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈనెల 15 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లోనూ రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులలో మరింత ఆసక్తి పెంచింది. ఈ సిరీస్‌లో సుస్మిత.. ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది. దేశంలోని ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం ఆమె ఎలా పోరాడిందో ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపించనున్నారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో సుస్మితాసేన్ హావభావాలు ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా సుస్మితా సేన్ మాట్లాడుతూ..' ఈ కథ వినిగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. కానీ ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం రెడీ కావడానికి దాదాపు ఆరున్నర నెలల సమయం పట్టింది. ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నప్పుడు పరిశోధన కూడా అవసరం. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్ గొప్ప వ్యక్తి. ఆమె నాకు ఎంతో కనెక్ట్ అయ్యారు. ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండటం నాకు దక్కిన అదృష్టం.'అని అన్నారు. అయితే తన కథను సిరీస్‌గా తీయడం పట్ల శ్రీగౌరి కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
కట్టప్పా కమాన్... ఇదిగో బాహుబలి థాలీ
చెన్నైలోని పొన్నుస్వామి హోటల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ సోషల్ మీడియా స్టార్మ్‌గా మారింది. ‘మీలో బాహుబలి థాలీని టచ్ చేసే వీరుడు ఎవరు?’ అని ఒక నెటిజనుడు కామెంట్ పెట్టాడు. ట్విట్టర్ యూజర్ అనంత్ రూపన్గూడి ‘బాహుబలి థాలి’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు థాలీ భారీ ప్లేట్‌ను కస్టమర్ల దగ్గరకు తీసుకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ వీడియోను చూసి.... ‘నోరూరుతోంది సుమీ!’ అని లొట్టలు వేస్తున్న వారితో పాటు– ‘ఇది గుడ్ ఐడియా కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫుడ్ వేస్టేజీ’ అని విమర్శించిన వారు ఉన్నారు. ఇంతకీ బాహుబలి థాలి ధర ఎంతనుకుంటున్నారు? కేవలం రూ.1399 ప్లస్ జీఎస్టీ మాత్రమే! -
Narendra Modi Birthday: 56 వంటకాలతో మోదీ థాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలో ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. ‘‘శనివారం నుంచి 26వ తేదీ దాకా 56 రకాల ఉత్తరాది వంటకాలతో ప్రత్యేకంగా మోదీ థాలి వడ్డిస్తాం. 40 నిమిషాల్లో థాలీని పూర్తి చేసిన వారికి రూ.8.5 లక్షలు అందజేస్తాం. ఇద్దరు విజేతలను మోదీకెంతో ఇష్టమైన కేథార్నాథ్ సందర్శనకు పంపిస్తాం’’ అని ప్రకటించింది. ఈ థాలీలో 20 రకాల కూరలతోపాటు రకరకాల బ్రెడ్లు, పప్పు, గులాబ్ జామ్, కుల్ఫీ సహా మొత్తం 56 వెరైటీలుంటాయి. వెజిటేరియన్ థాలి రూ.2,600, నాన్ వెజ్ థాలి రూ.2,900. డిన్నర్ థాలి అయితే మరో రూ.300 ఎక్కువట. వీటిపై పన్నులు అదనం. మోదీ అంటే తమకెంతో అభిమానమని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఆర్డర్ 2.1 అనే ఈ రెస్టారెంట్ ఓనర్ సువీత్ కాల్రా చెప్పారు. ‘‘మా రెస్టారెంట్ అందించే వెరైటీ థాలీలకు ఎంతో ఆదరణ ఉంది. ధరలను తగ్గించాలని మోదీని కోరుతూ 10 రోజుల్లో ‘ద్రవ్యోల్బణం–మాంద్యం థాలి’ కూడా తీసుకొస్తాం’’ అన్నారు. ఈ రెస్టారెంట్లో ‘పుష్ప థాలి’, ‘బాహుబలి థాలి’ కూడా సర్వ్ చేస్తుండటం విశేషం! ప్రధాని బహుమతుల వేలం ఎగ్జిబిషన్ ప్రారంభించిన కిషన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన 1,222 మైన జ్ఞాపికలు, బహుమతుల ఈ–వేలం నాలుగో విడత ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 2 దాకా సాగనుంది. ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శుక్రవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. వేలం ద్వారా సమకూరే మొత్తం నమామి గంగ ప్రాజెక్టుకు వెళ్తుందని గుర్తు చేశారు. దేశ జీవనాడి అయిన గంగా నదిని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ఈ వేలంలో అందరూ పాల్గొనాలని కోరారు. -
ప్రధాని పుట్టినరోజు.. రూ.8.5 లక్షలు గెలుచుకునే లక్కీ ఛాన్స్!
అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ యజమాని ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా కస్టమర్లకు థాలి ఆఫర్ ప్రకటించాడు. తన హోటల్లోని థాలి తింటే.. రూ.8.5 లక్షల నగదు గెలుచుకోవచ్చని ప్రధానిపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. కాగా సెప్టెంబరు 17 ప్రధాని మోదీ పుట్టిన రోజు. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఆర్డోర్( ARDOR ) 2.1 రెస్టారెంట్లో 56 వంటకాలతో ఓ బాహుబలి థాలిని ఏర్పాటు చేశాడు ఓ రెస్టారెంట్ యజమాని. ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన వెజ్ లేదా నాన్ వెజ్ ఐటెమ్‌ను ఆర్డర్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్పెషల్ థాలిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. "ప్రధాని మోదీని నేను చాలా గౌరవిస్తాను, అందుకే ఆయన పుట్టినరోజున ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాను. అందుకే థాలి పోటీ పెట్టినట్లు చెప్పారు. ప్రత్యేకమైన థాలీకి ’56 అంగుళాల మోదీజీ’ అని పేరు పెట్టినట్లు వివరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ థాలిని తినే కస్టమర్లకు బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలో దంపతులు కూడా పాల్గొనవచ్చని.. ఆ జంట నుంచి ఎవరైనా ఈ థాలీని 40 నిమిషాల్లో పూర్తి చేస్తే, వారికి 8.5 లక్షల రూపాయల బహుమతిని అందుకోవచ్చని తెలిపారు. అలాగే, సెప్టెంబర్ 17-26 మధ్య రెస్టారెంట్లో ఈ థాలీ తిన్నవారిలో లక్కీ విన్నర్‌ని ఎంపిక చేసి వారికి కేదార్నాథ్ పర్యటన అవకాశం కల్పిస్తామన్నారు. చదవండి: SCO Summit: చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్, నో షేక్‌హ్యండ్ -
నగ కొట్టేసి.. పర్సు చేజార్చి.. చివరికి ఎగతాళి..
అనంతపురం క్రైం: మహిళ మెడలోని తాళి కొట్టేసిన ఓ దొంగ చివరకు అందరి ముందు ఎగతాళి అయ్యాడు. వివరాలు... అనంతపురం నగరంలోని నీరుగంటి వీధిలో గురువారం ఉదయం గౌతమి అనే మహిళ తన ఇంటి ఎదుట శుభ్రం చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అపరిచిత వ్యక్తి పలకరించాడు. మాటల్లో ఆమె దృష్టిని మళ్లించి మెడలోని బంగారు మాంగల్యం చైన్‌ను లాక్కొని ఉడాయించాడు. చదవండి: భార్యపై అనుమానం.. వివస్త్రను చేసి.. తాడుతో బిగించి హడావుడిలో అపరిచిత వ్యక్తి జేబులో నుంచి పర్స్ కిందపడిపోయింది. అప్పటికే మహిళ కేకలు విన్న జనం అటుగా వస్తుండడం గమనించిన దొంగ అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై శరవేగంగా దూసుకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత దొంగలించిన నగ గిల్టుదని గ్రహించిన అతను.. దానిని తిరిగి మహిళకు అప్పగించి తన పర్స్ తీసుకెళ్లేందుకు వచ్చాడు. అప్పటికే పోగైన జనం.. దొంగను గుర్తించి ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. విచారణలో వేణుగోపాలనగర్‌కు చెందిన వెంకటేశ్వరరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతడిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. -
‘తాళిబొట్టు’ ఘటనపై విచారణ
ద్రంగి (వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహసీల్దార్ కార్యాలయ గు మ్మానికి ఓ మహిళ తాళిబొట్టు వేలాడదీసిన ఘటనను కలెక్టర్ కృష్ణభాస్కర్ సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఆర్డీవో శ్రీనివాస్‌ను ఆదేశించారు. దీంతో ఆర్డీవో గురువారం రుద్రంగి మండ లం మానాల గ్రామంలోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాలు, గ్రామ పెద్దల నుంచి వివరాలు సేకరించారు. పట్టా పాసుపుస్తకాలు, పలు పత్రాలను పరిశీలించారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ, పట్టా మార్పిడికి రుద్రంగి రెవెన్యూ సిబ్బందికి సంబంధం లేదని చెప్పారు. మానాల గ్రామం పాతకమ్మర్‌పెల్లి మండలం నిజామాబాద్ జిల్లాలో ఉన్న సమయంలోనే 2011–12లో సర్వేనంబర్ 130/14లోని రెండెకరాల వ్యవసాయ భూమి పొలాస రాజలింగం పేరు నుంచి పొలాస రాజం పేరిట పట్టా మార్పు జరిగిందని తెలిపారు. తర్వాత రాజం కోడలు పొలాస జల పట్టా చేసుకుందని చెప్పారు. పొలాస జల ఒక్కరే పట్టా చేసుకోవడంతో సమస్య తలెత్తిందని, పొలాసమంగకు రెండెకరాలలో రావాల్సిన వాటా కుటుంబ సమస్య కాబట్టి గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలిపారు. తన తాళిబొట్టు తీసుకుని అయినా భూమిపట్టా మార్చాలంటూ తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి మంగ తాళిబొట్టు వేలాడదీసిన విషయం విదితమే. -
తినండి.. బుల్లెట్ గెలవండి
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు దేశంలో అన్ని రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హోటల్ వ్యాపారాలు నేటికి కోలుకోలేదు. వైరస్ వ్యాప్తి ప్రారంభం అయిన నాటి నుంచి జనాలు బయటి తిండి అంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ వైభవాన్ని పొందేందుకు హోటల్ యజమానులు రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఓ ఆఫర్ జనాలను టెంప్ట్ చేయడమే కాక రెస్టారెంట్‌కు క్యూ కట్టెలా చేస్తుంది. ఆ వివరాలు.. పుణె అవుట్ స్కర్ట్స్‌లో ఉన్న శివరాజ్ హోటల్ కస్టమర్లను ఆకర్షించేందుకు.. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు ఓ వెరైటీ సవాలు ప్రకటించింది. ఇక ఇందులో గెలిచిన వారికి ఏకంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను బహుమతిగా ఇస్తామని తెలిపింది. ఇంతకు సవాలు ఏంటంటే 60 నిమిషాల వ్యవధిలో భారీ బుల్లెట్ థాలిని పూర్తి చేయాలని ప్రకటించింది. దాదాపు నాలుగు కేజీల బరువుండే భారీ నాన్ వెజ్ థాలిని 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసిన వారికి 1,60,000 రూపాయల ఖరీదు చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ని బహుమతిగా ఇస్తామని పేర్కొన్నది. ఇక పోటీకి సంబంధించిన కండీషన్లని, థాలిలో ఉండే పదార్థాలను సూచించే మెనుకు సంబంధించిన బ్యానర్లను ముద్రించి ప్రచారం చేస్తుంది. (చదవండి: యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. రెస్టారెంట్ మూత) బుల్లెట్ థాలిలో ఉండే పదార్థాలు.. ఇక నాన్-వెజ్ బుల్లెట్ థాలిలో 4 కిలోల మటన్, వేయించిన చేపలతో తయారు చేసిన సుమారు 12 రకాల వంటకాలు ఉంటాయి. ఫ్రైడ్ సుర్మై, పామ్ఫ్రేట్ ఫ్రైడ్ ఫిష్, చికెన్ తాండూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, కొలంబి (ప్రాన్) బిర్యానీ వంటి వంటకాలు ఉంటాయి. ఇక ఈ థాలిని సిద్ధం చేయడానికి 55 మంది సభ్యులు పని చేశారు. స్పందన ఎలా ఉంది.. థాలిని ప్రయత్నించడానికి, పోటీలో పాల్గొనడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో తన రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారని.. పోటీ పట్ల స్పందన చాలా బాగుందని రెస్టారెంట్ యజమాని అతుల్ వైకర్ తెలిపారు. ఇక తాము కోవిడ్ నిబంధనలను పాటిస్తున్నట్లు వైకర్ హామీ ఇచ్చారు. ఈ హోటల్ రోజుకు 65 థాలిలను విక్రయిస్తుంది. ఇక శివరాజ్ హోటల్ ఆరు రకాల భాదీ థాలిలను అందిస్తుంది - స్పెషల్ రావన్ థాలి, బుల్లెట్ థాలి, మాల్వాని ఫిష్ థాలి, పహెల్వాన్ మటన్ థాలి, బకాసూర్ చికెన్ థాలి, సర్కార్ మటన్ థాలి వంటి వెరైటీలు ఉన్నాయి. (చదవండి: దీన్ని 20 నిమిషాల్లో తింటే రూ.90 వేలు మీవే!) థాలి ధర ఎంత... ప్రతి తాలి ధర 2,500 రూపాయలు. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన శివరాజ్ హోటల్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఆఫర్లను పరిచయం చేస్తుంది. గతంలో, 8 కిలోల రావన్ థాలిని 60 నిమిషాల్లో పూర్తి చేయడానికి నలుగురు వ్యక్తులకు ఒక పోటీని ఏర్పాటు చేశారు. విజేతకు 5,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చారు. ఇక థాలికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. (చదవండి: రెస్టారెంట్ కిచెన్‌లో స్నానం: ‘నీకేమైనా పిచ్చా’!) ఇప్పటి వరకు ఎవరైనా గెలిచారా.. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా నివాసి సోమనాథ్ పవార్ బుల్లెట్ థాలిని ఒక గంటలోపు పూర్తి చేయగలిగాడని అతుల్ వైకర్ తెలిపారు. అతనికి బుల్లెట్ బహుకరించారు. (విన్నర్) -
కేవలం ఒక్క రూపాయకే ‘థాలి’..
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఎంతోమంది జీవనోపాధి పొగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఎందరో ఉద్యోగం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చేతిలో పని లేకపోవడంతో చాలా మందికి కడుపు నిండా తిండి దొరకడం కూడా గగనంగా మారింది. మన దగ్గర రోజు పని దొరికితేనే.. నాలుగు వేళ్లు నోటిలోకి వెళ్లే జనాభా ఎక్కువ. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం 2020 చివరి నాటికి అదనంగా 130 మిలియన్ల మంది ప్రజలు ఆహార అభద్రతను ఎదుర్కోగలరని అంచాన వేసింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఓ ఫుడ్ స్టాల్ కేవలం ఒక్క రూపాయకే పూర్తి థాలిని అందించి.. ఎందరికో ఆకలి తీర్చుతుంది. (చదవండి: కొంచెం.. జోష్ తగ్గింది) వివరాలు.. ఢిల్లీలోని నాంగ్లోయి ప్రాంతంలోని శివ మందిరం సమీపంలో శ్యామ్ రసోయి అనే ఫుడ్ స్టాల్ ఉంది. కరోనా నేపథ్యంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారికి సేవ చేయడం కోసం శ్యామ్ రసోయి యాజమాన్యం కేవలం ఒక్క రూపాయికే పూర్తి థాలిని అందిస్తుంది. రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సందర్భంగా షాప్ యజమాని గోయల్ మాట్లాడుతూ.. ‘ప్రతి రోజు రెండు వేల మందికి ఆహారం అందిస్తున్నాం. దుకాణం దగ్గరికి వచ్చే వారు ఓ 1000 మంది ఉంటే.. మరో వెయ్యి మందికి ఇ-రిక్షాలలో వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నాం’ అని తెలిపారు. -
తాళే.. యమపాశంగా!
పశ్చిమగోదావరి ,గణపవరం: అనుమానంతో భర్త పెట్టే వేధింపులు భరించలేక చంటిబిడ్డతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బాగా చూసుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకువచ్చి, తాను కట్టిన తాళినే ఉరితాడుగా మార్చి కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్తను గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నెల గర్భిణి అనే కనికరం కూడా లేకుండా అనుమానంతో ఆమె ప్రాణాలనే బలిగొన్నాడు. ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ బుధవారం గణపవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దేవరపల్లికి చెందిన మేడా అబ్బులు అనే వ్యక్తి మద్యానికి బానిసై, మొదటి భార్యను వేధింపులకు గురిచేయడంతో ఆమె అతనిని నుంచి విడిపోయింది. గణపవరానికి చెందిన నంగాలమ్మను రెండేళ్లక్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 9 నెలల బాబు ఉన్నాడు. భార్యను తరచూ వేధించడం, మద్యానికి బానిసై రోజూ కొట్టడంతో నంగాలమ్మ రెండు నెలలక్రితం పుట్టింటికి గణపవరం వెళ్లి, కొద్దిరోజుల తర్వాత ఐ.పంగిడిలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లింది. అబ్బులు ఇటీవల పిప్పరలో ఒక చేపల చెరువుపై పనికి చేరాడు. అప్పటినుంచి భార్యను రమ్మని కబురు చేస్తూ పలుమార్లు బంధువులతో రాయబారం పంపాడు. తాను ఇకమీదట వేధించనని, చేయి చేసుకోనని, బాగా చూసుకుంటానని నమ్మకంగా చెప్పి ఈ నెల 17న అబ్బులు తనతోపాటు భార్యను పిప్పర తీసుకువచ్చాడు. 18వ తేదీ రాత్రి అబ్బులు బాగా తాగివచ్చి భార్యతో గొడవపడ్డాడు. నాలుగో నెల గర్భిణిగా ఉన్న ఆమెపై అనుమానంతో అదే రోజు రాత్రి భార్య మెడలో ఉన్న పసుపుతాడునే పీకకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. తన భార్య పడుకుని కదలడంలేదంటూ కొంతసేపు హడావుడి చేశాడు. అనంతరం బీరు సీసాతో తన గొంతులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం తన తమ్ముడి ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడిని బుధవారం గణపవరం ఎస్సై ఎం.వీరబాబు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్, ఎస్సై వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాళిబొట్ల అప్పగింత ఆందోళన
టీ.నగర్: విద్యుత్ టవర్ల ఏర్పాటు పనులతో బాధిత రైతులకు అధిక నష్టపరిహారం చెల్లించాలంటూ మహిళలు తాళిబొట్ల అప్పగింత ఆందోళన బుధవారం జరిగింది. తిరుపూర్ జిల్లా, పల్లడం తాలూకా సెంబిపాళయం గ్రామంలో విద్యుత్ టవర్లు ఏర్పాటుచేసేందుకు 30 మంది రైతుల 200 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పనులు చేపట్టేందుకు వచ్చిన పవర్‌గ్రిడ్ సంస్థ సిబ్బందికి రైతులు వ్యతిరేకత తెలిపారు. ఇటీవల తమ ఇళ్లను ఖాళీ చేసి మేకలు, గేదలతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులు వారిని అడ్డగించి చర్చలు జరిపారు. దీనిపై కలెక్టర్ సమావేశం చర్చలు జరిపి హామీ ఇచ్చారు. అయినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు. ఇలావుండగా మంగళవారం ఆ ప్రాంతంలో 300 మంది పోలీసుల భద్రతతో పవర్‌గ్రిడ్ సంస్థ సిబ్బంది పనులు చేపట్టేందుకు వెళ్లారు. దీంతో ఆగ్రహించిన రైతులు మహిళలతో కలెక్టరేట్ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహిళలు పసుపు కొమ్ములు కట్టిన తాళిబొట్లతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి కుమార్, ఉద్యమకారుడు పళనిస్వామి పాల్గొన్నారు. దీంతో ఆర్డీఓ కవితా అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. తర్వాత పది మందిని మాత్రం కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతినిచ్చారు. తర్వాత కలెక్టర్‌తో వారు చర్చలు జరిపారు. ఆందోళన జరపడం మంచిది కాదని కలెక్టర్ తెలిపారని, దీంతో విద్యుత్ టవర్లు ఏర్పాటుచేస్తే అడ్డుకుంటామని అన్నారు. -
బస్సులో యువతికి తాళికట్టే యత్నం
చెన్నై,టీ.నగర్: బస్సులో యువతికి తాళికట్టేందుకు ప్రయత్నించిన యువకుడికి మంగళవారం ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. ఆంబూర్ టౌన్ ప్రాంతానికి చెందిన జగన్ (25) మంగళవారం వాణియంబాడి వెళ్లే ప్రభుత్వ బస్సు ఎక్కాడు. అదే బస్సులో ఆంబూరుకు చెందిన యువతి ఉన్నారు. వాణియంబాడి వద్ద వెళుతుండగా వెంట తెచ్చుకున్న తాళిబొట్టును యువతి మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో ప్రయాణికులు జగన్‌కి దేహశుద్ధి చేశారు. బస్సు వాణియంబాడికి చేరుకోగానే పోలీసులకు అప్పగించారు. జగన్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అతను తాళికట్టేందుకు ప్రయత్నించిన యువతికి వివాహం నిశ్చయమైంది. ఇలా ఉండగా యువతిని జగన్ వన్‌సైడ్ లవ్‌తో ప్రేమిస్తూ వచ్చినట్లు తెలిసింది. -
మోదీ మెనూలో వంటకాలివే..
న్యూయార్క్ : వారం రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేక మెనూ సిద్ధమైంది. హోస్టన్ చెఫ్ కిరణ్ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి పేరుతో పసందైన వంటకాలను వడ్డించనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ సాధారణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ బసచేసే హోటల్‌లోతో పాటు అమెరికా పర్యటన ఆసాంతం ప్రత్యేక మెనూతో చవులూరించే వంటకాలను సిద్ధం చేస్తారు. ఈ వంటకాలన్నీ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారుచేస్తారు. ప్రధాని మెనూలో పలు రకాల పచ్చళ్లను పొందుపరిచారు. నమో తాలి మిఠాయిలో రస్మలై, గజర్ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌లు ఉండగా, నమో తాలి సేవ్రిలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా వంటకాలున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను ప్రధాని కోసం సంసిద్ధం చేస్తామని చెఫ్ కిరణ్ పేర్కొన్నారు. ప్రధాని ఆరగించే పదార్ధాలను సిద్ధం చేయడం తనకు ఇదే తొలిసారని ఆమె తెలిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం అమెరికా బయలుదేరిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతారు. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ పాల్గొనే హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. -
నిరుపేద వధువుకు పుస్తె, మెట్టెల బహూకరణ
చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేటకు చెందిన నిరుపేద పేదవధువుకు జాల లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు తరపున పుస్తె మెట్టెలను బహూకరించారు. చిన్నశంకరంపేటకు చెందిన గుదిబండ కిష్టయ్య, కమలమ్మ కుమార్తె అరుణ వివాహం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జాల లక్ష్మయ్య మెమోరియల్ ట్రస్టు సభ్యులు జాల రవి, సారుుబాబాలు వధువుకు పుస్తెమెట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు కిష్టయ్య, యాదగిరి, శేకులు పాల్గొన్నారు. -
ఎయిర్ ఇండియాలో అన్నం - పప్పు
ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులకు భారతీయ వంటకాలను రుచి చూపించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ముంబై- ఢిల్లీ రూట్ లో ఈ కొత్త మెనును అందుబాటులోకి తెచ్చారు. భారతీయుల సాధారణ భోజనం తాలీ, కుల్హద్ మసాలా చాయ్ లను తొలి సారి విమాన ప్రయాణీకులకు అందించనున్నారు. దీంతో అన్నం - పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా.. ఎయిర్ ఇండియా నిలిచింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనూ పై ఇప్పటికే మంచి స్పందన లభించిందని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు. ప్రయాణీకుల స్పందన.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. తాలీలో భాగంగా అన్నం, పప్పు, పెరుగు, ఒక కూర, రోటీ, పనీర్ లేదా చికెన్ లలో ఒకటి మొత్తంగా ఏడు ఫుడ్ ఐటమ్స్ ను ఎంచుకునే వీలు ఉంది. అయితే.. సాధారణంగా ప్లైట్ లో అందించే భోజనం కంటే.. తాలీ ని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతోందని..క్రూ మెంబర్లు భావిస్తున్నారు. సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే భోజన పధార్థాలను ఒకే సారి వేడి చేసే వీలు ఉండగా.. తాలీ లో మాత్రం... అన్ని పదార్థాలను విడి విడిగా వేడిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తానికి.. ఎయిర్ ఇండియాలో భారతీయులు ఎంతగానో ఇష్టపడే అన్నం పప్పు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాయి. -
తాళి బొట్టు ఉంచుకోవాలా...? తీసి వేయాలా..?
సాక్షి, చెన్నై: ‘ తాళి బొట్టు ఉంచుకోవాలా...? తీసి వేయాలా..? అన్నది వారి వారి వ్యక్తిగత అభిప్రాయం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్భు వ్యాఖ్యానించారు. శివ సేన, హిందూ సంఘాల చర్యల్ని పరోక్షంగా ఆమె ఖండించారు. ఆమెకు మద్దతుగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం వ్యాఖ్యలు చేశారు. ఇక, పెరియార్ దిడల్పై బాంబు దాడులకు సిద్ధమైన 20 మంది శివ సేన నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ద్రవిడ కళగం నేతృత్వంలో మంగళవారం తాళి బొట్టు తొలగించే కార్యక్రమం నగరంలో జరిగిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు తీవ్రంగానే స్పందించాయి. సంప్రదాయాలను మంట గలుపుతున్నారంటూ ద్రవిడ కళగం నేతలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఎట్టకేలకు తాము అనుకున్నది విజయవంతంగా ద్రవిడ కళగం నేతలు పూర్తి చేశారు. అయితే, తమ మనో భావాల్ని కించ పరిచే విధంగా వ్యవహరించారంటూ హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, శివ సేనలు ద్రవిడ కళగంపై తమ ప్రతాపం చూపించే వ్యూహంతో ఉరకలు పరుగులు తీస్తున్నాయి. ఎగ్మూర్‌లోని పెరియార్ తిడలపై దాడికి యత్నించి శివ సేన నాయకులపై పోలీసులు లాఠీలు ఝుళిపించాల్సి వచ్చింది. వారు వచ్చిన ఆటోలో నాలుగు నాటు బాంబులు చిక్కడంతో కలకలం బయలు దేరింది. దీంతో ఆటోను, అందులోని బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. చివరకు శివ సేన రాష్ట్ర నేతలు రాధాకృష్ణన్, కార్తికేయన్, రమేష్, ఏలుమలై తదితర 20 మందిని బుధవారం అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. ఈ తాళి వివాదం ఓ వైపు సాగుతున్న సమయంలో కుష్భు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా ద్రవిడ కళగంకు తన మద్దతు ఇచ్చారు. తాళి వ్యక్తిగతం : తాళి ఉంచుకోవాలా..? తీసి వేయాలా..?, కట్టుకోవాలా...? వద్దా..? అన్నది వారి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారం పడి ఉందని కుష్భు వ్యాఖ్యానించారు. రోజు వారీగా జరుగుతున్న పెళ్లిళ్లను వెళ్లి ఆపలేదుగా, వారి నిరసనను ఈ రూపంలో తెలియజేయాలనుకున్నారు...అంతేగా అని పరోక్షంగా మద్దతు ఇచ్చారు. స్వతంత్ర భారత దేశంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేయడానికి వీలు ఉందని, ఎవరికి వారు తమకు తోచినట్టుగా భావాలను వ్యక్త పరుస్తుంటారని గుర్తు చేశారు. అంత మాత్రాన అడ్డుకోవడం, ఆందోళనల పేరుతో దాడులకు సిద్ధ పడటం మంచి పద్ధతి కాదని పరోక్షంగా హిందూ సంఘాలకు హితవు పలికారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. పెరియార్ ద్రవిడ సిద్ధాంతాల మేరకుద్రవిడ కళగం తమ నిరసనను వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. పెరియార్ చిత్రంలో మణియమ్మగా కుష్భు నటించిన విషయం గమనార్హం. కుష్భు పేర్కొన్నట్టుగానే టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ శివ సేన, హిందూ సంఘాల చర్యల్ని ఖండించారు.