
చెన్నైలోని పొన్నుస్వామి హోటల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ సోషల్ మీడియా స్టార్మ్‌గా మారింది. ‘మీలో బాహుబలి థాలీని టచ్ చేసే వీరుడు ఎవరు?’ అని ఒక నెటిజనుడు కామెంట్ పెట్టాడు.
ట్విట్టర్ యూజర్ అనంత్ రూపన్‌గూడి ‘బాహుబలి థాలి’ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు థాలీ భారీ ప్లేట్‌ను కస్టమర్‌ల దగ్గరకు తీసుకు వస్తున్న దృశ్యం కనిపిస్తుంది.
ఈ వీడియోను చూసి.... ‘నోరూరుతోంది సుమీ!’ అని లొట్టలు వేస్తున్న వారితో పాటు– ‘ఇది గుడ్ ఐడియా కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే ఫుడ్ వేస్టేజీ’ అని విమర్శించిన వారు ఉన్నారు. ఇంతకీ బాహుబలి థాలి ధర ఎంతనుకుంటున్నారు? కేవలం రూ.1399 ప్లస్ జీఎస్‌టీ మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment