ఎయిర్ ఇండియాలో అన్నం - పప్పు | Thali, kulhad tea debut on Air India menu | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియాలో అన్నం - పప్పు

Published Thu, Feb 4 2016 8:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

ఎయిర్ ఇండియాలో అన్నం - పప్పు

ఎయిర్ ఇండియాలో అన్నం - పప్పు

ఎయిర్ ఇండియా తన ప్రయాణీకులకు భారతీయ వంటకాలను రుచి చూపించేందుకు సిద్దమైంది. ఇప్పటికే ముంబై- ఢిల్లీ రూట్ లో ఈ కొత్త మెనును అందుబాటులోకి తెచ్చారు. భారతీయుల సాధారణ భోజనం తాలీ, కుల్హద్ మసాలా చాయ్ లను తొలి సారి విమాన ప్రయాణీకులకు అందించనున్నారు. దీంతో అన్నం - పప్పు వడ్డిస్తున్న తొలి విమాన సర్వీసుగా.. ఎయిర్ ఇండియా నిలిచింది.  


సోమవారం నుంచి ప్రారంభమైన ఈ మెనూ పై ఇప్పటికే మంచి స్పందన లభించిందని ఎయిర్ ఇండియా ఎండీ అశ్వని లోహాని తెలిపారు. ప్రయాణీకుల స్పందన.. ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని త్వరలో మిగతా సర్వీసులకు ఈ మెనూ విస్తరిస్తామని పేర్కొన్నారు. తాలీలో భాగంగా అన్నం, పప్పు, పెరుగు, ఒక కూర, రోటీ, పనీర్ లేదా చికెన్ లలో ఒకటి మొత్తంగా ఏడు ఫుడ్ ఐటమ్స్ ను ఎంచుకునే వీలు ఉంది.


అయితే.. సాధారణంగా ప్లైట్ లో అందించే భోజనం కంటే.. తాలీ ని వేడి వేడిగా వడ్డించేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతోందని..క్రూ మెంబర్లు భావిస్తున్నారు. సాధారణంగా బిజినెస్ క్లాస్ లో అందించే  భోజన పధార్థాలను ఒకే సారి వేడి చేసే వీలు ఉండగా.. తాలీ లో మాత్రం... అన్ని పదార్థాలను విడి విడిగా వేడిచేయాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తానికి.. ఎయిర్ ఇండియాలో భారతీయులు ఎంతగానో ఇష్టపడే అన్నం పప్పు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement