thoothukudi
-
Kanimozhi Karunanidhi: రాజకీయ కవయిత్రి
కనిమొళి కరుణానిధి.. బహుముఖ ప్రతిభావంతురాలైన రాజకీయవేత్త, కవి, పాత్రికేయురా లు, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యురాలు. తూత్తుక్కుడి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చురుకైన విద్యార్థి... కనిమొళి చిన్నప్పటి నుంచే చురుకైన విద్యార్థి. బాల్యంలో తండ్రితో పెద్దగా గడపలేకపోయినా.. ఆయనకు మాత్రం ప్రియమైన కూతురే. కనిమొళి పుట్టిన తరువాతే ముఖ్యమంత్రి పదవి దక్కడంతో అది ఆమె తెచి్చన అదృష్టమేనని కరుణానిధి భావించేవారు. తండ్రి తన దగ్గరలేని బాధను కనిమొళి కవిత్వంగా మలిచారు. అది చదివి ఆయన కదిలిపోయారు. అలా తండ్రీకూతుళ్లను సాహిత్యం మరింత దగ్గర చేసింది. కనిమొళి క్రియాశీల రాజకీయాలకు దూరంగా పెరిగారు. 2001లో జయలలిత హయాంలో కరుణానిధిని అరెస్టు చేసినప్పుడు తండ్రి పక్కన నిలబడి తొలిసారి ప్రముఖంగా బయటకు కనిపించారు. నాటినుంచీ ఆయన గళంగా మారిపోయారు. తండ్రి బహుముఖ ప్రజ్ఞకు కనిమొళి అప్రకటిత వారసురాలు. దానికి తోడు ఇంగ్లిష్ బాగా మాట్లాడతారు. దాంతో కరుణానిధి ఢిల్లీలో పెద్దలెవరినీ కలిసినా వెంట కనిమొళి ఉండేవారు. కనిమొళి ఢిల్లీ రాజకీయాల్లో, స్టాలిన్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండేలా కరుణానిధి ముందుచూపుతో వ్యవహరించారు. 1982లో జయలలిత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన వేదికపైనే 2008 జూన్‌లో కనిమొళితో డీఎంకే తొలి మహిళా సమ్మేళనం నిర్వహించారు. అలా ఆమెను అగ్రనాయకురాలిగా నిలబెట్టే ప్రయత్నాలు చేశారు. కనిమొళిని జయలలితకు కౌంటర్‌గా కరుణానిధి చూశారు. వారిద్దరికీ సారూప్యమూ ఉంది. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. జర్నలిస్టులుగా పనిచేశారు. రాజ్యసభ సభ్యులుగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. రాజకీయాల్లో... కనిమొళి 2007లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. çఆరోగ్యం, కుటుంబ సంక్షేమ, విదేశీ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి కమిటీ, హోమ్ వ్యవహారాల వంటి పలు కమిటీల్లో చురుగ్గా పనిచేసి ఆకట్టుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా చేశారు. 2013లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్నారు. 2019లో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తూత్తుక్కుడి నుంచి బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్‌పై ఏకంగా 3,47,209 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సక్సెస్ఫుల్ జర్నలిస్టు.. కనిమొళి సక్సెస్ఫుల్ జర్నలిస్టు కూడా. ప్ర ముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా చేశా రు. తమిళ వారపత్రిక ‘కుంగుమం’ సంపాదకురాలిగా వ్యవహరించారు. సింగపూర్‌కు చెందిన ‘తమిళ మురసు’ వార్తాపత్రికకూ ఫీచర్స్ ఎడిటర్‌గా సేవలందించారు. తమిళంలో కవిత్వం రాశారు. తమిళ కవిత్వాన్ని ఇంగ్లి‹Ùలోకి అనువదించారు. ఆమె రచనలు ఇంగ్లి‹Ù, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోకి అనువాదమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తూత్తుకుడి ప్లాంట్ విక్రయించం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ తమిళనాడులోని తూత్తుకుడిలోగల కాపర్ ప్లాంటును విక్రయించబోమని తాజాగా స్పష్టం చేసింది. స్టెరిలైట్ కాపర్ ప్లాంటును విక్రయిస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను తప్పుపట్టింది. ఇవి ఆధారరహిత, తప్పుడు వార్తలని పేర్కొంది. వీటికి ఎలాంటి ప్రాతిపదికలేదంటూ తోసిపుచి్చంది. స్టెరిలైట్ కాపర్ జాతీయ ఆస్తిఅని, దేశీయంగా మొత్తం కాపర్ ఉత్పత్తిలో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచి్చన సమాచారంలో తెలియజేసింది. మీడియాలోని కొన్ని వర్గాలు తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంటును వేదాంతా విక్రయిస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించినట్లు పేర్కొంది. వీటిని ఖండిస్తున్నట్లు తెలియజేసింది. దేశం నికరంగా కాపర్‌ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో మెటల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభించవలసిన ఆవశ్యకత ఉన్నట్లు వివరించింది. -
సుప్రీం కోర్టులో కనిమొళికి భారీ ఊరట
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్‌ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను. అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్‌కు సంబంధించిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా? -
ఏడాది నుంచి ప్రేమ, సినిమాకు వెళ్లి వస్తుండగా ప్రేమజంట దుర్మరణం
సాక్షి, చెన్నై: సినిమాకు వెళ్లి ఓ ప్రేమజంట ద్విచక్రవాహనంలో తిరిగి వస్తుండగా లారీ రూపంలో తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన బాబిలోన (23) సాఫ్ట్వేర్ ఇంజినీర్. చెన్నై జాఫర్‌ఖాన్ పేటలో ఉంటూ గిండిలోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. ఈమె బంధువు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రశాంత్ (33) చెన్నై జాఫర్‌ఖాన్ పేటలోనే ఉంటూ కుంన్రత్తూరులో ఉన్న ప్రైవేటు సంస్థలో డిజైనింగ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి ఇరువైపు పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించి నిశ్చితార్థం చేశారు. ఈక్రమంలో అన్నానగర్ లోని ఓ థియేటర్లో సినిమా చూడడానికి బాబిలోన, ప్రశాంత్ ఇద్దరు బైక్‌పై వెళ్లారు. సినిమా చూసుకుని తిరిగి అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో తిరిగి బయలుదేరారు. అరుంబాక్కం మెట్రో రైల్వేస్టేషన్ వద్ద వెళుతుండగా వెనుక నుంచి ఇనుపలోడుతో వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ఘటనలో బైకు నుంచి కిందపడిన బాబిలోన, ప్రశాంత్‌లపై లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు అతన్ని పట్టుకుని తర్వాత అన్నానగర్ పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురి కోసం స్త్రీ జన్మను వీడి మగ బతుకులో
స్టేజ్ మీద నాటకం కోసం కాసేపు స్త్రీ పురుషుడిగా... పురుషుడు స్త్రీగా మారాలంటేనే కొంచెం కష్టం. కాని– తమిళనాడులో ఒక తల్లి 30 ఏళ్లుగా పురుష అవతారం ఎత్తి జీవిస్తోంది. భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవడం కోసం ఆమె పురుషుడిగా మారింది. ‘ముత్తు మాస్టర్’గా టీ స్టాల్లో పని చేసే ఆమె స్త్రీ అని ఎవరికీ తెలియదు. పురుషాధిపత్య సమాజం ఎంత భయపెడితే ఆమె ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుంది? రాజ్యాలను కాపాడుకోవడానికి ఆడపిల్ల పుడితే మగపిల్లాడిగా పెంచిన ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. ఒంటరి స్త్రీలు ఈ మగ ప్రపంచంలో బతకాలంటే అవసరార్థం మగ అవతారం ఎత్తక తప్పదని రాజ్ కపూర్ ‘మేరా నామ్ జోకర్’లో పద్మిని పాత్ర ద్వారా చూపిస్తాడు. ఆమె ఆ సినిమాలో మగవాడి వేషం కట్టి బతుకు ఈడుస్తుంటుంది. అమోల్ పాలేకర్ తీసిన ‘దాయ్రా’ అనే సినిమాలో ఒక గ్రామీణ యువతి గ్రామస్తుల దాష్టికాలు భరించలేక, స్త్రీగా తనకు కలుగుతున్న అభద్రత నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మగ ఐడెంటిటీలోకి మారిపోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే ఒక నిస్సహాయురాలైన వితంతువు తన కూతురిని పెంచుకోవాలంటే మగవాడి అవతారం ఎత్తక తప్పదని భావించి గత ముప్పై ఏళ్లుగా అలాగే బతుకుతున్నదని తెలిస్తే ఆశ్చర్యమూ బాధా కలుగుతాయి. ఆ స్త్రీ పేరు పెచ్చియమ్మాళ్. ఊరు తమిళనాడులోని తూతుకూడి జిల్లాలోని కతునాయకన్పట్టి. 20 ఏళ్ల వయసులో పెచ్చియమ్మాళ్ది తూతుకూడి జిల్లా. ఆమెకు వివాహం అయ్యాక గర్భంలో ఉండగా భర్త మరణించాడు. ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టింది. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. ఒంటరి స్త్రీగా కుమార్తెను కాపాడుకోవడానికి అదే జిల్లాలోని రెండు మూడు ఊళ్లలో ప్రయత్నించింది పెచ్చియమ్మాళ్. ఒంటరి స్త్రీ. పైగా వయసులో ఉంది. నిస్సహాయురాలు. అలాంటి స్త్రీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాలో అన్నీ ఎదుర్కొంది ఆమె. తన ప్రాణం, తన ఉనికి కంటే తన కుమార్తె ఉనికి ముఖ్యం అనుకుందామె. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలి... తను కూడా రేపు పెద్దది అవుతుంది... దానికి కూడా ఒక మగ అండ ఉందనే భ్రాంతి కలిగించాలి అనే ఆలోచన ఆమెకు కలిగింది. మగ అవతారం ఎత్తడమే అందుకు విరుగుడు అనుకుంది. అంతే! జుట్టు కత్తిరించుకుని, లుంగీ చొక్కా ధరించి, పూర్తిగా పురుషుడిలా కనిపిస్తూ ప్రస్తుతం నివసిస్తున్న కతునాయకన్పట్టికి చేరుకుంది. అన్ని మగవాళ్ల పనులే ఆ పల్లెలో ఆమెను అందరూ మగవాడనే అనుకున్నారు. ఆమె తన పేరును ముత్తు అని చెప్పుకుంది. పైగా చేసేవన్నీ మగవాళ్ల పనులే. కూలి పనులు, పెయింటింగ్ పని, కొబ్బరి బోండాలు కొట్టే పని, ఎక్కువ కాలం ఆమె హోటల్లో పరోటా మాస్టర్‌గా, టీ మాస్టర్‌గా పని చేసింది. అందువల్ల ఆమెను ఆ ఊళ్లో అందరూ ‘ముత్తు మాస్టర్’ అని పిలుస్తారు. ముత్తు మాస్టర్ ఈ పనులన్నీ చేసుకుంటూనే కూతురిని పెంచి పెద్ద చేసుకుంది. ఆమెకు జీవితం ఇచ్చింది. ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని భావించేవారు. కూతురికి ‘తండ్రి అండ’ ఉండటం వల్ల ప్రత్యేకంగా సమస్యలు రాలేదు. ఇలా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు 30 ఏళ్లుగా మగవాడిగా బతుకుతున్నది పెచ్చియమ్మాళ్. ఇప్పుడు ఆమె వయసు 57 సంవత్సరాలు. పెన్షన్ కోసం అసలు రూపం పెచ్చియమ్మాళ్‌కు వయసు మీద పడింది. మునుపటిలా కష్టపడలేకున్నది. తన బతుకు, కూతురి బతుకు కూడా అంతంత మాత్రమే. అందుకని ‘వితంతువు పెన్షన్’ కోసం ఇక అసలు అవతారాన్ని బయటపెట్టింది. తాను స్త్రీనని చెప్తే ఊరంతా ఆశ్చర్య పోయింది. నమ్మకమైన ఇద్దరు ముగ్గురు స్త్రీలకు తప్ప ఇప్పటి వరకూ ఆ సంగతి ఆ ఊళ్లో ఎవరికీ తెలియదు. పెచ్చియమ్మాళ్ ఆధార్ కార్డు ‘ముత్తు’ పేరుతోనే ఉంది. ఆమె దగ్గర భర్త డెత్ సర్టిఫికెట్ లేదు. అందువల్ల ఆమెకు వితంతు పెన్షన్ ఇవ్వడం సమస్యగా మారింది. ఈ విషయం అందరికీ తెలిసి తనకు సహాయం అందడం కోసం ఈ విషయాన్ని మీడియాకు బయటపెట్టింది. అయితే తాను ఇలా ఇక మీదట కూడా పురుషుడిగానే ఉంటానని. తాను చనిపోయాక ముత్తుగానే అందరూ గుర్తు చేసుకోవాలని ఆమె కోరింది. -
భర్తతో విడిపోయిన మీనా.. రెండో వివాహం చేసుకున్న తర్వాత..
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో రెండో వివాహం చేసుకున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటనపై ఆమె తల్లి, అన్నతో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న తండ్రి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తూత్తుకుడి జిల్లా, సెయ్యంగనల్లూర్ సమీపంలోని కరుంగుళం, తాత్తాన్‌కుళంకు చెందిన సిడలై ముత్తు కుమార్తె మీనా (21). ఈమెకు ఐదేళ్ల క్రితం తాత్తాన్‌కుళం సమీపంలోని కాల్వాయ్ గ్రామానికి చెందిన ఇసక్కి పాండియన్‌తో వివాహమైంది. వీరికి కుమారుడు నిశాంత్ (04) ఉన్నాడు. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయిన మీనా నెల్లై జిల్లా పడపిల్లై పుదూర్‌కు చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతనితో 10 నెలలుగా కాపురం చేస్తున్నట్లు సమాచారం. నిశాంత్ తండ్రి వద్ద ఉన్నాడు. కాగా, కుమార్తె రెండవ వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన సుడలైముత్తు కుటుంబం మీనాపై తీవ్ర కోపంతో ఉన్నారు. ఈ స్థితిలో శుక్రవారం తాత్తాన్‌కుళంలో జరిగిన ఆలయ ఉత్సవాలకు మీనా తన పిన్ని పార్వతి ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సడలై ముత్తు, అతని భార్య ముప్పిదాతి, కుమారుడు మాయండి, సడలై ముత్తు అన్న తలవాయ్, అతని భార్య వీరమ్మాళ్, వీరి కుమారుడు మురుగన్ మీనాతో గొడవపడ్డారు. ఆ సమయంలో ఆగ్రహం చెందిన సడలై ముత్తు తన వద్ద ఉన్న కత్తితో మీనా పైదాడి చేశాడు. దీంతో మీనా ఘట నా స్థలంలోనే దుర్మరణం చెందింది. సెంగనల్లూర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని శవ పరీక్ష కోసం నెల్లై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకోవడంతో కుమార్తెను హత్య చేసినట్లు తెలిసింది. -
వాట్సప్ చూస్తోందని చెల్లిని చంపిన అన్న
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా వాసవంపురంలో దారుణం చోటు చేసుకుంది. వాట్సాప్ వీడియోలు చూస్తోందని మలైరాజా అనే వ్యక్తి తన చెల్లిని కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మలైరాజా అనే వ్యక్తి తన చెల్లి కవితకు అన్లైన్ క్లాసుల కోసం సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయితే కవిత క్లాసులు వినకుండా.. సెల్పోన్లో వీడియోలు చూస్తోంది. ఈ విషయం మలైరాజా పలుమార్లు చెల్లిని హెచ్చరించాడు. దీనిపై వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఎంత చెప్పినా వినకుండా వీడియోలు చూస్తోందని.. కవితను అన్న మలైరాజా వెనుక నుంచి కత్తితో పొడిచి చంపాడు. దీంతో తీవ్రగాయాపాలైన కవిత మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పంచాయితీకి రాలేదని కుల, గ్రామ బహిష్కరణ -
13 వాహనాలు ధ్వంసం: ఎస్ఐ కుమారుడు సహా ఇద్దరి అరెస్టు
టీ.నగర్: తూత్తుకుడిలో 13 వాహనాలను ధ్వంసం చేసిన ఎస్ఐ కుమారుడు సహా ఇద్దరిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి సిప్కాట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజగోపాల్‌నగర్, అన్నై థెరిసానగర్, రాజీవ్‌నగర్, బర్మాకాలనీ, భారతీనగర్, తంతితపాలా కాలనీ, బాలపాండినగర్ ప్రాంతాల్లో ఇళ్ల ముందు ఉంచిన కార్లు, వ్యాన్లు, ఆటో ఇతర వాహనాలను మత్తుమందు ముఠా శనివారం రాత్రి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో అన్నానగర్‌లో వాహనాలను ధ్వంసం చేస్తుండగా చూసిన ఎడ్వర్డ్ (24) అనే యువకుడిపై ముఠా తీవ్రంగా దాడి చేసింది. ప్రస్తుతం అతను తూత్తుకుడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై సిప్కాట్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ జరిపారు. అన్నానగర్‌కు చెందిన భరత్‌కుమార్ (25), అజీత్‌కుమార్ (23), విఘ్నేష్‌పాండి (24)లను అరెస్టు చేశారు. భరత్‌కుమార్ తూత్తుకుడి ఎస్ఐ కుమారుడిగా తెలిసింది. చదవండి: శివశంకర్ బాబా కోసం సీబీసీఐడీ వేట -
ప్రేమించినోడితో కూతురి పెళ్లి చేసిందని భార్యను..
సాక్షి, చెన్నై : ప్రేమించినోడితో కుమార్తెకు పెళ్లి చేసిందన్న ఆగ్రహంతో భార్యను భర్త అతి దారుణంగా హతమార్చి దహనం చేశాడు. తూత్తుకుడిలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. తేరువాయిపురం పోలీసుల కథనం మేరకు తూత్తుకుడి జిల్లా నటరాజపురానికి చెందిన మునుస్వామి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు సోమవారం వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, రెండు రోజుల క్రితం పెద్ద కుమార్తె సమీప గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. ఇది మునుస్వామికి పెద్ద షాక్‌గా మారింది. మరో యువకుడితో ప్రేమ అంటూ పెళ్లి చేసుకొచ్చిన కుమార్తె మీద ఆగ్రహాన్ని ప్రదర్శించి ఆమెను బయటకు గెంటేశాడు. అయితే, వీరి వివాహం తన భార్య లక్ష్మి సమక్షంలో జరిగినట్టుగా మునుస్వామి గ్రహించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం వేకువజామున తూత్తుకుడి జిల్లా కొళత్తూరు సమీపంలోని దురైస్వామి పురం ఆలయ దర్శనానికి అంటూ భార్యను వెంటబెట్టుకెళ్లాడు. అక్కడ అటవీ ప్రాంతంలో ఆమెను హతమార్చి, ఎవరూ గుర్తుపట్టని రీతిలో దహనం చేసి ఉడాయించాడు. ఎస్పీ జయకుమార్, విలాతి కులం డీఎస్పీ ప్రకాశ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చెల్లి ప్రేమ వ్యవహరం: అన్న దారుణ హత్య -
తూత్తుకుడి బాధితులకు ఉద్యోగాలిస్తాం
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని తుపాకీతో కాల్చి చంపిన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా స్టాలిన్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. రోడ్ షో, సభలతో ప్రచారం సాగింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. తూత్తుకుడిలో సాగిన తుపాకీ కాల్పులు, సాత్తాన్ కులం పోలీసుల నిర్వాకం, జుడీషియల్ కస్టడిలో తండ్రికుమారుల మరణం తదితర విషయాలను గుర్తు చేస్తూ ప్రసంగాన్ని అందుకున్నారు. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీగా కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లిన వారిని పిట్టలు కాల్చినట్టు కాల్చిచంపిన ఘటన నేటికి కళ్ల ముందు కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ఈ రాష్ట్రం ఏటు పోతున్నదో అన్న ఆందోళన కలుగుతోందన్నారు. ప్రజలపై తుటాల్ని ఎక్కుబెట్టి 13 మంది మరణానికి కారణమైన ఈ పాలకులకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కరోనా కారణంగా జీవనం కోల్పోయిన వారికి రూ. 4 వేల సాయం చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే కరుణానిధి జయంతి రోజున ఈ పంపిణికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. చదవండి: అర కోటి ఉద్యోగాలు.. ఫ్రీగా ట్యాబ్లెట్లు.. లైసెన్స్ -
ప్రజాస్వామం చచ్చిపోయింది.. చైనాకు తాకట్టు
తూత్తుకూడి: దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టడంతో దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనాకు సాగిలపడ్డాడని ఆరోపించారు. భారతదేశాన్ని చైనాకు అప్పగించారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తూత్తుకూడిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. సుదీర్ఘ రాజ్యాంగం ఉన్న భారతదేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదు.. ఆరేళ్లుగా ఒక ప్రణాళికపరంగా ప్రభుత్వ సంస్థలన్నింటిని ప్రభుత్వం వదిలేసుకుంటుందని రాహుల్ చెప్పారు. దేశంలో పార్లమెంట్, న్యాయ వ్యవస్థ, జర్నలిజం బలహీన పడుతుండడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఇంకెక్కడిది అని ప్రశ్నించారు. విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలను సమానంగా ఆరెస్సెస్ వాదులు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థల నిర్వీర్యంతో రాష్ట్రాల పాత్రను కూడా తగ్గించేస్తున్నారని.. అదే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రాహుల్ తెలిపారు. డబ్బు, అంగబలం ఎమ్మెల్యేలను నడిపిస్తోందని.. వాటితో ఎమ్మెల్యేలను బీజేపీ వేటాడుతోందని రాహుల్ పుదుచ్చేరి పరిణామాలను పరోక్షంగా ప్రస్తావించారు. -
కస్టడీ డెత్: మరో కీలక మలుపు
చెన్నై: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల కస్టడీ డెత్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు బెనిక్స్- జయరాజ్ కస్టోడియల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించినట్లు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ కేసును ప్రస్తుతం సీబీ- సీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశాల మేరకు తిరునల్వేలి డీఐజీ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.(రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఐదుగురి అరెస్టు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని చిత్ర హింసలు పెట్టగా వారు మృతి చెందారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించగా.. మెజిస్ట్రేట్ ఇటీవలే నాలుగు పేజీల నివేదిక అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.(కస్టడీ డెత్: పోలీసుల అరెస్టు.. స్థానికుల సంబరాలు) -
కస్టడీ డెత్: మరో కీలక పరిణామం
చెన్నై: తమిళనాడుకు చెందిన జయరాజ్, బెనిక్స్ కస్టడీ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రీకొడుకులను తీవ్రంగా గాయపరిచి వారి మృతికి కారణమైన ప్రధాన నిందితుడు, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేశ్‌తో పాటు మరో ఎస్సై బాలకృష్ణన్ సహా ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారు. వీరిపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్యానేరం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీ-సీఐడీ వర్గాలు వెల్లడించాయి. జయరాజ్, బెనిక్స్‌ల కస్టడీ డెత్తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పోలీసులను కూడా విచారిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకోసం 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా జయరాజ్, బెనిక్స్‌ల దారుణ మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు తప్పవంటూ తమిళనాడు న్యాయశాఖా మంత్రి సీ వీ షణ్ముగం ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితులు అరెస్టు కావడం గమనార్హం. (రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు) ఇదిలా ఉండగా.. కస్టడీ డెత్ నిందితులను పోలీసులు అరెస్టు చేయడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే తూత్తుకుడిలో సంబరాలు మొదలయ్యాయి. టపాసులు పేలుస్తూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు.. సత్తాన్‌కుళం పోలీసు స్టేషన్లో పనిచేసే పోలీసులంతా ఈ కేసులో అరెస్టు అవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఆ స్టేషన్ రెవెన్యూ విభాగం నియంత్రణలోకి వెళ్లింది. కాగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31)లను అరెస్టు చేసిన పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టి కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. పోలీసుల దాష్టీకానికి బలైన జయరాజ్, బెనిక్స్‌లకు న్యాయం జరగాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇక ఈ హేయమైన ఘటనపై తీవ్రంగా స్పందించిన మద్రాస్ హైకోర్టు.. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికలో పోలీసుల కర్కశత్వం, సత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ అధికారులకు చట్టం పట్ల ఉన్న గౌరవ మర్యాదలు ఏపాటివో తెలియజేస్తూ మెజిస్ట్రేట్ నాలుగు పేజీల నివేదిక అందజేశారు.(కస్టడీ డెత్: మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
అనూహ్య మృతి; 70 లక్షల పరిహారం
చెన్నై: తమిళనాడులో పోలీసు కస్టడీలో మరణించిన మృతుల కుటుంబానికి అధికార అన్నాడీఎంకే పార్టీ 25 లక్షల రూపాయల సహాయాన్ని శనివారం ప్రకటించింది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపంలోని సాత్తాన్‌కులం పోలీస్ స్టేషన్ కస్టడీలో మృతి చెందిన జయరాజ్(59), బెనిక్స్(31) కుటుంబానికి ఈ మొత్తాన్ని అందించనున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయానికి ఇది అదనమని పేర్కొంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నందూరితో కలిసి సమాచార శాఖ మంత్రి సి. రాజు శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతిపక్ష డీఎంకే పార్టీ కూడా బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తరపున ఎంపీ కనిమొళి శుక్రవారం మృతుల కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. దీంతో బాధిత కుటుంబానికి మొత్తం రూ. 70 లక్షల పరిహారం ప్రకటించినట్టు అయింది. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’) కాగా, ఈ దారుణ ఘటనపై తూత్తుకుడి ఎస్పీ శుక్రవారం మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌కు నివేదిక సమర్పించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కోర్టుకు వివరాలు తెలిపారు. పోస్ట్‌మార్టం ప్రక్రియ పూర్తయిందని, అక్కడ కర్ఫ్యూ కొనసాగుతున్నందున నివేదిక ఇంకా రాలేదని వెల్లడించారు. మరోవైపు జయరాజ్, బెనిక్స్ మరణానికి కారకులైన పోలీసులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. (తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి) -
అయ్యో.. భగవంతుడా!
సాక్షి, చెన్నై: సంక్రాంతి సంబరాలు, ఆలయాల సందర్శనలోని ఆనందం ఆ రెండు కుటుంబాల్లో ఎంతోసేపు నిలవలేదు. విహారయాత్రగా ఆలయాల సందర్శనకని బయలుదేరిన ఆ కుటుంబసభ్యులపై విధివైపరీత్యం కంటైనర్ లారీ రూపంలో విరుచుకుపడింది. ఇద్దరు యువతులు, ఒక బాలుడు సహా నలుగురు ప్రాణాలను హరించివేసింది. చెన్నై అడయారులోని శాస్త్రినగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సుభాష్ చంద్రబోస్ (73) సంక్రాంతి పండుగ రోజుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించాలని తలంచారు. భార్య లక్ష్మిప్రియ, కుమార్తె కవిత, అల్లుడు ఆనంద్, మనుమరాలు రమ్య (20), మనుమడు వీరేంద్రన్ (15), రమ్య స్నేహితురాలైన చెన్నై నంగనల్లూరుకు చెందిన భార్గవి (23)లతో ఈనెల 16వ తేదీన రెండు కార్లలో బయలుదేరారు. సుభాష్ చంద్రబోస్, లక్ష్మిప్రియ, కవిత, ఆనంద్ ఒకకారులో ఎక్కగా చెన్నైకి చెందిన చంద్రన్ డ్రైవర్ ఈ కారును నడిపాడు. అలాగే మరో కారులో వెనుక సీటులో రమ్య, భార్గవి, ముందు సీటులో వీరేంద్రన్ ఎక్కగా తిరుచ్చిరాపల్లికి చెందిన జోస్వ (30)అనే వ్యక్తి కారును నడిపాడు. చెన్నై నుంచి విరుదనగర్, మదురైజిల్లాల్లోని ఆలయాలను సందర్శించుకుని శుక్రవారం రాత్రి 7 గంటలకు మదురై నుంచి తిరుచెందూరుకు ప్రయాణమయ్యారు. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో రమ్య, భార్గవి ప్రయాణిస్తున్న కారును తూత్తుకూడి స్టెర్లైట్ కంపెనీకి సమీపంలోని ఫ్లైఓవర్‌పై వెళుతుండగా మదురై వైపు వెళుతున్న కంటైనర్ లారీ అతివేగంగా ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో కారు ముందుభాగం సగభాగానికి పైగా లారీ కిందకు దూసుకెళ్లడంతో రమ్య, భార్గవి, వీరేంద్రన్, డ్రైవర్ జోస్వ శరీరాలు ఛిద్రమై సంఘటన స్థలంలోనే మృతిచెందారు. బాలుడు వీరేంద్రన్ మృతదేహం లారీ ముందుభాగంలో ఇరుక్కుపోవడంతో జేసీబీని రప్పించి సుమారు నాలుగు గంటలు శ్రమించి బయటకు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌లారీ డ్రైవర్ చంద్రశేఖర్‌ను సిప్కాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోట్లు కుమ్మరిస్తా ప్రాణాలు కాపాడండి.. ప్రమాదానికి గురైన కారు ఎంతకూ రాకపోవడంతో తమ కారును వెనక్కి మళ్లించిన సుభాష్‌చంద్రబోస్ ప్రమాదస్థలిని చేరుకుని హతాశులైనారు. నెత్తుటి మడుగులో విగతజీవులై పడి ఉన్న రమ్య, వీరేంద్రన్, భార్గవిల మృతదేహాలను చూసి విలవిలలాడిపోయారు. నడిరోడ్డుపై గుండెలవిసేలా రోదించించడం సహాయక చర్యల్లో ఉన్న వారందరినీ కంటతడిపెట్టించింది. పోస్టుమార్టం జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్న సుభాష్‌చంద్రబోస్ ‘నాకు ఐదువేల కోట్లరూపాయల ఆస్తి ఉంది, ఒక్కో డాక్టర్‌కు రూ.5 కోట్లు ఇస్తాను, బిడ్డలను కాపాడండి’ అంటూ వైద్యుల చేతులు పట్టుకుని బ్రతిమాలడం అందరి గుండెలను బరువెక్కించింది. నలుగురూ సంఘటన స్థలంలోనే మృతి చెందారని వైద్యులు ఆయనకు నచ్చజెప్పారు. -
పాముతో వీరోచితంగా పోరాడి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్‌సెల్వి ప్లస్‌టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ శునకానికి అప్పు, ఆడ శునకానికి నిమ్మి అనే పేర్లు పెట్టి ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. ఈనెల 3న రాత్రి పొన్‌సెల్వి తన కుమార్తెలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, కుక్కలు రెండూ బయట ఉన్నాయి. అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము వారింటివైపు రావడంతో రెండు కుక్కలు పెద్దగా మొరగడం ప్రారంభించాయి. మగ కుక్క అప్పు ఒక్క ఉదుటున పాముపై లంఘించి కరవడం ప్రారంభించింది. అలాగే పాము సైతం అప్పును అనేకసార్లు కాటువేసింది. అయినా అప్పు ఆ పామును వదలకుండా నోటకరుచుకుని కొరుకుతూనే బయటి మెట్లగుండా మిద్దెపైకి తీసుకుని వెళ్లి చంపేసింది. పాముకాటు విషం వల్ల కుక్క సైతం ప్రాణాలు విడిచింది. గురువారం తెల్లారిన తరువాత ఇంటి బయటకు వచ్చిన పొన్సెల్వికి ఆడ శునకం మాత్రమే కనపడడంతో అప్పుకోసం అంతటా గాలించింది. మిద్దెపైకి వెళ్లి చూడగా పాము, కుక్క చనిపోయి పడి ఉన్నాయి. పాము కాటు నుంచి తమ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలనే అర్పించిందని ఆమె కన్నీరుమున్నీరైంది. రెండింటినీ దూరంగా తీసుకెళ్లి గొయ్యితవ్వి పాతిపెట్టింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: తమిళనాడులోని వివాదాస్పద తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ పున: ప్రారంభంపై సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమిళనాడు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత అలాగే కొనసాగుతుందని సోమవారం తీర్పు వెలువరించింది. స్టెరిలైట్ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును అమలు పరిచేలా తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని వేదాంత గ్రూపు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. ఎన్జీటీకి ఈ కేసుపై విచారణ చేపట్టే అధికార పరిధి లేదని పేర్కొంది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించాలని వేదాంత గ్రూపుకు సూచించింది. ‘స్టెరిలైట్’ రాగి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసేయాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామి ఆదేశాలు జారీ చేయగా.. వేదాంత గ్రూప్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్జీటీ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ గత డిసెంబర్ 15 ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ గతేడాది నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
తూత్తుకూడి కాల్పుల్లో నిబంధనల ఉల్లంఘన
తూత్తుకూడి: తమిళనాడులోని తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ ఈ ఏడాది మే నెలలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. చనిపోయిన 13 మందిలో 12 మందికి బుల్లెట్లు ఛాతీ లేదా అంతకన్నా పై భాగంలోనే తగిలాయనీ, సగం మంది శరీరాల్లోకి బుల్లెట్లు వెనుకవైపు నుంచి దూసుకెళ్లాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి అక్కడి పోలీసులు నిబంధనలను ఎంత తీవ్రంగా ఉల్లంఘించారో తెలుస్తోంది. భారత్‌లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం నిరసనల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటినప్పుడు మాత్రమే భద్రతా దళాలు కాల్పులు జరిపేందుకు అనుమతి ఉంది. కాల్పులు జరిపినా వాటి లక్ష్యం ఆందోళనలను అణచివేయడమే తప్ప మనుషులను చంపడం అయ్యుండకూడదు. తల, ఛాతీ, గుండె భాగంలో బుల్లెట్ తగలకుండా శరీరంలో వీలైనంత కింద భాగంలో, గరిష్టంగా నడుము వరకు ఉన్న భాగంలో మాత్రమే కాల్చాలి. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆందోళనకారుల ప్రాణాలు తీయడానికి అన్నట్లు ఈ ఏడాది మే నెలలో పోలీసులు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు 17 ఏళ్ల బాలిక కాగా, బుల్లెట్ ఆమె తల వెనుక భాగంలో తగిలి నోటి నుంచి బటయకొచ్చిందని పోస్ట్‌మార్టంలో తేలింది. -
స్టెరిలైట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరవాల్సిందే!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని వివాదాస్పద స్టెరిలైట్ కర్మాగారాన్ని మళ్లీ తెరవాలంటూ జాతీయ గ్రీన్ ట్రిబునల్ శనివారం ఆదేశాలు ఇచ్చింది. తుత్తుకుడిలోని వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ కర్మాగారానికి వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేయగా.. పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో స్టెరిలైట్ ప్యాక్టరీని మూసివేస్తూ తమిళనాడు ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జాతీయ గ్రీన్ ట్రిబునల్ తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను తప్పుబట్టింది. మళ్లీ స్టెరిలైట్ కర్మాగారాన్ని తెరువాలంటూ ఆదేశాలు ఇచ్చింది. కంపెనీ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని, మూడు వారాల్లో కర్మాగారాన్ని పునఃప్రారంభించేందుకు వీలుగా అనుమతులన్నీ జారీచేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేసింది. ట్రిబ్యునల్ ఆదేశాలపై పర్యావరణ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
విహారంలో విషాదం..!
ఊటీ అందాలను తిలకించేందుకు వెళ్లిన మిత్ర బృందం అదృశ్యం అయ్యింది. రెండు రోజులుగా రిసార్ట్‌కు ఆ బృందం తిరిగి రాకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. బుధవారం పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు ముమ్మరం చేయడంతో ఓ లోయలో ఆ బృందం వెళ్లిన కారును గుర్తించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఐదుగురు మరణించగా, కొన ఊపిరితో ఉన్న ఇద్దర్ని రెస్క్యూ టీం రక్షించింది. సాక్షి, చెన్నై : చెన్నైకి చెందిన మిత్ర బృందం రామరాజేష్, రవివర్మ, ఇబ్రహీం, జయకుమార్, అరుణ్, అమర్నాథ్, జూడో గత నెల 30న చెన్నై నుంచి ఓ కారులో ఊటీకి వెళ్లారు. అక్కడి ఓ రిసార్ట్‌ను అద్దెకు తీసుకున్నారు. తొలిరోజు ఊటీలో ఉన్న ఈ మిత్రులు, ఒకటో తేదీన ముదుమలై శరణాలయం సందర్శనకు బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఎంతకు తిరిగి రాలేదు. రెండు రోజలైనా ఆ ఏడుగురు తిరిగిరాక పోవడం, రిసార్ట్ సిబ్బందిలో అనుమానాలు నెలకొన్నాయి. వెళ్లిన వారు అదృశ్యం కావడంతో, వారు ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్‌చేశారు. అవన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆందోళన బయలుదేరింది. బుధవారం మధ్యాహ్నం ఊటీ పోలీసులకు విషయాన్ని అందించారు. లోయలో కారు రిసార్ట్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఊటీ నుంచి ముదుమలై వైపు మార్గంలో పరిశీలన చేపట్టారు. కళ్లట్టిమలుపు 35వ క్రాస్ వద్ద ఆగిన ఆ ప్రత్యేక బృందం అక్కడి లోయ మీద దృష్టి పెట్టింది. లోయలో చెట్ల మధ్యలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఆందోళన బయలుదేరింది. ఆ పరిసరాలు పొదళ్లతో నిండి ఉండడంతో లోయలో దిగడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద ఒకరిద్దరు లోయలోకి దిగారు. అయినా, కారును సమీపించలేని పరిస్థితి. దీంతో రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. ఈ బృందం అతి కష్టం మీద కారును సమీపించింది. ఐదుగురు బలి ఐదుగురు విగత జీవులయ్యారు. ఇద్దరు కొన ఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. ఓ వైపు చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆగమేఘాలపై లైటింగ్ ఏర్పాట్లు చేసి లోయలో ఉన్న కారులో కొన ఊపిరితో ఉన్న ఇద్దరినీ రక్షించారు. అతి కష్టం మీద వారిని పైకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగి రెండు రోజులు అవుతుండడంతో గాయాలతో ఉన్న ఆ ఇద్దరు ఏ మేరకు నరకాన్ని అనుభవించి ఉంటారో వర్ణణాతీతం. పొదలతో కూడిన లోయ కావడంతో ఎవరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేని పరిస్థితి. ఈ సమాచారం చెన్నైలోని ఆ ఏడుగురి కుటుంబాల్ని ఆందోళనలో పడేసింది. ఊటీకి పరుగులు తీశారు. కాగా, ముదుమలై శరణాలయానికి వెళ్లే మార్గంలో వాహనం అదుపు తప్పి లోయలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, లోయలోకి కారు దూసుకెళ్లిన సమయంలో పిట్ట గోడల వద్ద ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో అనుమానాలు బయలుదేరాయి. దీంతో పోలీసులు ఆదిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మృతి చెందిన ఐదుగురిలో రవి వర్మ, అమరనాథ్, జూడో, జయకుమార్, ఇబ్రహీం ఉన్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామరాజేష్, అరుణ్‌లకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ఇద్దరు స్పృహలోకి వస్తేనే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందో తేలనుంది. విహార యాత్రలో పాల్గొన్న వారి ఫోటో (మూలం: సోషల్ మీడియా) -
కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...
సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..? ‘స్టెరిలైట్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్ అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్ వైద్యనాథన్(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్ చేశారు. Vedanta approached the NGT against this order & Senior Counsel CS.Vaidhyanathan represented TN govt. Counsel for TN govt should have prepared adequately to defend the TN govt order of closure. But, the briefing & discussion on yesterday's hearing was done only at 10am yesterday. — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 The briefing and discussion on the hearing should have been done by Counsel CS.Vaidhyanathan at least a day before. But, CS.Vaidhyanathan was busy justifying the denial of space to our leader Kalaignar at Marina in Madras HC yesterday. 3/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 Or was this done deliberately by the government for Edappadi Palaniswami is taking TN to its lowest point in governance. 4/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 -
గురి పెట్టి కాల్చి చంపారు!
ప్రజల్ని గురిపెట్టి తూపాకులతో కాల్చి మరీ చంపేశారని పోలీసులపై మక్కల్ విచారణ ఇయక్కం ఆరోపించింది. తమ విచారణలో వెలుగుచూసిన అంశాలతో కూడిననివేదికను సోమవారం ఆ ఇయక్కం విడుదల చేసింది. కాగా, స్టెరిలైట్ పరిశ్రమకు పడ్డ తాళాన్ని తొలగించేందుకు తగ్గ ప్రయత్నాల్ని ఆ యాజమాన్యం వేగవంతం చేసింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది. సాక్షి, చెన్నై : తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. మే 22వ తేదీ సాగిన ర్యాలీ అల్లర్లకు దారితీసింది. దీంతో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరిపారు. ఇందులో 13 మంది విగత జీవులయ్యారు. ఈ ఘటనపై పలు కోణాల్లో విచారణ సాగుతూ వస్తోంది. ఓ వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర కమిషన్ వేర్వేరుగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్, సీబీసీఐడీ నేతృత్వంలో... ఇలా అన్ని వైపులా విచారణసాగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ ఘటనపై మక్కల్ విచారణ ఇయక్కం సైతం విచారణజరిపింది. కొన్ని రోజుల పాటు తూత్తుకుడిలో తిష్టవేసి పలు వర్గాల నుంచి సేకరించిన సమాచారాలు, సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, వివరాల మేరకు ఈ ఇయక్కం నివేదికను సిద్ధం చేసింది. నివేదికలో తేటతెల్లం కాల్పుల ఘటనపై ఇప్పటికే పోలీసులు, తూత్తుకుడి జిల్లా యంత్రాంగం మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. వీటికి బలం చేకూర్చే రీతిలో తాజా నివేదికలోని అంశాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నివేదికను సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ విడుదల చేయగా, వర్తక సంఘం నేత వెల్లయ్యన్ అందుకున్నారు. అందులోని వివరాల మేరకు.. ర్యాలీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో చడీచప్పుడు కాకుండా పోలీసులు రాత్రికి రాత్రే 144 సెక్షన్‌ను అమల్లోకి తీసుకొచ్చారని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయలేదని స్పష్టంచేశారు. ర్యాలీలో తమ కుటుంబాలతో కలిసి ప్రజలు పాల్గొన్నాయని, శాంతియుతంగా సాగుతున్న ర్యాలీలో ఒక్కసారిగా పోలీసుల లాఠీ చార్జ్, తూటాలు ప్రజల్లో భయాందోళన సృష్టించాయని వివరించారు. లాఠీచార్జ్ తదుపరి యూనిఫాంలో లేని (మఫ్టీలో ఉన్న) వాళ్లు వాహనాల మీద ఎక్కి నేరుగా ప్రజల్ని గురిపెట్టి మరి తుపాకులతో కాల్చి పడేశారని ఆందోళన వ్యక్తంచేశారు. తుపాకీ కాల్పుల సమయంలో పాటించా ల్సిన ఏ ఒక్క నిబంధనల్ని పోలీసులు అనుసరించలేదని, నేరుగా ప్రజల మీద గురిపెట్టి మట్టు బెట్టే రీతిలో కాల్పులు సాగించారని స్పష్టంచేశారు. ఇందులో విద్యార్ధిని నాన్సీ మరణం కూడా ఉందని పేర్కొన్నారు. ఇలా మరెన్నో వివరాలను అందులో పొందుపరిచారు. ఉన్నతాధికారుల్ని విచారించాలి తూత్తుకూడి కాల్పుల ఘటనపై పూర్తిగా విఫలమైన ఆ జిల్లా యంత్రాంగం, విచ్చలవిడిగా కాల్పులు జరిపిన పోలీసులు, దీని వెనుక ఉన్న పోలీసు ఉన్నతాధికారుల్ని విచారించాల్సిన అవసరం ఉందని మక్కల్ విచారణ ఇయక్కం సూచించింది. తూత్తుకుడిలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉన్నా, పోలీసులు మాత్రం హడావుడి సృష్టిస్తూనే ఉన్నారని, అరెస్టులు, బలవంతపు నిర్భందాలు సాగుతూనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఇయక్కం ప్రతినిధులు హరి భరదన్, తిలక్ సెల్వరాజ్, షా విశ్వనాథన్, కృష్ణ దాసు గాంధీ, కవిత, గీత, రోశయ్య, రాందాసు తదితరులు పాల్గొన్నారు. తాళం తెరిచేనా? మూతపడ్డ పరిశ్రమను తెరిచేందుకు స్టెరిలైట్ యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పరిశ్రమలోని రసాయనాలను ప్రస్తుతం ఆ జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో తొలగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని విధులకు హాజరవ్వాలని యాజమాన్యం ఆదేశాలివ్వడం చర్చకు దారితీసింది. ఈ పరిశ్రమలో రెండు వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానికంగా ఉన్న సిబ్బంది తూత్తుకుడిలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ విధులకు హాజరు కావాలని ఆ యాజమాన్యం ఆదివారం ఆదేశాలు నుంచి వెళ్లడం, సోమవారం ఉదయాన్నే పరిశ్రమ వద్ద సిబ్బంది గుమిగూడడం చోటు చేసుకున్నాయి. పరిశ్రమకు అనుబంధంగా ఉన్న స్టాఫ్ క్వార్టర్స్ వద్ద సిబ్బంది అందరూ ఏకం అయ్యారు. అందరూ రిజిస్టర్లో సంతకాలు చేశారు. విధులకు హాజరు అవుతున్నట్టుగా సంతకాల తదుపరి, అక్కడే సిబ్బందితోపాటు ఆ పరిశ్రమ అధికారులు సమావేశం కావడం గమనార్హం. -
నటి నీలాణికి బెయిల్ మంజూరు
పెరంబూరు: నటి నీలాణికి సైదాపేట కోర్టు నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇటీవల తూత్తుక్కుడి కాల్పుల సంఘటనపై నటి నీలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియోలో చిత్రీకరించిన విషయం, పోలీసులు ఆందోళన కారులపై కాల్పులు జరిపిన దృశ్యాలతో కూడిన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత మే నెల 22న వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆ వీడియో తీసింది ఎవరని దర్యాప్తు చేయగా స్థానిక సాలిగ్రామం, అష్టలక్ష్మీనగర్కు చెందిన నటి నిలాణి అని తెలిసింది. దీంతో ఆమెను ఈ నెల 19వ తేదీన అరెస్ట్ చేసి సైదాపేట కోర్టులో హాజరు పరిచారు. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు పుళల్ జైలుకు తరలించారు. కాగా నటి నిలాణి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకుంది. ఆ పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు నటి నీలానికి ‘పోలీసులకు సహకరించాలి, నగరం దాటి వెళ్లకూడదు’ లాంటి నిబంధనలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. -
తలైవాపై కేసా?
ఉద్యమకారుల్ని సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ తలైవా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కేసు నమోదుకు దారితీసేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ విషయంగా కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు బుధవారం మద్రాసు హైకోర్టు సూచించడం గమనార్హం. కాగా, కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణ తూత్తుకుడిలో మొదలైంది. సాక్షి, చెన్నై : తూత్తుకూడిలో రజనీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్టెరిలైట్ ఉద్యమం పయనంలో భాగంగా గత నెల సాగిన ర్యాలీ కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది బలయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితుల్ని అన్ని పార్టీ ల నేతలు పరామర్శిస్తూ వచ్చారు. అలాగే, దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం బాధితుల్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడే క్రమంలో ఆయన నోరు జారారు. ఉద్యమ కారుల్ని సంఘ విద్రోహశక్తులుగా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పోలీసుల మీద దాడి జరగడంతోనే కాల్పులకు పరిస్థితులు దారితీసినట్టు, సంఘ విద్రోహశక్తులు ఉన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని అస్త్రంగా చేసుకుని హొసూరు శిలంబరసన్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేయాలని కోరారు. పోలీసులు ఖాతరు చేయకపోవడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ప్రకాశ్ ‘కింది కోర్టును ఎందుకు ఆశ్రయించ లేదు’ అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. రజనీకాంత్‌పై కేసు నమోదు విషయంగా కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. దీంతో కింది కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ ప్రయత్నాల మీద శిలంబరసన్ దృష్టి పెట్టారు. కింది కోర్టు ఏదేని ఆదేశాలు ఇచ్చిన పక్షంలో తలైవా మీద కేసు నమోదు అయ్యేనా అన్న ప్రశ్న బయలుదేరింది. సీబీసీఐడీ విచారణ తూత్తుకుడి కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణకు శ్రీకారం చుట్టింది. ఆ విభాగం ఎస్పీ ప్రవీణ్ కుమార్ అభినవ్ నేతృత్వంలోని బృందం బుధవారం తూత్తుకుడికి చేరుకుంది. అక్కడి సీబీసీఐడీ కార్యాలయంలో సిబ్బందితో భేటీ తదుపరి సంఘటన జరిగిన ప్రాంతాల్లో అభినవ్ పర్యటించారు. కాల్పుల ఘటన, అల్లర్లకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేశారు. అలాగే, జిల్లా ఎస్పీ మురళీ రంభతో భేటీ అయ్యారు. స్థానికపోలీసులు నమోదుచేసిన ఐదు రకాల సెక్షన్లతో కూడిన కేసుల వివరాల్ని తెలుసుకున్నారు. తమదైన శైలిలో విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీబీసీఐడీ ఎస్సీ అభినవ్ నేతృత్వంలోని బృందం ముందుకు సాగుతోంది. -
తూత్తుకుడి బాధితులకు విజయ్ ఆర్థిక సాయం