
బాధితులతో మాట్లాడుతున్న హీరో విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాట ప్రకంపనలు సృష్టించిన తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ బాధితులను పరామర్శించి వారికి మద్ధతుగా నిలిచారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఆర్థిక సాయం ప్రకటించారు.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా మృతుల కుటుంబాలను కలిసి వారికి తనవంతు ఆర్థిక సాయం అందిచారు. మంగళవారం (జూన్ 5) రాత్రి రహస్యంగా బైకుపై తూత్తుకుడి చేరుకున్న విజయ్ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. మళ్లీ అభిమానుల హడావుడి లేకుండా తూత్తుకుడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా మీడియాకు తెలిసే లోపే విజయ్ చెన్నైలో ఉండటం ఇప్పడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అంతా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్న ఈ పరిస్థితులలో యువ హీరో దాతృత్వం ఇప్పుడు ఆయన సినీ హీరోకాదు నిజజీవిత హీరో అంటూ మన్ననలు పొందుతున్నారు. తూత్తుకుడిలో విజయ్ బైక్‌పై ప్రయాణించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




Comments
Please login to add a commentAdd a comment