కోలీవుడ్లో సూపర్‌స్టార్ ఎవరనే రచ్చ మళ్లీ రగులుతోంది. గతంలో త్యాగరాజన్ భాగవతార్ తొలి సూపర్‌స్టార్‌గా వెలిగారు. ఆ తర్వాత మక్కల్ తిలకం ఎంజీఆర్‌కు ఆ పట్టాన్ని అభిమానులు అందించారు. అనంతరం కమలహాసన్, రజినీకాంత్ పోటీ పడుతూ వచ్చారు కానీ మాస్ ఫాలోయింగ్‌తో రజనీకాంత్‌నే గత నాలుగు దశాబ్దాలుగా సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారు. విశ్వనటుడుగా పేరుగాంచిన కమలహాసన్ దాని జోలికి వెళ్లలేదు. అలాంటిది ఇటీవల వారీసు తెలుగు వెర్షన్ వారసుడు చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఆ చిత్ర నిర్మాత కోలీవుడ్ సూపర్‌స్టార్ విజయ్ అని పేర్కొనడం చర్చకు కాదు కాదు పెద్ద వివాదానికే తెరలేపింది.
ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వంటి కొందరు కూడా దీనికి వంత పాడారు. అలా కొన్నిరోజులు సాగిన ఈ దుమారం ఆ తర్వాత చల్లబడింది. అలాంటిది ఇప్పుడు మరోసారి సూపర్‌స్టార్ ఎవరన్న అంశంపై రచ్చ వేడెక్కింది. ఇందుకు కారణం లేకపోలేదు నటుడు రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం జైలర్ కేరళ రాష్ట్రంలో అయిన వ్యాపారం కంటే నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న లియో చిత్ర బిజినెస్ అధికంగా జరిగిందని సమాచారం. మరో కారణం కూడా ఉంది. విజయ్ ప్రస్తుతం రూ.120 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. రజనీకాంత్ కూడా అంతే పారితోషకాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం.
(చదవండి: ఆ డైరెక్టర్ అంతే ఇష్టమొచ్చినట్లు తిట్టేస్తాడు: ఉదయనిధి స్టాలిన్)
అయితే విజయ్ తన 68వ చిత్రానికి రూ.200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అలా ఏవిధంగా చూసినా విజయ్ నే సూపర్‌స్టార్ అనే ఒక వర్గం గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ చర్చలోకి నటుడు కమలహాసన్ పేరు కూడా చేరింది. ఇటీవల ఈయన నటించి, నిర్మించిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. అదేవిధంగా ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్–2 చిత్రానికి రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకపక్క బిగ్ బాస్ రియాల్టీ గేమ్స్ అత్యధిక తీసుకుంటున్నారని, ఇంకోపక్క నిర్మాతగా వరుసగా చిత్రాలు నిర్మించడంతో ఈయన వార్షిక ఆదాయం రజనీకాంత్, విజయ్ కంటే చాలా ఎక్కువ అని కాబట్టి కమలహాసన్‌నే సూపర్‌స్టార్ అని ఆయన అభిమానులు గళమెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment