sterlite protest
-
తమళనాట హీటెక్కిన రాజకీయం..రజనీకి సమన్లు
చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ఇదివరకే అనౌన్స్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పాత కేసులు పలకరిస్తున్నాయి. తాజాగా తూత్తుకుడి కేసు విచారణకు హాజరు కావల్సిందిగా రజనీకి సమన్లు జారీ చేశారు. ఈ విషయంపై జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని సింగిల్ జడ్జి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్‌కు కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీలో ఫైరింగ్ జరగడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. (లతా రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసులు) దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్ట్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజనీకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. తూత్తుకుడి ఘటనలో పోలీసుల చర్యను సైతం ఆయన తప్పుబట్టారు. దీనిపై విచారణకు హాజరు కావాల్సిందిగా రజినీకి కమిషన్ సమన్లు జారీ చేయగా మినహాయింపు కోరారు. తాజాగా ప్రజలు ప్రతీ అంశంలో నిరసనలు ప్రారంభిస్తే అప్పుడు తమిళనాడు మొత్తం స్మశానవాటిక అవుతుందని పేర్కొన్నాడు. రజినీ రాజకీయాల్లో చేరబోయే కొద్దిసేపటి క్రితమే ఈ వ్యా్ఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా రజనీ పార్టీ అనౌన్స్మెంట్ చేశాక ఒక్కసారిగా కేసులు చుట్టుముట్టడంతో గమనార్హం. (రజనీతో పొత్తుకు సిద్ధం: కమల్‌హాసన్) -
తూత్తుకూడి కాల్పుల్లో నిబంధనల ఉల్లంఘన
తూత్తుకూడి: తమిళనాడులోని తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ ఈ ఏడాది మే నెలలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. చనిపోయిన 13 మందిలో 12 మందికి బుల్లెట్లు ఛాతీ లేదా అంతకన్నా పై భాగంలోనే తగిలాయనీ, సగం మంది శరీరాల్లోకి బుల్లెట్లు వెనుకవైపు నుంచి దూసుకెళ్లాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి అక్కడి పోలీసులు నిబంధనలను ఎంత తీవ్రంగా ఉల్లంఘించారో తెలుస్తోంది. భారత్‌లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం నిరసనల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటినప్పుడు మాత్రమే భద్రతా దళాలు కాల్పులు జరిపేందుకు అనుమతి ఉంది. కాల్పులు జరిపినా వాటి లక్ష్యం ఆందోళనలను అణచివేయడమే తప్ప మనుషులను చంపడం అయ్యుండకూడదు. తల, ఛాతీ, గుండె భాగంలో బుల్లెట్ తగలకుండా శరీరంలో వీలైనంత కింద భాగంలో, గరిష్టంగా నడుము వరకు ఉన్న భాగంలో మాత్రమే కాల్చాలి. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆందోళనకారుల ప్రాణాలు తీయడానికి అన్నట్లు ఈ ఏడాది మే నెలలో పోలీసులు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు 17 ఏళ్ల బాలిక కాగా, బుల్లెట్ ఆమె తల వెనుక భాగంలో తగిలి నోటి నుంచి బటయకొచ్చిందని పోస్ట్‌మార్టంలో తేలింది. -
కరుణానిధి అంత్యక్రియలను అడ్డుకోవాలనే...
సాక్షి, చెన్నై : దివంగత నేత, కలైంజ్ఞర్ కరుణానిధి అంత్యక్రియల విషయంలో పళనిసామి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఆయన కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి మండిపడ్డారు. కరుణానిధి అంత్యక్రియలు అడ్డుకోవడంలో శ్రద్ధ చూపిన ప్రభుత్వం.. తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ తెరవకుండా వేదాంత గ్రూపును మాత్రం అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. పర్యావరణ నిబంధనలు, కోర్టులో పిటిషన్లను సాకుగా చూపుతూ అధికార అన్నాడీఎంకే ప్రభుత్వం మెరినా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు అడ్డుపుల్ల వేసిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమ తెరిచేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్.. వేదాంత గ్రూపునకు గురువారం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కనిమొళి ప్రభుత్వ తీరును విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా..? ‘స్టెరిలైట్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. కానీ పరిశ్రమను తెరిచేందుకు వేదాంత గ్రూపునకు ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతినిచ్చింది. కలైంగర్ అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో జరగకుండా అడ్డుకునేందుకు సీఎస్ వైద్యనాథన్(ప్రభుత్వ న్యాయవాది) తీవ్రంగా శ్రమించారు. కానీ ప్రజల ప్రాణాలు బలిగొన్న పరిశ్రమను తెరవకుండా సరైన వాదనలు వినిపించలేకపోయారు. తమిళనాడును అన్ని విధాలుగా దిగజార్చేందుకే సీఎం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం కలుగుతుందంటూ’ కనిమొళి ట్వీట్ చేశారు. Vedanta approached the NGT against this order & Senior Counsel CS.Vaidhyanathan represented TN govt. Counsel for TN govt should have prepared adequately to defend the TN govt order of closure. But, the briefing & discussion on yesterday's hearing was done only at 10am yesterday. — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 The briefing and discussion on the hearing should have been done by Counsel CS.Vaidhyanathan at least a day before. But, CS.Vaidhyanathan was busy justifying the denial of space to our leader Kalaignar at Marina in Madras HC yesterday. 3/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 Or was this done deliberately by the government for Edappadi Palaniswami is taking TN to its lowest point in governance. 4/4 — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) August 10, 2018 -
పాపులారిటి కోసమే..
పెరంబూరు: పోలీసులను తప్పుగా చిత్రీకరించాలన్నది తన ఉద్దేశం కాదు. పాపులారిటీ కోసమే అలా చేశాను అని బుల్లితెర నటి నిలాణి పోలీసుల విచారణలో వివరించింది. ఇటీవల తూత్తుకుడి కాల్పులు సంఘటన రాష్ట్రంలో కలకలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. నటుడు రజనీకాంత్ లాంటి వారే ఈ వ్యవహారంలో తీవ్ర వ్యతిరేకతను చవిచూసిన విషయం విదితమే. కాగా ఆ సంఘటనలో పోలీసుల కాల్పులను, ప్రజల హాహా కారాలను, ప్రాణాలు బలిగొన్న దృశ్యాలను బుల్లితెర నటి నిలాణి పోలీసు దుస్తులు ధరించి వీడియో తీసి కామెంట్స్‌తో సహా దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో స్థానిక వడపళనికి చెందిన రిషీ అనే వ్యక్తి గత 22వ తేదీన వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బుల్లితెర నటి నిలాణిపై కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ చంద్రు నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.అందులో ఈ వీడియోను తీసిన యువతి స్థానిక సాలిగ్రామానికి చెందిన బుల్లితెర నటి నిలాణి అని తెలిసింది. బుధవారం వేకువ జామున పోలీసులు నీలాణిని నీలగిరి జిల్లా కున్నూర్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో నిలాణి ఇచ్చిన వాంగ్మూలంలో తంజావూరుకు చెందిన తనకు చిన్నతనం నుంచి నటన అంటే చాలా ఇష్టం అని, అయితే సినిమాలో అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై చిన్న చిన్న పాత్రలు ధరిస్తున్నట్లు చెప్పిందన్నారు. ఇటీవల జల్లికట్టు పోరాటంలో పాల్గొన్నానని, అయినా తనకు గుర్తింపు రాకపోవడంతో తూత్తుకుడి కాల్పుల సంఘటన వీడియో తీసి పాపులర్ అవ్వాలన్న ఆలోచనతోనే అలా చేశానని, అంతే గానీ పోలీసులను తప్పుగా చిత్రీకరించాలన్నది తన ఉద్దేశం కాదని నిలాణి పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. -
తూత్తుకుడి బాధితులకు విజయ్ ఆర్థిక సాయం
-
బైకుపై వెళ్లి సాయం చేసిన స్టార్ హీరో
సాక్షి, చెన్నై: తమిళనాట ప్రకంపనలు సృష్టించిన తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట బాధితులకు సినీ ప్రముఖుల నుంచి మద్ధతు లభిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ బాధితులను పరామర్శించి వారికి మద్ధతుగా నిలిచారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఆర్థిక సాయం ప్రకటించారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా మృతుల కుటుంబాలను కలిసి వారికి తనవంతు ఆర్థిక సాయం అందిచారు. మంగళవారం (జూన్ 5) రాత్రి రహస్యంగా బైకుపై తూత్తుకుడి చేరుకున్న విజయ్ బాధిత కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. మళ్లీ అభిమానుల హడావుడి లేకుండా తూత్తుకుడి నుండి వెళ్లిపోయారు. ఇదంతా మీడియాకు తెలిసే లోపే విజయ్ చెన్నైలో ఉండటం ఇప్పడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అంతా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్న ఈ పరిస్థితులలో యువ హీరో దాతృత్వం ఇప్పుడు ఆయన సినీ హీరోకాదు నిజజీవిత హీరో అంటూ మన్ననలు పొందుతున్నారు. తూత్తుకుడిలో విజయ్ బైక్‌పై ప్రయాణించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
నేనూ సంఘ విద్రోహినే
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కాయి. సినీ దిగ్గజాలు కమలహాసన్, రజనీకాంత్ రంగంలోకి దిగడంతో రాజకీయాలు రసకందాయకంగా మారాయి. 25 ఏళ్లుగా రాజకీయాల్లోకి వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వచ్చిన రజనీ ఇనాళ్లకు రాజకీయ రంగస్థలంలోకి దూకడానికి సిద్ధం అవుతున్నారు. ఆయన సమకాలీన నటుడు కమలహాసన్ అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశంతో పాటు పార్టీ పేరు, జెండానూ కూడా ప్రకటించేసి జనాల్లోకి చొచ్చుకుపోతున్నారు. కమల్,రజనీలిద్దరూ రాజకీయాల్లోనూ భిన్న రాజకీయాలతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నట ఘటికులిద్దరూ తమ అభిమాన సంఘాలను ప్రజా సంఘాలుగా మార్చి, అభిమానుల ద్వారా తమిళనాడులో అధికారాన్ని చేపట్టాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్న కమలహాసన్, రజనీకాంత్‌ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉండడం గమనార్హం. రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలంటూ, విద్యార్థులు రాజకీయాలకు దూరంగా చదువుపై దృష్టి సారించాలి అని పేర్కొంటే.. కమల్ అందుకు భిన్నంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటూ పిలుపునిచ్చారు. ఇలా పలు విషయాల్లో కమల్, రజనీ విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. స్టెరిలైట్ పోరాటంపైనా.. తమిళనాడును కుదిపేసిన తూత్తుకుడిలోని స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటం వ్యవహారంలో రజనీకాంత్, కమలహాసన్ భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్ పోరాటంలో సంఘవిద్రోహులు చొరబడి దాడికి పాల్పడడమే సమస్యకు కారణం అనీ, ఈ సంఘటనలో పోలీసులపై దాడి ఖండించదగ్గదని పేర్కొన్నారు. ప్రతి విషయానికి పోరాటాలు చేసుకుంటూ పోతే తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేనూ సంఘ విద్రోహినే తూత్తుకుడి ఘటనపై రజనీకాంత్ వ్యాఖ్యలను కమలహాసన్ ఖండించారు. ఆయనపై వ్యతిరేక గళం ఎత్తారు. పోరాటం చేసేవారు సంఘ విద్రోహులైతే తానూ సంఘ విద్రోహుడినేనని కమల్ పేర్కొన్నారు. పోరాటాలు ఆగకూడదని అన్న కమల్ తూత్తుకుడి పోరాటం మంచి మార్గం అని, తుపాకీలు గురిపెట్టినా వాటిని ఎదిరించే పరిపక్వతను చూశామని అన్నారు. పోరాటాలతో తమిళనాడు శ్మశానంగా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు. తాను మహాత్మా గాంధీ శిష్యుడినని అన్నారు. కత్తులు, తుపాకులతో చేసేది పోరాటం కాదని, అహింసా విధానంలో పోరాటాలు చేయాలన్నారు. -
తూత్తుకుడి ఘటనపై ఎన్హెచ్ఆర్సీ విచారణ
సాక్షి, చెన్నై: తమిళనాడు తూత్తుకుడి స్టెరిలైట్ పరిశ్రమ వివాదంతో చెలరేగిన హింసలో 13 మంది మృతి చెందటంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) విచారణ చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన కమిషన్ సభ్యులు మృతుల కుటుంబాలను కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణలో భాగంగా తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. హింసకు దారితీసిన పరిస్థితులు, కాల్పులు జరపమని ఆదేశించిన అధికారులెవరు? హింస చెలరేగడంలో నిరసనకారుల, పర్యావరణ కార్యకర్తల పాత్ర ఏమిటనే కోణంలో కలెక్టర్ సందీప్ నండూరిని అడిగి వివరాలు సేకరించారు. పుపుల్ దత్త ప్రసాద్ నేతృత్వంలో కొనసాగిన ఈ విచారణలో కమిషన్ సభ్యులు రాజీవర్ సింగ్, నితిన్ కుమార్, అరుణ్ త్యాగి, లాల్ బకర్ పాల్గొన్నారు. రెండ్రోజుల విచారణ అనంతరం ప్రత్యేక నివేదిక రూపొందిస్తామని అధికారులు తెలిపారు. -
రజనీపై మండిపడ్డ సీఆర్ సరస్వతి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనలో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతూనే ఉంది. తాజాగా నటి, శశికళ వర్గానికి చెందిన సీనియర్ నేత సీఆర్ సరస్వతి... రజనీకాంత్‌పై మండిపడ్డారు. శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ కొత్త పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఆదివారం చెన్నైలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న సీఆర్ సరస్వతి మాట్లాడుతూ ...రజనీకాంత్ కు రాజకీయ పరిపక్వత లేదని మండిపడ్డారు. తూత్తుకుడి ఘటనలో సంఘ విద్రోహక శక్తులు చనిపోలేదని, సామాన్యులు మృతి చెందారని, నిజంగానే వారు హింసకు పాల్పడితే ఒక్క సంఘ విద్రోహక శక్తి ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. తమిళుల పోరాటాలను రజనీకాంత్ కించపరిచేలా వ్యాఖ్యలు చేయటం ఆయన మానసిక పరిపక్వతకు నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పాలనలో పూర్తగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పేందుకు ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కక్షపూరితంగా అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఇటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేరోజు త్వరలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సభను బహిష్కరించటం మంచిదికాదని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉండగా ప్రభుత్వ వైఖరి నచ్చక ఈ సెషన్స్ మొత్తం బహిష్కరించటం ద్వారా సామాన్యుల సమస్యలు మరుగున పడిపోతాయని సరస్వతి వాపోయారు. -
రజనీకాంత్..! ఎవరు నువ్వు?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన అమానుష పోలీసు కాల్పులపై రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు రజనీకాంత్ మాట మార్చి ప్రజల ముందు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అభాసు పాలయ్యారు. పోలీసుల కాల్పుల సంఘటన జరిగిన మే 22వ తేదీన వారి అమానుషత్వాన్ని విమర్శిస్తూ రజనీకాంత్ ఓ చిన్న వీడియాను విడుదల చేశారు. పోలీసు కాల్పుల్లో గాయపడి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఆయన బుధవారం అక్కడికి వెళ్లినప్పుడు ఓ బాధితుడి నుంచి ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ‘ఎవరు నువ్వు?’ అన్నదే ఆ ప్రశ్న. దీంతో కంగుతిన్న రజనీకాంత్, అక్కడ తన పేరు చెప్పుకొని త్వరత్వరగా పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకొని ఆస్పత్రి బయటకు వచ్చారు. ‘సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది’ అని రజనీకాంత్ తన అంతుకుముందటి వైఖరి మార్చుకొని మీడియా ముందు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన పాలనలో ఇలాంటి శక్తులు తలెత్తకుండా చేశారని, ఆమె తరహాలో ప్రస్తుత ఏఐఏడిఎంకే ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న విషయం తమకు ఎలా తెలుసు, ఎలా ధ్రువీకరించుకున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తడబడిన ఆయన ‘ఆ...నాకు తెలుసు’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇలా మాట మార్చడంపై సోషల్ మీడియాలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘పక్కా బీజేపీ తొత్తువి’, ‘ఏలియన్ హిందూత్వ’ అంటూ ట్వీట్లు పేలాయి. వేదాంత గ్రూప్‌నకు చెందిన తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో టెర్రరిస్టులు, నక్సలైట్లు పాల్గొన్నారని బీజేపీ నాయకులు విమర్శించడం తెల్సిందే. మోదీకి, బీజేపీకి వేదాంత గ్రూప్ ఇష్టమైన సంస్థ అవడమే వారి విమర్శలకు కారణం ఏమో! అయినా మాట మార్చడం రజనీకాంత్‌కు కొత్త కాదు. జయలలిత తుదిశ్వాస వరకు ఆమెను నిజమైన ‘అమ్మ’ అంటూ ప్రశంసించిన ఆయన 1996లో జయలలితకు ఓటు వేయరాదంటూ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె గనుక గెలిస్తే తమిళనాడు రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరంటూ విమర్శించారు. రీల్ హీరోగా, రియల్ హీరోగా వేరు చాలా మందిలాగానే సినిమాలో హీరోగా కనిపించే రజనీకాంత్ వేరు. నిజ జీవితంలో రజనీ వేరు. జూన్ ఏడవ తేదీన విడుదలవుతున్న ‘కాలా’ చిత్రంలో రజనీ ప్రజల నిరసన ప్రదర్శనలను ప్రోత్సహిస్తారు. పేద వారి శరీరాలే ఆయుధాలంటారు. తూత్తుకుడిలో ప్రదర్శన జరిపిన ప్రజలనేమో సంఘ విద్రోహశక్తులన్నారు. ‘ఎవరు నువ్వు’ అంటూ ఓ బాధితుడు అన్నందుకు కోపం వచ్చి రజనీకాంత్ మాటమార్చారని అనుకోరాదు. ఒకవేళ అదే కారణం అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఆయన ఇక రాణించలేరు. అరాచకవాదులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు తూత్తుకుడి ప్రదర్శనలో ఉన్నారని రజనీకాంత్ అత్యంత సన్నిహితుడు, ఆరెస్సెస్ సభ్యుడు, తుగ్లక్ మాగజైన్ ఎడిటర్ ఎస్. గురుమూర్తి ఆరోపించారు. రజనీ కూడా సంఘ విద్రోహ శక్తులంటూ మాట మార్చడంతో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లతో రజనీకాంత్‌ను ప్రశంసించారు. ‘ఎవరు నువ్వు?’ అంటూ బాధితుడు వేసిన ప్రశ్న రజనీకాంత్‌కు సరిగ్గా అర్థం కానట్లు ఉంది. తనదీ ఆద్యాత్మిక రాజకీయమంటూ చెప్పుకుంటున్న రజనీకాంత్ ఎవరి పక్షమని, ఏ పార్టీ పక్షం అన్నదే ప్రశ్న. ఆధ్యాత్మికమంటే హిందూత్వమనేదే అర్థమని, రజనీకాంత్ బీజేపీ పక్షమంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఒప్పుకోవాలన్నదే బాధితుడి ప్రశ్న. -
‘నేను రజనీకాంత్‌ను’; వీడియో వైరల్
చెన్నై : సూపరస్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రాంతాలకతీతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ ‘బాషా’ పాపులారిటీ గురించి 1989లో వచ్చిన ‘రాజా చిన్న రోజ’ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాటలో ‘సూపర్‌స్టార్ ఎవరని చిన్న పిల్లలను అడిగిన సమాధానం చెప్తారు’ అనే చరణం అప్పట్లో బాగా పాపులర్. అయితే తూత్తుకుడికు చెందిన సంతోష్ కుమార్(21) ఆ సినిమా విడుదల నాటికి ఇంకా పుట్టలేదేమో అందుకే ఏకంగా సూపర్‌స్టార్‌ను పట్టుకుని ‘ఎవరు నువ్వు...?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు సూపర్ స్టార్ ‘నేను రజనీకాంత్‌ను...’ అంటూ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూత్తుకుడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీని ఓ యువకుడు ‘ఎవరు మీరు..?’ అని ప్రశ్నించాడు. అందుకు ఈ సూపర్‌స్టార్ చిరునవ్వుతో ‘నేను రజనీకాంత్’ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గతంలో ఎప్పుడు లేనంతగా నెటిజన్లు రజనీని ట్రోల్ చేస్తున్నారు. ‘నాన్థాన్పా రజనీకాంత్’(నేను రజనీకాంత్‌ను), ‘యాంటీతమిళ్ రజనీకాంత్’ హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తూత్తుకూడికి చెందిన సంతోష్ బీకామ్ చదువుతున్నాడు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలని కృషి చేసిన వారిలో ఇతనొకడు. ఇటీవల స్టెరిలైట్ బాధితులను పరామర్శించడానికి ఓ మంత్రి ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా సంతోష్ ఆయన్ని ఇలాంటి వింత ప్రశ్నలే అడిగాడట. ఇప్పుడు ఏకంగా తలైవానే ‘ఎవరు నువ్వు..?’ అని అడిగాడు. తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే. -
‘తూత్తుకుడి బాధ్యులు డీఎంకే-కాంగ్రెస్’
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనకు డీఎంకే-కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాలని తమిళనాడు ముఖ్యముంత్రి కె. పళనిస్వామి ఆరోపించారు. తూత్తుకుడి ఘటనపై ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పళని ప్రభుత్వంపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్టెరిలైట్‌కు డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అనుమతులన్ని వచ్చాయని, ఈ ఘటనకు డీఎంకే- కాంగ్రెస్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి కావాల్సిన భూములకు అనుమతినిచ్చిందన్నారు. 2009లో స్టాలిన్ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్టెరిలైట్ రెండో దశ విస్తరణకు 230 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. ఘటనలో 13మంది మరణించగా, 58 మంది ఆందోళనకారులు, 72 మంది పోలీసు సిబ్బందికి తీవ్ర గాయలైనట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఘటనపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. స్టెరిలైట్‌కు నిరసనగా తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. -
తూత్తుకుడి మృతులకు రజనీ ఆర్థికసాయం
సాక్షి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం పరామర్శించారు. కాల్పుల్లో చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడుతూ.. తూత్తుకుడి ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం వంటిదన్నారు. ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమాయక ప్రజల పట్ల స్టెరిలైట్ పరిశ్రమ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడం చాలా పెద్ద తప్పన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాల్పులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం 100వ రోజు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాదాపు 65 మంది గాయపడ్డారు. -
తూత్తుక్కుడి బాధితులను పరామర్శించిన రజనీకాంత్
-
రజనీ రాజకీయం మొదలైంది!
సాక్షి, చెన్నై: తూత్తుక్కుడి(ట్యూటీకోరిన్)లో స్టెరిలైట్ బాధితులను పరామర్శించాలని సూపర్‌స్టార్ రజనీకాంత్ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన లేటెస్ట్ మూవీ ‘కాలా’ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు రజనీ. తూత్తుక్కుడిలో స్టెరిలైట్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 13 మంది అమాయకులు పోలీసుల తూటాలకు బలైన విషయం తెలిసిందే. అయితే బాధితులను పరామర్శించేందుకు తాను తూత్తుక్కుడి వెళ్తున్నానని బుధవారం ఉదయం రజనీ వెల్లడించారు. అమాయకుల రక్తాన్ని చిందించే పోరాటాలు భవిష్యత్‌లో జరగకూడదన్నారు. బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రజనీ పేర్కొన్నారు. కానీ, బాధితులు కొందరు రజనీకాంత్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తూత్తుకుడిలో పోలీసు కాల్పులపై మంగళవారం అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆ స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాలా మూవీ ప్రమోషన్లలో భాగంగా షెడ్యూల్ చేసుకున్న హైదరాబాద్, ముంబై పర్యటనల్ని రద్దు చేసుకుని మరీ రజనీ తూత్తుక్కుడిలో పర్యటించనుండటం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాశంమైంది. -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతపై సందేహాలు
సాక్షి, చెన్నై : ప్రజాందోళనలకు తలొగ్గి తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతపై తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటనపై పలు సందేహాలు ముందుకొస్తున్నాయి. స్దానికుల హింసాత్మక నిరసనల్లో 13 మంది మరణించడం, పెద్దసంఖ్యలో నిరసనకారులు గాయపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినా న్యాయపరమైన చిక్కులు సహా సరైన కసరత్తు జరపకుండానే ప్రభుత్వం ప్రకటన చేసిందని భావిస్తున్నారు. ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపడం పెనుసవాలే. ప్రభుత్వం నిర్ణయంపై తదుపరి చర్యలు చేపట్టేముందు స్టెరిలైట్ యూనిట్ ప్రమోటర్ వేదాంత స్పందించిన తీరు పలు ప్రశ్నలు ముందుకుతెస్తోంది. ప్లాంట్ మూసివేతకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం న్యాయపరమైన ప్రక్రియను అనుసరించలేదని కంపెనీ చెబుతోంది. తమకు ఎలాంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదని, యూనిట్ మూసివేతకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని స్టెరిలైట్ వాదిస్తోంది. స్టెరిలైట్ యూనిట్ మూసివేతపై మే 23న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తొందరపాటుతో కూడుకున్నవని విదుదలై చిరుతైగల్ కచ్చి సభ్యులు డీ రవికుమార్ చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల్లో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి యూనిట్ మూసివేతకు ఎలాంటి సహేతుక కారణం చూపలేదని, దీనిపై న్యాయస్ధానాలు సులభంగా స్టే ఉత్తర్వులు జారీ చేస్తాయని అభిప్రాయపడ్డారు. నిరసనకారుల ఆందోళనను దారిమళ్లించి, స్టెరిలైట్‌కు స్టే తెచ్చుకునేందుకు వీలుగా చేపట్టిన కుట్రలో ఇది భాగమని అభివర్ణించారు. స్టెరిలైట్ ప్లాంట్ చుట్టూ వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ప్లాంట్‌పై ఆధారపడిన 5000 మంది ఉద్యోగులు మాత్రం తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇది మూసిన తలుపులకు తాళం వేయడమే!
సాక్షి, న్యూఢిల్లీ : తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్ కంపెనీ (వేదాంత గ్రూప్)ని శాశ్వతంగా మూసివేస్తు తమిళనాడు ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం లాంటిదే. నీరు, గాలిని కలుషితం చేస్తున్న ఈ కంపెనీని మూసివేయాలంటూ మే 22వ తేదీన తూత్తుకుడి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, తమిళనాడు పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపడం, 13 మంది అమాయకులు మరణించడం తదితర పరిణాలు తెల్సినవే. ఈ సందర్భంగా పెల్లుబికిన ప్రజల ఆగ్రహంపై చన్నీళ్లు చల్లేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. భోపాల్‌లో యూనియన్ కార్బైడ్, కొడైకెనాల్లో యూని లివర్ కంపెనీలను మూసివేసినంత సులభంగా తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి తమిళనాడు ప్రభుత్వం తాళం వేసింది. రేపు ఇంతే సులభంగా కాపర్ కంపెనీ కోర్టు తలుపులు తట్టవచ్చు. స్టే ఉత్తర్వులను తెచ్చుకోనూ వచ్చు. ఆ ఉత్తర్వులను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏదేమైనా కంపెనీ తలుపులు మళ్లీ తెరచుకోకుండా అడ్డుకోగలదా? అందుకు అవసరమైన సమస్త సమాచారాన్ని సేకరించిందా? ఇప్పుడు సిద్ధంగా లేకపోయినా అప్పీళ్ల క్రమంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరచి పటిష్ట వాదనతో కేసు గెలవచ్చు. భయంకరంగా కలుషితమైన కంపెనీ ఆవరణ, పరిసరాలను ఎవరు శుద్ధి చేస్తారు ? కంపెనీ కాలుష్యం కారణంగా తరతరాలు జబ్బు పడిన ప్రజలకు నష్ట పరిహారం ఎవరు చెల్లిస్తారు ? తమ పాపం ఏమీ లేకున్నా ఉన్నఫలంగా ఉద్యోగం ఊడిపోయిన దాదాపు 32 వేల మంది కార్మికులకు జీవనోపాధి ఎవరు కల్పిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానం ప్రభుత్వం చూపినప్పుడే కంపెనీని శాశ్వతంగా మూసివేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారు. అందుకు సార్థకత ఉంటుంది. కాపర్ కంపెనీ కోర్టుకెళితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు సలహాలను, సూచనలను మాత్రం తీసుకోవద్దు సుమా! ఇటు రాష్ట్ర కాలుష్య నియంత్రణా బోర్డు, అటు కేంద్ర పర్యావరణ శాఖలు స్టెరిలైట్ కాపర్ కంపెనీకి ఇంతకాలం ఊడిగం చేశాయి. ప్రభుత్వ పారిశ్రామిక నిబంధనల ప్రకారం స్టెరిలైట్ కంపెనీలను ‘రెడ్ క్యాటగిరీ’ జోన్లో మాత్రమే ఏర్పాటు చేయాలి. ‘స్పెషల్ ఇండస్ట్రీస్ అండ్ హజార్డస్ యూజ్ జోన్’ను రెడ్ క్యాటగిరీ జోన్‌గా వ్యవహరిస్తారు. అయితే తమిళనాడులోని తూత్తుకుడిలో మాత్రం ‘జనరల్ ఆర్ లైట్ ఇండస్ట్రీస్’ జోన్లో పాక్షికంగా ‘అగ్రికల్చర్ జోన్’లో పాక్షికంగా స్టెరిలైట్ కంపెనీని ఏర్పాటు చేశారు. పైగా అవసరమైన గ్రీన్కారిడర్ను కంపెనీ మెయింటెన్ చేయలేదు. 2007లో కంపెనీ తన స్మెల్టర్ (ముడిసరకును మండించి ద్రావకంగా మార్చేది)ను విస్తరించింది. తమ కంపెనీకి 172 హెక్టార్ల భూమి ఉందని, స్మెల్టర్ విస్తరణ వల్ల వచ్చే అధిక కాలుష్యాన్ని నివారించే చర్యలకు ఈ భూమి సరిపోతుందన్న వాదనతో స్మెల్టర్‌ను విస్తరించింది. స్మెల్టర్ విస్తరణలో కూడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను కంపెనీ పాటించలేదు. 172 హెక్టార్ల భూమి ఉన్నట్లు 2007లో కంపెనీ ప్రకటించినప్పటికీ నేటికి కూడా 102.5 హెక్టార్లకు మించి భూమి లేదు. నిబంధనల ప్రకారం 123 మీటర్ల చిమ్నీని ఏర్పాటు చేయాలి. కంపెనీలో 60 మీటర్ల చిమ్నీ మాత్రమే ఉంది. అంటే స్థాపించిన దగ్గరి నుంచి విస్తరణ వరకు కంపెనీలో అన్నీ ఉల్లంఘనలే. కాలుష్యానికి కారణమవుతున్న ఈ కంపెనీ అందుకు నష్టపరిహార చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాలని 2013లో సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వంద కోట్లను ప్రభుత్వం వసూలు చేసిందా? చేస్తే వాటిని ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టింది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి నేటికి సమాధానం లేదు. కంపెనీకి వ్యతిరేకంగా ప్రజల ఆందోళన తీవ్రమైన నేపథ్యంలో తనను తాను కాపాడు కోవడంలో భాగంగా తమిళనాడు కాలుష్య నిరోధక బోర్డు ఇటీవల కంపెనీకి విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేసింది. దీంతో కంపెనీ ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ నిర్ణయమంటూ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే మూతపడిన తలుపులకు తాళం వేసింది. -
ప్రజల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం
చెన్నై : స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తూత్తుకుడిలో సాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. వేదంత లిమిటెడ్‌కు చెందిన స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం చెప్పారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో, పోలీసుల కాల్పులకు గాయపడ్డ వారిని పన్నీర్‌సెల్వం పరామర్శించారు. ఈ నిరసనల్లో ఇప్పటికీ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి నష్టపరిహారం చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతంలో పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. కస్టమర్ల కోసం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మే 23 నుంచి రద్దు చేసిన ఇంటర్నెట్ సేవలు కూడా, అక్కడ ఆదివారం అర్థరాత్రి నుంచి పునరుద్ధరించారు. ‘దుకాణాలు తెరుచుకున్నాయి. పరిస్థితి సద్దుమణిగింది. కానీ ఫ్యాక్టరీని మూసివేసే వరకు నగరంలో పూర్తి ప్రశాంతత ఏర్పడదు’ అని తూత్తుకుడి ట్రేడర్స్ అసోసియేషన్ ఎస్ రాజ చెప్పారు. అదేవిధంగా నిరసనకారులపై కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై నేర కేసు నమోదు చేయాలని రాజ అన్నారు. 13 మృతదేహాల్లో ఏడుగురికి పోస్టుమార్టం పూర్తి అయిందని రాజ చెప్పారు. మరోవైపు స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను నిలిపేయాలని మద్రాస్ హైకోర్టు సైతం ఆదేశించింది. ఆందోళనల్లో 13 మంది మృతిచెందడంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని కోరింది. ఈ ఘటనలపై వేదంత రిసోర్సస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ తొలిసారి స్పందించారు. ప్రపంచంలో కేవలం 2 శాతం కాపర్‌ను మాత్రమే భారత్ ఉత్పత్తి చేస్తుందని, మిగతా అంతా కెనడా, మధ్యప్రాచ్య, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. ఇలాంటివన్నీ భారత్‌లోనే జరుగుతాయని, ప్రతీసారి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలు చేతుల్లోకి తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. మనం జీవితాంతం దిగుమతి చేసుకునే బతుకుదామా? అని ఆయన ప్రశ్నించారు. -
‘13 మంది రక్తం తాగిన పళనిస్వామి ప్రభుత్వం’
సాక్షి, చెన్నై: పళనిస్వామి ప్రభుత్వం రక్తం రుచి మరిగిందని డీఎంకే నాయకురాలు కనిమొళి మండిపడ్డారు. తూత్తుకుడి (ట్యూటికోరిన్)లో వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడానికి స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు మంగళవారం నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. వారికి సంతాపం ప్రకటిస్తూ కనిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం తూత్తుకుడిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీఎంకేతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న కనిమొళితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. స్టెరిలైట్ పరిశ్రమ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఎదురు తిరిగిన అమాయకులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 13 మందిని పొలీసుల తూటాలు బలితీసుకుంటే ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో వారు మృతి చెందారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని కనిమొళి మండిపడ్డారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉంది.. తూత్తుకుడిలో ప్రజా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మురళీ రాంబ తెలిపారు. పరిస్థితిలో అదుపులోనే ఉందనీ.. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పట్టణంలో సరిపడా బలగాలను మోహరించామని అన్నారు. కాగా, ప్రజల ఆందోళనల నేపథ్యంలో పర్యావరణ హితం కోరి స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను నిలిపి వేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ‘ప్రభుత్వం స్టెరిలైట్ పరిశ్రమపై తీసుకునే చర్యలపై ఒక స్పష్టత వచ్చింది. పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది’అని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి తెలిపారు. టీఎన్పీసీబీ అనుమతులను రెన్యువల్ చేయకుండానే పరిశ్రమను నడపాలని చూస్తున్నారని కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. -
తూత్తుకుడి: సీబీఐతో విచారణ జరిపించాలి
సాక్షి, చెన్నై: తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగారం విస్తరణను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే. కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నేడు తమిళనాడు వ్యాప్తంగా బంద్‌కి పిలుపునిచ్చాయి. బంద్‌లో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేతో సహా కాంగ్రెస్, వామపక్షలు, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. బంద్‌లో పాల్గొన్న డీఎంకే నేత కనిమొళితో సహా, ఇతర ప్రధాన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తుత్తుకుడి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు అవకాశం ఉంది. కాగా పిటిషన్లో పూర్తి వివరాలను పొందుపరిచి సోమవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాదిని ఆదేశించింది. -
కాల్పుల వెనుక కన్నీటి గాథలు
తమిళనాడులోని దక్షిణాది జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పోలీసు కాల్పుల వెనుక హృదయాంతరాలను తడిచేసే కన్నీటిగాథలు దాగి ఉన్నాయి. సమస్యల పరిష్కారంపై సాగుతున్న ఆందోళనల్లో అమాయకులే అధికశాతం అశువులు బాస్తున్నారు. దక్షిణాది జిల్లాలో చోటుచేసుకున్న పెద్ద సంఘటనల్లో మూడోదిగా చరిత్రకెక్కిన తూత్తుకూడిలో పోలీసు కాల్పులు ఇందుకు మినహాయింపు కాదు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కరువు కాటకాలు, నిరుద్యోగం, కుల, మత, జాతి విధ్వేషాలు వంటి కారణాలతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనలను అణిచివేసే క్రమంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం విధ్వంసాలకు దారితీస్తోంది. విధ్వంసాలు వికటించి ఆమాయకులు అర్ధాయుష్షులుగా మరణిస్తున్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ తిరునెల్వేలిలోని తేయాకు తోటల కార్మికులు 1999 జూలై 23వ తేదీన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన లాఠీచార్జి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కొందరు తామిరభరణి నదిలోకి దూకారు. ఒకటిన్నర ఏడాది వయసు చిన్నారి విఘ్నేష్‌తోపాటు మొత్తం 16 మంది నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులు కలుపుకుని సుమారు 500 మంది గాయపడ్డారు. తిరువారూరు జిల్లా పరమకుడిలో 2011 సెప్టెంబరు 11వ తేదీ జరిగిన ఇమ్మానువేల్ గురుపూజ ప్రజల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఈ సమయంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మరణించారు. అలాగే ఇటీవల తూత్తుకూడిలో స్టెరిలైట్ ఆందోళనలు 13 మందిని పొట్టనపెట్టుకున్నాయి. తాజా కాల్పుల్లోనూ కన్నీటి వెతలు తూత్తుకూడిలో ఆందోళనకారుల్లో విధ్వంసాలు సృష్టించేవారే లక్ష్యంగా గురిపెట్టిన తుపాకులు అమాయకుల ప్రాణాలను బలిగొన్న కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. తూత్తుకూడి అన్నైవేళాంగణి నగర్లో నివసించే సెల్వరాజ్ (46) జిల్లాకలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తున్నాడు. అతని కుమార్తె జెన్నిఫర్ ఇటీవలే పుష్పవతి కావడంతో బంధుమిత్రుల మధ్య వేడుక జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈనెల 22వ తేదీన సెల్వరాజ్ ఆఫీసుకు వెళుతూ.. ‘సాయంత్రం ముందుగా వస్తాను, ఇద్దరం కలిసి బంధువులకు ఆహ్వానపత్రికలు పంచుతాం’ అని భార్యతో చెప్పి బయలుదేరాడు. సాయంత్రం విధులు ముగించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదుగా ఇంటికి వస్తుండగా పోలీసు తూటా సెల్వరాజ్ గుండెను చీల్చేసి ప్రాణాలను హరించింది. పదోతరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వెనిస్టా (17) అనే బాలిక కూడా ప్రాణాలు కోల్పోయింది. అలాగే గ్రేస్పురానికి చెందిన ప్రభు (36) అనే మత్స్యకారుడు పొరపాటున నిరసనకారుల మధ్య చిక్కుకున్నాడు. లాఠీదెబ్బలు, తూటా గాయాలతో రక్తం ఓడుతూ ఇంటికి చేరిన అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రబ్బర్ తూటాల మాటేమిటి ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలు మానవహక్కులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ చట్టాలను కఠినంగా మార్చడంతోపాటు ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడినపుడు తప్పనిసరై కాల్పులు జరపాల్సివచ్చినా ముందుగా రబ్బర్ తూటాలను ప్రయోగిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా అందోళనలు జరిగినపుడు, రష్యా తదితర దేశాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు చోటుచేసుకున్నపుడు రబ్బర్ తూటాలనే వినియోగించారు. రబ్బర్ తూటాలు శరీరంలోకి ప్రవేశించినా గాయాలు తగులుతాయేగానీ ప్రాణాపాయం ఏర్పడదు. పైగా రబ్బర్ తుటాలను ఎన్ని రౌండ్లయినా ప్రయోగించవచ్చు, బుల్లెట్లకు పరిమితి ఉంటుంది. ఇటీవలి కాలంలో భారత్‌లో రబ్బర్ తూటాలను వాడుతున్నారు. ముఖ్యంగా ఘర్షణలకు నెలవైనా జమ్మూ కాశ్మీర్లో పోలీసులు, ఇతర భద్రతా దళాలు సరిహద్దు ఆందోళన కారులపై రబ్బర్ తుటాలనే ప్రయోగిస్తున్నారు. మరి ఇలాంటి వెసులుబాటు ఉండగా తూత్తుకూడి ఆందోళనల్లో రబ్బర్ తూటాలను ఎందుకు వినియోగించలేదనే ప్రశ్న తలెత్తింది. పైగా కిలోమీటరు దూరం వరకు బుల్లెట్ దూసుకుపోగల ఏకే 47, తదితర అత్యాధునిక తుపాకులను తూత్తుకూడి కాల్పులకు వినియోగించినట్లు సమాచారం. కాల్పులు జరిగి మూడురోజులైనా తూత్తుకూడిలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వాహనాలు తిరగడం లేదు. అంగళ్లు తెరుచుకోలేదు. ప్రజలు స్వేచ్ఛగా బయటతిరిగే పరిస్థితి లేదు. పైగా స్టెరిలైట్, తుపాకీ కాల్పులపై నిరసనలు రాష్ట్రం నలుమూలకు పాకాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర బలగాలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది. మరోసారి కాల్పులు చోటుచేసుకుంటే అమాయకుల ప్రాణాల మాటేమిటనే భయాందోళనలు నెలకొన్నాయి. సుమోటా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ తూత్తుకూడి కాల్పుల ఘటన దేశం మొత్తాన్ని కదిలించివేయగా జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కాల్పుల ఘటనను సుమోటాగా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ర్యాలీగా వెళుతున్న వారిపై తుపాకీ కాల్పులకు ఆదేశించింది ఎవరు, కాల్పులకు ముందు హెచ్చరికలు జారీచేశారా, తుపాకీ కాల్పుల్లో నిబంధనలను పాటించారా అనే మూడు ప్రధాన ప్రశ్నలను కమిషన్ సంధించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిందంటే కాల్పుల సమయంలో నిబంధన ఉల్లంఘనను ఊహించుకోవచ్చు. -
సంయమనం పాటించండి: హోం మంత్రి
న్యూఢిల్లీ: తూత్తుకుడిలో ప్రజలు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలో పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు 11 మంది నిరసనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం కూడా ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని కోరారు. ‘స్టెరిటైట్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో అమాయక ప్రజలు చనిపోవడం దురదృష్టకరం. వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న’ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం వ్యాఖ్యానించారు. కాగా నిరసనకారులపై కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకేతో సహా ఇతర పక్షాలు శుక్రవారం తమిళనాడు బంద్‌కు పిలుపినిచ్చాయి. -
చిన్నపిల్లలు సార్.. వదిలేయండి
సాక్షి, చెన్నై: తూత్తుకుడి హింసపై నేడు(శుక్రవారం) తమిళనాడు బంద్‌కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు చేపట్టిన ఆందోళన పోలీసుల కాల్పులతో హింసాత్మకంగా మారింది. మొత్తం 13 మంది మరణించినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పైగా ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆందోళనకారులపై పోలీసుల దమనకాండను సమర్థిస్తూ ప్రకటన చేయటం ప్రతిపక్షాల్లో ఆగ్రహన్ని తెప్పించింది. మరోవైపు లాఠీఛార్జీ సమయంలో కొందరు రిపోర్టర్లు చేసిన లైవ్ రిపోర్టింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిన్న పిల్లలను అని కూడా చితకబాదటంతో ఓ రిపోర్టర్ అడ్డుకున్నారు. లైవ్ కవరేజ్ చేస్తున్న ఆ రిపోర్టర్‌కు, పోలీసులకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. రిపోర్టర్: నిరసనకారులను పోలీసులు అణచివేస్తున్నారు. చిన్న పిల్లలనీ కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు బాదుతున్నారు. ఇంతలో ఓ కానిస్టేబుల్ జోక్యం చేసుకుంటూ... : అదే నిరసనకారులంతా కలిసి ఓ పోలీస్ అధికారిని చితకబాదినప్పుడు మీ మీడియా ఎక్కడికి పోయింది? ఎందుకు కవరేజ్ చెయ్యలేదు? ఇప్పుడు మాపై ఎందుకు నిందలేస్తున్నారు? రిపోర్టర్: కానీ, మీరు 11 మందిని కాల్చి చంపారుగా... పోలీసులు: మేం కాల్చలేదు. ఎవరు చంపారో వారినే అడగండి. రిపోర్టర్: చిన్నపిల్లలు సార్.. దయచేసి వారిని వదిలేయండి పోలీసులు: ఇంతకీ ఎవరు నువ్వు? ఏ ఛానెల్? రిపోర్టర్: వికటన్ ఈ-మాగ్జైన్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన ఓ యువకుడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోగా, నటించింది ఇక చాలూ ఇక్కడి నుంచి వెళ్లు... అంటూ పోలీసులు కసురుసుకోవటం, ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోవటం...’ ఆ వీడియో కూడా నిన్నంతా చక్కర్లు కొట్టింది. పోలీసుల లాఠీఛార్జీలో 2, కాల్పుల్లో 11 మంది మొత్తం 13 మంది నిరసనకారులు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఇప్పటివరకు ప్రాణాలు విడిచారు. ఇక నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్ హాసన్ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి. -
చిన్నపిల్లలు సార్.. వదిలేయండి
-
‘కనీసం ఒక్కరైనా చావాల్సిందే’
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయాసపడుతోంది. వేదాంత స్టెరిలైట్ కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ మంగళవారం ప్రజలు జరిపిన నిరసన ప్రదర్శన హింసాకాండకు దారితీయడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ రోజు 11 మంది మరణించడం కొన్ని వందల మంది గాయపడడం తెల్సిందే. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోందిగానీ, పోలీసుల అనుచిత చర్యను సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలతోపాటు సోషల్ మీడియా తీవ్రంగా ఖండిస్తోంది. పోలీసుల రాక్షసత్వాన్ని ఎండగడుతూ పలు మీడియాలో కార్టూన్లు దర్శనమిస్తున్నాయి. పోలీసులు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో దృశ్యాలను చూస్తూంటే వారి అనాగరిక చర్య, అనుచిత ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పోలీసు వ్యాన్‌పై పడుకొని ఓ పోలీసు జవాను ప్రదర్శకులపైకి తుపాకీ ఎక్కుపెట్టడం, ‘కనీసం ఒక్కరైనా చావాల్సిందే’నంటూ మరో పోలీసు వ్యాఖ్యానించడం వీడియో దృశ్యాల్లో స్పష్టంగా వినిపించింది. మరోచోట తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడి చుట్టూ పోలీసులు ఉన్నా అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ‘నటించకు, లే’ అంటూ హేళన చేశారు. కలియప్పన్ అనే ఆ 22 ఏళ్ల యువకుడిని ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే మరణించారు. కాల్పుల్లో మరణించిన వారి ముఖాలపై, మొండాలపైనే ఎక్కువగా బుల్లెట్ గాయాలున్నాయంటూ సామాజిక కార్యకర్తలు చూపిన ఫొటోలు ‘పరిస్థితిని అదుపుచేసేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు’ ఏవీ పోలీసులు పాటించలేదనే విషయాన్ని సూచిస్తున్నాయి. విధ్వంసానికి దిగిన గుంపును చెదరగొట్టేందుకు ముందుగా పోలీసులు లాఠీఛార్జి చేయాలి. పరిస్థితి అదుపులోకి రాకపోతే భాష్పవాయువు గోళాలను ప్రయోగించాలి. అయినా ఫలితం లేకపోతే గాలిలోకి కాల్పులు జరపాలి. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆందోళనాకారుల పాదాలు, కాళ్లకు తగిలేలా మాత్రమే కాల్పులు జరపాలి. లాఠీచార్జి చేసినా ఫలితం లేనప్పుడు భాష్ప వాయువు గోళాలను, వాటర్ క్యానన్లు ఉపయోగించాలని, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే రబ్బర్ బుల్లెట్లు కాల్చాలని, అవసరమైతే పెల్లెట్ గనులు ఉపయోగించాలని, పెల్లెట్ గున్నుల వల్ల మనుషులు గాయపడతారు తప్ప చనిపోరని తమిళనాడు మాజీ డీజీపీ ఆర్. నటరాజ్ వివరించారు. తూత్తుకుడిలో ముందుగా ప్రజలు రెచ్చిపోయి హింసాకాండకు దిగలేదని, తొలుత దారిని అడ్డుకున్న పోలీసులపైకి రాళ్లు మాత్రమే రువ్వారని, పోలీసులు ఎకాఎకి కాల్పులు జరపడంతోనే ప్రజలు రెచ్చిపోయారని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు కాల్పుల సంఘటనను జాతీయ మానవ హక్కుల సంఘటనను తనంతట తానే తీవ్రమైన అంశంగా పరిగణించి తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసు శాఖకు నోటీసులు జారీ చేస్తోంది. -
తూత్తుకుడి ఘటనకు వారే బాధ్యులు..
సాక్షి, చెన్నై : తూత్తుకుడిలో స్టెరిలైట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనపై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్ధలు సహా సంఘ విద్రోహ శక్తులు స్ధానికులను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. తూత్తుకుడిలో రాగి విద్యుత్ గ్రాహక ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన స్ధానికులపై పోలీసులు అత్యంత పాశవికంగా అసాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా ప్లాంట్ కారణంగా ఈ ప్రాంతం కాలుష్యమయమవుతుందని స్ధానికులు నిరసన తెలుపుతున్నారు. తూత్తుకుడి కాల్పులకు కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సంఘవ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించడమే కారణమని పళనిస్వామి ఆరోపించారు. ప్రజలు తిరగబడి దాడులు చేయడం వల్లే వారిని ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పోలీసులను వెనకేసుకొచ్చారు. పోలీసులు నిరసనకారులపై నేరుగా కాల్పులు ఎలా జరుపుతారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. కాగా తూత్తుకుడి ఘర్షణల్లో 11 మంది మరణించగా, 67 మందికి గాయాలయ్యాయి. హింసకు పాల్పడ్డారంటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రాణాలు పోయేలా ఉన్నా కనికరం చూపలేదు
-
తూత్తుకుడి
తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది. కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. -
రక్తమోడుతున్న కనికరించలేదు: వీడియో వైరల్
తూత్తుకూడి : దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బుధవారం అన్నానగర్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. అయితే అతని మరణానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని చూట్టూ పోలీసులు మూగారు. అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా ఓ పోలీసు లాఠీతో బెదిరిస్తూ...‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని కసురుకున్నాడు . బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గాయాలతో రక్తమోడుతున్న వ్యక్తి పట్ల కనీసం కనికరం కూడా చూపకుండా కర్కశంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దాంతో బాధ భరించలేక అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా ‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని అనడం అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు కలియప్పన్‌తో కలిపి 13 మంది మరణించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. -
తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, చెన్నై : తమిళనాడు తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్ నియమితులయ్యారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా తూత్తుకుడిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరగా, 70 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశన్, ఎస్పీ పీ మహేంద్రన్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తూత్తుకుడిలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ (రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేపట్టారు. అయితే నిరసనోద్యమం మంగళవారం నాడు ఒక్కసారిగా హింసాయుత మలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ఆందోళనకారులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అరెస్ట్.. మరోవైపు తూత్తుకుడి సంఘటనపై ప్రభుత్వ వివరణ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు గురువారం చెన్నైలోని సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లటం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అడ్డుకోవటంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆందోళన చేస్తున్న స్టాలిన్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ డీఎంకే శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక తూత్తుకుడిలో అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలతో ఇప్పటివరకూ 67 మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
తూత్తుకుడి ఎఫెక్ట్: 32వేల ఉద్యోగాలకు గండి
తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది. కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. -
స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం; తూత్తుకుడిలో కాల్పులు
తూత్తుకుడి: దక్షిణ తమిళనాడులోని తీరపట్టణం తూత్తుకుడిలో మళ్లీ హింస చెలరేగింది. పట్టణంలోని అన్నానగర్ ప్రాంతంలో బుధవారం బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపగా ఒకరు చనిపోయారు. మరో ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. తోటి ఆందోళనకారులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. 24 గంటల్లోపే మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో నిరసనకారులు తీవ్రఆగ్రహంతో రగిలిపోతున్నారు. తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. అయితే నిరసనోద్యమం మంగళవారంనాడు ఒక్కసారిగా హింసాయుతమలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 11 మంది ఆందోళనకారులు చనిపోయారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ అఖిలపక్షం బుధవారం తుత్తూకుడి బంద్‌కు పిలుపిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. వ్యతిరేకత ఎందుకు? మానవాభివృద్ధి సూచిలో చెన్నైనగరం తర్వాత రెండో స్థానంలో ఉన్న తూత్తుకుడి పట్టణంలో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్‌ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
ఎందుకు తూత్తుకూడి రక్తసిక్తం?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకూడిలో కాలుష్యానికి కారణమవుతున్న వేదాంత స్టెరిలైట్ కాపర్ కంపెనీని 1996లో ఏర్పాటు చేశారు. రోజుకు 1200 టన్నుల అనోడ్స్ (విద్యుత్ గ్రాహక రాగి రాడ్లు)ను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతమున్న ఈ సామర్థ్యాన్ని కంపెనీ రెండింతలు చేయాలనుకుంటోంది. దీని వల్ల అధిక సాంద్రత గల అక్కడి జనాభాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. కంపెనీకి పది కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఎనిమిది పట్టణాలు, 27 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4.6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, రేణువులు కాలుష్యానికి కారణం అవుతున్నాయని ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక 2015 సంవత్సరంలోనే వెల్లడించింది. కంపెనీ కారణంగా నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కొన్నేళ్ల వరకు కంపెనీ నుంచి కాలుష్యం ప్రభావాన్ని తాము అంచనా వేయలేకపోయామని, కొన్నేళ్ల క్రితం నుంచే ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు అస్వస్థులవుతున్నారని, ముఖ్యంగా పిల్లలపై కాలుష్యం ప్రభావం ప్రాణాంతకంగా ఉంటోందని వారు చెబుతున్నారు. కంపెనీని మరింత విస్తరిస్తున్నట్లు సమీపంలోని కుమారెడ్యార్పురం గ్రామస్థులకు ముందుగా తెల్సింది. మొదట చిన్న స్థాయిలో ప్రజల నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి ఊపందుకున్నాయి. మంగళవారం నాడు తూత్తుకూడిలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన జరిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాలని నెల రోజుల క్రితమే నిర్ణయించామని, ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి ఆయన ఆదివారం నాడు తమతో శాంతి చర్చలు జరిపారని సెల్వరాజ్ అనే స్థానికుడు తెలిపారు. తమకు కావాల్సింది శాంతి కాదని, కంపెనీ విస్తరణను అడ్డుకోవడమే ముఖ్యమంటూ తాము కలెక్టర్‌కు కూడా స్పష్టం చేశామని సుందరరామమూర్తి అనే మరో గ్రామస్థుడు తెలిపారు. ఆదివారం నాడు కలెక్టర్ శాంతి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కూడా మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేయాలని గ్రామస్థులు నిర్ణయించారని వారు తెలిపారు. అందుకు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం అయ్యేందుకు కూడా ముందుగా కలెక్టర్ కార్యాలయం అనుమతి ఇచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత అనూహ్యంగా సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారని వారు తెలిపారు. శాంతియుతంగానే తాము కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలని అనుకున్నామని, హింసాకాండకు దిగాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని వారు చెప్పారు. కలెక్టర్ కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలోనే పిల్లాపాపలతో సహా వేలాది మంది ప్రజలు గుమిగూడారని, అక్కడి నుంచే పోలీసు బారికేడ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని, అది చివరకు పోలీసు కాల్పులదాకా వెళ్లిందని గ్రామస్థులు వివరించారు. వారు కాల్పుల్లో మరణించిన వారి ఫొటోలను మీడియాకు చూపించారు. వారిలో ఎక్కువ మందికి కడుపులో, పొత్తి కడుపులో బుల్లెట్లు దిగిన గాయాలున్నాయి. ప్రస్తుతం అక్కడ వాడవాడలా పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. కలెక్టర్‌గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ మీడియాకు అందుబాటులో లేరు. -
స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణకు హైకోర్టు బ్రేక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ నిర్మాణంపై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా గత 100 రోజులుగా జరుగుతున్న నిరసన, ఆందోళన హింసాత్మకంగా మారడంపై కోర్టు గురువారం స్పందించింది. నిర్మాణ విస్తరణ పనులను నిలిపివేయాల్సిందిగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. వివాదాస్పద పారిశ్రామిక యూనిట్ ప్రతిపాదిత విస్తరణ పనులను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టు లోని మదురై బెంచ్ ఆదేశించింది. ప్లాంట్ నిర్మాణానికి ప్రజల అనుమతి పొందాలని తెలిపింది. ప్రాజెక్టుకు అనుమతినిచ్చేముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కేంద్రానికి సూచించింది. ఈ మేరకు తాజా పిటిషన్ దాఖలు చేయాల్సింది వేదాంత కంపెనీనీ ఆదేశించింది. దీంతోపాటు పోలీస్ కాల్పుల ఘటనపై నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోం మంత్రిత్వ శాఖను కోరింది. మరోవైపు తూత్తుకూడిలో పోలీసుల కాల్పుల ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్‌ను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఆందోళనకారులపై పోలీసుల కాల్పుల ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి న్యాయ విచారణకు ఆదేశించారు. మృతులు ఒక్కొక్కరికీ 10లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అటు కేంద్రం కూడా ఈ వ్యవహారంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాల్సిందిగా రాష్ట్రాన్ని కోరింది. కాగా వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన పోలీసు కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఇతర నాయకులు పోలీసుల దమనకాండపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. -
తూత్తుకుడి విషాదం : వేదాంత షేరు ఢమాల్
సాక్షి,ముంబై: తమిళనాడులోని తూత్తుకుడిలో కాల్పుల ఉదంతంతో వేదాంత షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి మార్కెట్లో వేదాంతా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. 5.5 శాతానికిపైగా క్షీణించి 10 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. జూలై 5, 2017 నాటి స్థాయికి పడిపోయింది. తమిళనాడును అట్టుడికించిన తూత్తుకూడి ఘటనపై స్టెరిలైట్ కంపెనీ సీఈవో రామనాధ్ స్పందించారు. ఈ విధ్వంసం వెనుక కరుడుగట్టిన శక్తులు ఉన్నాయని విమర్శించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం సహా, ఇతర అన్ని నిబంధనలకనుగుణంగానే తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జూన్ 6వతేదీన ఉన్నాయని చెప్పారు. -
తూత్తుకుడిలో బంద్, స్టాలిన్, కమల్ పర్యటన
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సినీనటుడు కమల్‌హాసన్ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లనున్నారు. కాగా తూత్తుకుడి స్టెర్లైట్ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. -
దర్శకుడు శంకర్‌పై తమిళులు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు శంకర్‌పై తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారిన విషయం విదితమే. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ వద్ద నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీనిపై శంకర్ ‘వాట్ ఏ మ్యాచ్’ అంటూ ట్విటర్ ప్రశంసలు కురిపించారు. దీంతో శంకర్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు. తూత్తుకుడి ఘటనలో 11 మంది తమిళుల మరణంపై బాధను వ్యక్తం చేయకుండా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నావా? అంటూ నిలదీశారు. ఈ పరిస్థితితుల్లో నీకు క్రికెట్ ముఖ్యమా..? నువ్వు మనిషివేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్లో నెటిజన్ల ఆగ్రహం నేపథ్యంలో శంకర్ సదరు పోస్టును తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో నష్టనివారణలో భాగంగా శంకర్ బుధవారం తూత్తుకుడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.తూత్తుకుడి ఘటనపై నటి, దర్శకురాలు రాధిక శరత్‌కుమార్ స్పందించారు. 11 మంది మరణించాడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. నివాళి తెలిపితే అది ఒట్టి మాటే అవుతుందని అభిప్రాయపడ్డారు. మరణించిన వారి కుటుంబాల గురించే తన గుండె కొట్టుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. Shocked #ThoothukudiShooting , unacceptable to the mind. Condolences will become mere words, heart&spirit goes out to the people and their loved ones — Radikaa Sarathkumar (@realradikaa) May 23, 2018 It is shocking and painful.. my deepest heart felt condolences to the families of the people who died in tuticorin — Shankar Shanmugham (@shankarshanmugh) May 23, 2018 -
ప్రధాని మౌనం వీడాలి
తమిళ సినిమా: ప్రధానమంత్రి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పేర్కొన్నారు. తూత్తుక్కుడి సంఘటనపై ఈయన స్పందిస్తూ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తూత్తుక్కుడి స్టెర్లైట్ పోరాటంలో ప్రజలు దారుణంగా హత్య చేయబడడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానన్నారు. ఈ పోరాటం సమాజం కోసం జరుగుతోందని, ఇది వ్యక్తిగత పోరాటం కాదని అన్నారు. 50వేల మంది కలిసి చేస్తున్న పోరాటం కచ్చితంగా సామాన్య ప్రజల కోసమేనన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి మౌనం వీడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. పోరాటం ప్రజాస్వామ్యంలో హక్కు అని, అందులో ప్రజలెందుకు పాల్గొనకూడదని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్నది ప్రజల కోసమేనని, మరో దేనికోసం కాదని అన్నారు. ప్రజలు 2019 ఎన్నికల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా విశాల్ వ్యాఖ్యానించారు. ఇదే విధంగా నటుడు, మక్కల్‌నీది మయ్యం పార్టీ నేత కమలహాసన్ కూడా తూత్తుక్కుడి సంఘటనను తీవ్రంగా ఖండించారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. -
రక్తసిక్తమైన తూత్తుకుడి
-
కాలుష్యంపై పోరాడితే కాల్పులా?!
వాయు కాలుష్యానికీ, జల కాలుష్యానికీ కారణమవుతూ తమ ప్రాణాలను కొంచెం కొంచెంగా పీల్చేస్తున్న మాయదారి స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేయాలని కోరుతూ రోడ్డెక్కిన ఆందోళనకారులపై తమిళనాడులోని తూత్తుకుడిలో మంగళవారం కాల్పులు జరిగి 11మంది నేలకొరిగిన ఉదంతం అత్యంత విషాదకరమైనది. తమపాలిట మృత్యువుగా మారిన సంస్థ ఉండటానికి వీల్లేదని ఆగ్రహిం చినవారు ఆ క్రమంలో సొంత ప్రాణాలనే పణంగా పెట్టాల్సిరావడం ఎంత ఘోరం? నిరసనలనూ, ఆందోళనలనూ మొగ్గలోనే తుంచాలని చూడటం, అది సాధ్యం కాకపోతే వాటిపై దుష్ప్రచారానికి దిగడం, అందులోనూ విఫలమయ్యాక బలప్రయోగానికి పూనుకోవడం ప్రభుత్వాలన్నిటికీ రివాజుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారుదీ ఇదే వరస. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా పార్కును వ్యతిరేకిస్తున్న జనంపై అది సాగిస్తున్న జులుం శ్రుతిమించుతోంది. వేదాంత సంస్థ నేతృత్వంలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యవహారం ఇలాంటి ధోరణులకు భిన్నమైనదేమీ కాదు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సాకులు వెదుకుతోంది. 20వేలమంది ప్రజానీకం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జిల్లా కలెక్టర్ కార్యాలయంవైపు దూసుకొచ్చారని, వారిని ఆపేం దుకు పోలీసులు ప్రయత్నిస్తే రాళ్లు రువ్వారని, ప్రభుత్వ ఆస్తులకు నిప్పెట్టారని... దాంతో కాల్పులు తప్పనిసరయ్యాయని సంజాయిషీ ఇస్తోంది. నిజమే... వేలాదిమందితో నిరసనలు జరిగినప్పుడు అనుకోని ఘటనలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. కనుకనే ఉద్యమాలు శైశవ దశలో ఉన్నప్పుడే ప్రభుత్వాలు మేల్కొనాలి. ప్రజల డిమాండ్లలోని సహేతుకతను గుర్తించాలి. వారి భయాందోళనలు నిరాధారమైనవనుకున్నప్పుడు ఆ సంగతే వారికి చెప్పాలి. ఒప్పించగలగాలి. పాల కులుగా ఇది వారి బాధ్యత. స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం ఈనాటిదా? అది ఫ్యాక్టరీ స్థాపించిన 1998లోనే రాజుకుంది. ఈ ఉద్యమం ఒక్క స్టెరిలైట్ కంపెనీపై మాత్రమే కాదు... ఫ్యాక్టరీవల్ల పర్యావరణానికి కలిగే హానిని దాచి పెట్టి అనుమతులు మంజూరు చేసిన జిల్లా యంత్రాంగంపైనా, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిపైనా కూడా స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ వల్ల ఏమాత్రం నష్టం లేదని చెబు తున్న సర్కారు... అది మహారాష్ట్ర నుంచి తమిళనాడు ఎందుకు వలస వచ్చిందో చెప్పాలి. 1992లో మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ స్టెరిలైట్‌కు అక్కడి రత్నగిరి జిల్లాలో 500 ఎకరాలు కేటాయిస్తే ఆ మరుసటి సంవత్సరం దాని పనులు మొదలయ్యాయి. రాగిని కరిగించగల భారీ స్మెల్టర్ నిర్మాణానికి సంస్థ పూనుకున్నప్పుడు స్థానికులు తిరగబడి ఆందోళన చేయడం పర్యవసానంగా అక్కడి ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదికతో ప్రాజెక్టు నిలిచిపోయింది. మహారాష్ట్రలో హానికారకమని నిలిపేసిన ప్రాజెక్టు తమిళనాడుకు నచ్చింది. 1994లో అక్కడి కాలుష్య నియంత్రణ మండలి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) చేయాలని స్టెరిలైట్‌కు సూచించింది. అంతేకాదు... విభిన్న జలచరాలుండే మన్నార్ జలసంధి జీవావరణ రిజర్వ్‌కు ప్రతిపాదిత ఫ్యాక్టరీ 25 కిలోమీటర్ల దూరం ఉండాలని నిర్దేశించింది. స్టెరిలైట్ ఈఐఏను సమర్పించకుండానే 1995లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు వచ్చేశాయి. ఫ్యాక్టరీ నిర్మాణానికి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మన్నార్ జలసంధికి 14 కిలోమీటర్ల దూరంలో ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఉత్పాదకత మొదలుపెట్టడానికి చకచకా అను మతులు వచ్చాయి. ఫ్యాక్టరీ చుట్టూ 25మీటర్ల మేర గ్రీన్‌బెల్ట్ నిర్మించాలన్న షరతు మాత్రం విధించారు. అదీ బేఖాతరైంది. ఉత్పత్తి మొదలైన ఏడాదిలోపే స్థానికులనుంచి ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. పరిసరాల్లోని భూగర్భ జలాలు కలుషితం కావడం, ఫ్యాక్టరీ పొగతో ఎందరో అస్వ స్థులవుతుండటం రివాజుగా మారింది. ప్రతి ఫిర్యాదూ బుట్టదాఖలైంది. కాలుష్య నియంత్రణ మండలి, నాగ్‌పూర్‌లోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ(నీరీ) క్లీన్చిట్ ఇస్తూనే ఉన్నాయి. స్థానికులు మాత్రం నానా కష్టాలూ పడుతున్నారు. అప్పుడప్పుడు పరిస్థితి తీవ్రత గమ నించి ఉత్పాదకత నిలిపేయాలని ఆదేశిస్తే, దాని పునరుద్ధరణకు అనుమతి కోరకుండానే కార్య కలాపాలు ప్రారంభించేవారని ఉద్యమకారుల ఆరోపణ. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల సల్ఫర్ డై ఆక్సైడ్, సీసం, ఆర్సెనిక్ తదితర ప్రమాదకర పదార్థాలు గాలిలో, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై 2013లో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు 1997–2012 మధ్య పదిహేనేళ్లపాటు ఈ సంస్థ పర్యావరణ విధ్వంసానికి కారణమైందని నిర్ధారించింది. అయితే ఫ్యాక్టరీ మూతపడాలన్న డిమాండుతో ఏకీభవించలేదు. అందువల్ల 1,300 మంది ఉద్యోగులు రోడ్డున పడటమే కాక... రక్షణ, విద్యుత్ రంగాలతోపాటు ఆటోమొబైల్, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల రంగం దెబ్బతింటాయని అభిప్రాయపడింది. అయితే చేసిన విధ్వంసానికి పరిహారంగా పరిహారంగా కలెక్టర్ వద్ద రూ. 100 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కానీ ఇంతవరకూ దానిలో ఒక్క పైసా కూడా బాధితులకు విదిల్చిన వైనం కనబడదు. చావసిద్ధపడితే తప్ప బతకడం సాధ్యం కాదని స్థానికులు భావించడంలో ఆశ్చర్యమేముంది? తూత్తుకుడి విధ్వంసాన్ని ఆపాలంటున్న జనంవైపో... చట్టాలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ సంస్థ లవైపో తమిళనాడు ప్రభుత్వం తేల్చుకోవాలి. ఆ విషయంలో సరైన నిర్ణయం జరిగేవరకూ ఆందోళన చల్లారదు. -
అట్టుడికిన తూత్తుకుడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి పట్టణం రక్తసిక్తమైంది. వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు. కలెక్టరేట్ వద్ద నిరసనకారులను నిలువరించే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలిక ఉన్నారు. పోలీసులు సహా 60 మంది గాయపడ్డారు. వాణిజ్య సముదాయాలు, వాహనాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. దీంతో ఆ పరిసర ప్రాంతాలు రణ రంగాన్ని తలపించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పొరుగు జిల్లాలు మదురై, విరుధ్‌నగర్ నుంచి పోలీసులను హుటాహుటిన తూత్తుకుడికి రప్పించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వారి అభిప్రాయాలు, ఆకాంక్షలను గౌరవించి సమస్యను చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మంత్రులు, డీజీపీతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి పళనిస్వామి వేదాంత కంపెనీపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హింసాత్మక ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. లాఠీచార్జి ప్రయోగం ఫలించకనే... వేదాంత వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తూత్తుకుడిలో 144వ సెక్షన్ విధించారు. ఉదయం ఓ చర్చి వద్ద సమావేశమైన ఆందోళనకారులు తొలుత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కలెక్టరేట్ వరకు మార్చ్ నిర్వహించారు. వందలాది మంది మహిళలు కూడా తమ చంటిబిడ్డలను చంకనవేసుకుని ఆందోళనలో పాల్గొన్నారు.ఇంతలో తోపులాటలతో మొదలైన ఘర్షణలు క్షణాల్లోనే ఉధృతమయ్యాయి. కలెక్టరేట్‌పై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోయింది. కొందరు నిరసనకారులు లోనికి ప్రవేశించి ఫర్నిచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. బయట ఉన్న ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాల విండ్స్క్రీన్లను బద్దలుకొట్టి, బ్యాంకు కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారు. లాఠీచార్జి, బాష్ప వాయువు ప్రయోగంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తాము శాంతియుతంగా నిరసన చేస్తూ, ఎలాంటి కవ్వింపునకు పాల్పడకపోయినా పోలీసులు కాల్పులు జరిపారని ఆందోళనకారులు ఆరోపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సుమారు 3 వేల మంది పోలీసులను మోహరించారు. 20 వేల మంది ఈ నిరసనలో పాల్గొన్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డి. జయకుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.3 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.1 లక్ష చొప్పున తమిళనాడు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పింది. ఇది ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం 11 మంది కాల్పుల్లో మరణించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన ప్రభుత్వ అధీనంలోని ఉగ్రవాదంతో సమానమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న నిరసనకారులపై కాల్పులు జరపడం గర్హనీయమని అన్నారు. ప్రాణనష్టానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. వ్యతిరేకత ఎందుకు? పర్యావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాల నిల్వలకు పెనుముప్పుగా మారిన వేదాంత కాపర్ యూనిట్‌ని మూసేయాలని స్థానికులు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు కంపెనీ విస్తరణా ప్రణాళికలు రచించటం వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచింది. తూత్తుకుడిలో స్టెరిలైట్ కంపెనీ గత 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాని నుంచి వస్తున్న రసాయనాల వల్ల కళ్లు మండుతున్నాయని, ఇతర అలర్జీలు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదుచేయడంతో 2013లో అప్పటి సీఎం జయలలిత ఆ కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులను జాతీయ హరిత ట్రిబ్యునల్ తిరస్కరించడంతో కంపెనీ తిరిగి తెరుచుకుంది. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల ఆ ప్రాంతంలో సీసం, ఆర్సెనిక్, సెలీనియం, అల్యూమినియం, రాగితో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
తూత్తుకుడిలో పోలీసులు కాల్పులు 11 మంది మృతి
-
తూత్తుకుడి హింస.. రాజకీయ దుమారం
సాక్షి, చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత ఆందోళనల అంశం రాజకీయ మలుపు తీసుకుంది. మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఆంక్షలు విధించి రెచ్చగొట్టారని, పైగా వారిపై అమానుషంగా పొట్టనబెట్టుకున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పటంతోనే పోలీసులు కాల్పులు చేపట్టినట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. మృతులకు నష్టపరిహారం అందిస్తామన్న ఆయన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ...‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిపోయి.. ఈ ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొంది. అవినీతిని ప్రొత్సహించటం కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ ఫ్యాక్టరీ మూత పడాల్సిందే. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తూత్తుకుడి పరిస్థితుల నేపథ్యంలో రేపు కర్ణాటకలో జరగబోయే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరు కావటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు కీలక నేతలతో స్టాలిన్ తూత్తుకుడిలో పర్యటించే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలపై నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా స్పందించారు. ‘పౌరుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. వాళ్లేం నేరగాళ్లు కాదు. ప్రజా హక్కులను కాపాడాల్సింది పోయి పొట్టనబెట్టుకుంది. జంతువులను కాల్చి చంపినట్లు చంపారు. శాంతియుత ఆందోళనను హింసాత్మకంగా మార్చింది ప్రభుత్వమే. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు తూత్తుకుడికి వెళ్తాను. తక్షణమే ఫ్యాక్టరీని మూసేయాలి’ ఆయన డిమాండ్ చేశారు. వివాదం... 1996లో స్టెరిలైట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కాపర్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఈ ఫ్యాక్టరీ మాత్రం రెట్టింపు ఉత్పత్తి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 మార్చిలో వేలాది మంది ప్రజలు ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేయటం, విషపూరిత వాయువుల కారణంగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత వ్యాధులతో వేలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఫ్యాక్టరీని మూసేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే నేషన్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలతో తిరిగి ఫ్యాక్టరీ తెరుచుకుంది. అదే ఏడాది ఎడీఎంకే చీఫ్ వైకో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా, పర్యావరణానికి, ప్రజలకు చేసిన నష్టానికి 100 కోట్ల జరిమానా విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ మాత్రం ‘ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు ఎక్కడా ఉల్లంఘించటం లేదు’ అని వాదించి ఆ జరిమానా నుంచి తప్పించుకుంది. అంతేకాదు ఇప్పుడు ఫ్యాక్టరీ మూసివేత డిమాండ్ ఊపందుకున్న వేళ.. తమ ఫ్యాక్టరీ ద్వారా పరోక్షంగా 25 వేల మందికి, ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వాదిస్తోంది. అయితే స్థానిక ప్రజలు ఇది ప్రమాదకరమని, తక్షణమే మూసేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు లైసెన్స్ రెన్యువల్‌కు ఫ్యాక్టరీ యాజమాన్యం యత్నిస్తుందన్న వార్తలు బయటకు పొక్కటంతో ఈ ఆందోళనలు తీవ్ర తరం అయ్యాయి. -
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్) మళ్లీ రణరంగంగా మారింది. ఉదయం జరిగిన పరిణామాల తర్వాత కాసేపు శాంతించిన ఆందోళనకారులు మళ్లీ చెలరేగిపోయారు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఆందోళనలో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. ఉదయం నుంచి మొదలై... స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు చేసినా అన్నాడీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతోందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 20 వేల మంది మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే వారిని మరోచోట ఆందోళన నిర్వహించుకోవాలంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. తొలుత పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ ఆందోళనకారులు విజృంభించటంతో కాల్పులు జరపగా 9 మంది మృతి చెందారు.