తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది.
కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment