Tuttukudi
-
తమిళనాడులో మరో అంతరిక్ష కేంద్రం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ భౌగోళిక చిత్రపటంలో తమిళనాడు సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. అంతరిక్ష ప్రయోగాలకు ఏకైక కేంద్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సరసన తూత్తుకూడి జిల్లా కులశేఖరపట్టిలో ప్రతిష్టాత్మకంగా రెండో అంతరిక్ష ప్రయోగ కేంద్రం స్థాపనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలించి... శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో రెండు లాంచింగ్ ప్యాడ్ (1,2)లు ఉన్నాయి. భవిష్యత్తులో మరో రెండు లాంచింగ్ ప్యాడ్లు అవసరమని భావిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించి అనువైన భూమికోసం అన్వేషించారు. తూత్తుకూడి జిల్లా తిరుచెందూరుకు సమీపంలోని కులశేఖరపట్టి అనుకూలమని నిర్ణయించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కులశేఖరపట్టిలో 3, 4 లాంచింగ్ ప్యాడ్లను నిర్మించేందుకు కేంద్రం సైతం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాల్లో గతవారం కేంద్ర అణుశక్తి శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. రిస్క్ తక్కువ, ఇంధనం ఆదా... కులశేఖరపట్టి అంతరిక్ష ప్రయోగాల నుంచి చేసే ప్రయోగాలతో ఎన్నో లాభాలున్నాయి. శ్రీహరికోట నుంచి ప్రయోగాలు చేసేటపుడు వాహక నౌకను దక్షిణం వైపునకు మాత్రమే పయనింపజేయాల్సి ఉంది. అయితే దక్షిణం వైపున శ్రీలంక దేశం ఉంది. అంతరిక్ష ప్రయోగాలు చేసేపుడు మరో దేశం మీదుగా వాహక నౌక ప్రయాణించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. వాహక నౌక ప్రయోగం విఫలమైతే దారితప్పి శ్రీలంకపైకి వెళ్లకుండా సముద్రంలోనే కూల్చివేసేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. అధిక శ్రమకోర్చి దిశను మార్చడం వల్ల దూరంతోపాటు ఖర్చూ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కులశేఖరపట్టి నుంచి ప్రయోగిస్తే దారిమళ్లించే అవసరం ఉండదని విశ్వసిస్తున్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తే శ్రీలంక చుట్టూ తిరుగుతూ నాలుగు దశల్లో విడిపోతూ గమ్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. కులశేఖరపట్టినుంచయితే మూడు దశలే సరిపోతాయి. ఇంధనం ఎంతో ఆదా అవుతుంది. మరింత బరువైన వాహక నౌకల ప్రయోగానికి అనుకూలం... కులశేఖరపట్టి భూమధ్య రేఖకు అతి సమీపంలో ఉంది. శ్రీహరికోట కేంద్రంలోని భూమికి గరిష్టంగా 1,350 కిలోల బరువైన వాహక నౌకను ప్రయోగించగల సామర్థ్యం ఉండగా, కులశేఖరపట్టి వద్ద భూమికి 1,800 కిలోల బరువును తట్టుకోగల శక్తి ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణాలవల్లే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. తొలిదశగా కులశేఖరపట్టి పరిధిలోని మూడు గ్రామాల్లో 2,300 ఎకరాల భూ సేకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. తిరుచెందూరులో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటుచేసి ఎనిమిది విభాగాలకు చెందిన అధికారులు పనులు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. -
ఫిర్యాదు చేయడానికొస్తే లాడ్జికి తీసుకెళ్లాడు!
సాక్షి, చెన్నై : ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను స్టేషన్ ఎస్ఐ లాడ్జికి తీసుకువెళ్లిన సంఘటన తూత్తుకుడిలో సంచలనం కలిగించింది. తూత్తుకుడి జిల్లా, శ్రీ వైకుంఠం సబ్ డివిజన్ పరిధిలో పోలీసుస్టేషన్ తుంగనల్లూరు సమీ పాన ఉంది. ఇక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న వ్య క్తిపై అనేక ఆరోపణలున్నాయి. అదే ప్రాంతానికి చెందిన మహిళ కుమారుడు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక స్థానిక నాయకుడు ఎనిమిది సవర్ల బంగారు నగలను తీసుకుని మోసగించాడు. దీనిగురించి ఆ మహిళ శ్రీవైకుంఠం సబ్ డివిజన్లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్ఐ కేసు విచారణ జరపకుండా మహిళను లొంగదీసుకున్నాడు. రెండు రోజు ల క్రితం మహిళను ఎస్ఐ తిరుచెందూరు లాడ్జికి తీసుకువెళ్లి గడిపాడు. దీనిగురించి విచారణ జరిపిన స్పెషల్ బ్రాంచి పోలీసులు తూత్తుకుడి ఎస్పీకి నివేదిక అందజేశారు. దీంతో తూత్తుకుడి ఎస్పీ అరుణ్‌పాల్ గోపాలన్ సదరు ఎస్ఐని సాయుధ దళానికి మారుస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అందుకే నాన్నను చంపేశా!
సాక్షి, చెన్నై : సోదరులు నగదు సాయం చేయడాన్ని అడ్డుకోవడంతోనే తండ్రిపై పెట్రోలు పోసి హతమార్చానని మృతుడి కుమార్తె మంగళవారం పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చింది. తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టికి చెందిన సుబ్బయ్య (68)ని ఈ నెల 3న తన కుమార్తె మూక్కమ్మాళ్ పెట్రోలు పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. మంటల్లో చిక్కుకున్న అతన్ని స్థానికులు రక్షించి తిరుచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి సుబ్బయ్య మృతిచెందాడు. ఇలా ఉండగా దీనికి కారణమైన ముక్కమ్మాళ్ కోసం నాలాట్టిన్ పుత్తూరు పోలీసులు గాలిస్తూ వచ్చారు. ఎట్టకేలకు మంగళవారం ఆమెను అరెస్టు చేశారు. పోలీసులకు ముక్కమ్మాళ్ ఇచ్చిన వాంగ్మూలంలో ఇలా చెప్పింది. తనకు ముగ్గురు సోదరులున్నారని, భర్తతో విడిపోయిన తాను తన పిల్లలను బాగా చదివించేందుకు నిర్ణయించానని తెలిపింది. పెద్ద, చిన్న కుమార్తెను ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చేర్పించానని, వారి చదువు కోసం తాను మిల్లులో పని చేస్తున్నట్లు చెప్పింది. వచ్చే ఆదాయం ఏ మాత్రం సరిపోవడం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులతో పాటు విదేశాల్లో ఉన్న సోదరులను నగదు సాయం కోరినట్లు తెలిపింది. వారు కొంతమేరకు నగదు పంపుతూ వచ్చారని, సోదరులు నగదు పంపడాన్ని తండ్రి అడ్డుకున్నట్లు పేర్కొంది. ఇది తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. దీంతో ఈ నెల 3న తండ్రిపై పెట్రోల్ కుమ్మరించి హతమార్చినట్లు తెలిపింది. పోలీసులు ముక్కామ్మాళ్‌ను కోవిల్పట్టి కోర్టులో హాజరుపరిచి నెల్లై కొక్కిర కుళం మహిళా జైలులో బంధించారు. -
ఆస్తి తగాదా.. తమ్ముడిని కాల్చిచంపిన అన్న
సాక్షి, చెన్నై: ఆస్తి తగాదా ఓ పారిశ్రామికవేత్త కుటుంబంలో చిచ్చుపెట్టింది. ఉమ్మడి కుటుంబం విడిపోతోందన్న వేదనతో తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశాడు అన్న. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడిలో చోటుచేసుకుంది. మట్టకడై ప్రాంతానికి చెందిన బిల్లా జగన్ (43) కుటుంబానికి ట్రాన్స్‌పోర్టు, ఫైనాన్స్ సంస్థలు, కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. డీఎంకే పార్టీకి తూత్తుకుడి నేతగా వ్యవహరిస్తున్న జగన్‌కు, సిమన్సన్ (37)తో పాటు మరో ఇద్దరు సోదరులు ఉన్నారు. సిమన్సన్కు ఏడాదిన్నర క్రితం మనపట్టికి చెందిన ధరణితో వివాహం అయ్యింది. అందరూ ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆస్తి పంచాలని సిమన్సన్ గొడవ పడేవాడు. కుటుంబంలోని మిగిలిన వాళ్లకు ఆస్తి పంచుకోవడం ఇష్టం లేదు. తూత్తుకుడికి చెందిన ఓ పోలీసు అధికారి ఈ అన్నదమ్ముళ్ల మధ్య పంచాయితీ పెట్టి సఖ్యతకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగన్, సిమన్సన్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆస్తి పంచే ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్పేశాడు. అదే సమయంలో సిమన్సన్ భార్య ధరణి ఆగ్రహంతో తన పుట్టింటికి వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లడం, అన్నయ్య ఆస్తి పంచకపోవడంతో ఆగ్రహానికి గురైన సిమన్సన్ రాత్రి సమయంలో తన మిత్రులు మారి, నారాయణన్‌లతో కలసి ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన జగన్ తన వద్ద ఉన్న తుపాకీతో సిమన్సన్ను కాల్చాడు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ్ముడి హత్య అనంతరం విదేశాలకు పారిపోయేందుకు జగన్ ప్రయత్నించాడు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం విమానాశ్రయంలో మంగళవారం జగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రజనీని ప్రశ్నించిన యువకుడు ..వైరల్ వీడియో
-
‘నేను రజనీకాంత్‌ను’; వీడియో వైరల్
చెన్నై : సూపరస్టార్ రజనీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రాంతాలకతీతంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ ‘బాషా’ పాపులారిటీ గురించి 1989లో వచ్చిన ‘రాజా చిన్న రోజ’ సినిమాలో ఒక పాట ఉంది. ఆ పాటలో ‘సూపర్‌స్టార్ ఎవరని చిన్న పిల్లలను అడిగిన సమాధానం చెప్తారు’ అనే చరణం అప్పట్లో బాగా పాపులర్. అయితే తూత్తుకుడికు చెందిన సంతోష్ కుమార్(21) ఆ సినిమా విడుదల నాటికి ఇంకా పుట్టలేదేమో అందుకే ఏకంగా సూపర్‌స్టార్‌ను పట్టుకుని ‘ఎవరు నువ్వు...?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు సూపర్ స్టార్ ‘నేను రజనీకాంత్‌ను...’ అంటూ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూత్తుకుడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన రజనీని ఓ యువకుడు ‘ఎవరు మీరు..?’ అని ప్రశ్నించాడు. అందుకు ఈ సూపర్‌స్టార్ చిరునవ్వుతో ‘నేను రజనీకాంత్’ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో గతంలో ఎప్పుడు లేనంతగా నెటిజన్లు రజనీని ట్రోల్ చేస్తున్నారు. ‘నాన్థాన్పా రజనీకాంత్’(నేను రజనీకాంత్‌ను), ‘యాంటీతమిళ్ రజనీకాంత్’ హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి ఓ ఆట ఆడేసుకుంటున్నారు. తూత్తుకూడికి చెందిన సంతోష్ బీకామ్ చదువుతున్నాడు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలని కృషి చేసిన వారిలో ఇతనొకడు. ఇటీవల స్టెరిలైట్ బాధితులను పరామర్శించడానికి ఓ మంత్రి ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా సంతోష్ ఆయన్ని ఇలాంటి వింత ప్రశ్నలే అడిగాడట. ఇప్పుడు ఏకంగా తలైవానే ‘ఎవరు నువ్వు..?’ అని అడిగాడు. తూత్తుకుడిలో మే 22న జరిగిన విధ్వంసానికి సంఘ విద్రోహశక్తులే కారణమని రజనీకాంత్ అన్న విషయం తెలిసిందే. -
జనాగ్రహం
-
తూత్తుకుడి
తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది. కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. -
తూత్తుకుడి ఎఫెక్ట్: 32వేల ఉద్యోగాలకు గండి
తూత్తుకుడి : గత కొద్ది రోజులుగా తూత్తుకుడిలోని స్టెరిలైట్ కాపర్(రాగి) కంపెనీని మూసివేయాలని జరుగుతున్న ఉద్యమం కారణంగా 32వేల ఉద్యోగాలకు గండి పడనుంది. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో 32వేల ఉద్యోగాలకు కోత విధించాలని యాజమాన్యం భావిస్తోంది. స్టెరిలైట్ కాపర్ కంపెనీపై ఆధారపడి ప్రస్తుతం ప్రత్యక్షంగా 3,500, పరోక్షంగా దాదాపు 30వేల మంది ఉపాది పొందుతున్నారు. కేవలం 1000 మందిని మాత్రమే పనిలో ఉంచుకోవాలని మిగిలిన వారిని తొలగించాలని యాజమాన్యం భావిస్తోంది. ఉద్యమం కొనసాగినంత కాలం పరోక్షంగా కంపెనీలో పని చేస్తున్న వారిని తొలగించాలని చూస్తోంది. కొన్ని మరమ్మత్తుల కారణంగా కంపెనీ మార్చి27 నుంచి మూసివేశామని మళ్లీ జూన్ మొదటి వారంలో తిరిగి తెరుస్తామని యాజమాన్యం తెలిపింది. కంపెనీ వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటోందని, భూగర్భ జలాలు కలుషితం అవ్వడంతో పాటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గత 100రోజులుగా స్థానికులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. -
స్టెరిలైట్ విస్తరణ పనులను నిలిపేయండి
-
తూత్తుకుడిలో బంద్, స్టాలిన్, కమల్ పర్యటన
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సినీనటుడు కమల్‌హాసన్ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లనున్నారు. కాగా తూత్తుకుడి స్టెర్లైట్ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. -
రక్తసిక్తమైన తూత్తుకుడి
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు దుర్మరణం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుత్తుకుడి జిల్లా దళవాయుపురం వద్ద ఓ వ్యాన్ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కింద పడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. వీరంతా కన్యాకుమారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరో రెండు హార్బర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో చెన్నై, తూత్తుకుడి, ఎన్నూరు, నాగపట్నం, కడలూరు, రాయపురం, కాట్టుపల్లి తదితర పోర్టులు ఉన్నాయి. వీటిలో వర్తక, వాణిజ్యంతోపాటూ ఫిషింగ్ హార్బర్లుగా కొన్ని ప్రసిద్ధికెక్కాయి. వీటితోపాటూ రామేశ్వరం, ధనుష్కోటిలలో హార్బర్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు ప్రాంతాల్లోని మత్స్యకారులను మరింత ఎక్కువగా చేపలవేటకు ప్రోత్సహించే నిమిత్తం రెండు కొత్త హార్బర్ల ప్రాంత సముద్రం లో చేప పిల్లలను పెద్ద సంఖ్యలో వదులుతారు. మత్స్యకార శాఖ పరిధిలోని సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో ఈ రెండు ప్రాంత హార్బర్ల పరిధిలోని మత్స్యకారులకు ప్రాధాన్యత కల్పిస్తారు. కొత్త హార్బర్ల నిర్మాణంపై సాగుతున్న సర్వే నిమిత్తం రాష్ట్ర మత్స్యశాఖ డెరైక్టర్ బీలారాజేష్ ఇటీవల రామేశ్వరం, ధనుష్కోటిలలో పర్యటించారు. అక్కడి మత్స్యకారులతో ఏర్పడిన అనుభవాలను బుధవారం మీడియాకు వివరించారు.