సాక్షి, చెన్నై : ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను స్టేషన్ ఎస్‌ఐ లాడ్జికి తీసుకువెళ్లిన సంఘటన తూత్తుకుడిలో సంచలనం కలిగించింది. తూత్తుకుడి జిల్లా, శ్రీ వైకుంఠం సబ్ డివిజన్ పరిధిలో పోలీసుస్టేషన్ తుంగనల్లూరు సమీ పాన ఉంది. ఇక్కడ ఎస్‌ఐగా పనిచేస్తున్న వ్య క్తిపై అనేక ఆరోపణలున్నాయి. అదే ప్రాంతానికి చెందిన మహిళ కుమారుడు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక స్థానిక నాయకుడు ఎనిమిది సవర్ల బంగారు నగలను తీసుకుని మోసగించాడు. దీనిగురించి ఆ మహిళ శ్రీవైకుంఠం సబ్ డివిజన్‌లోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్‌ఐ కేసు విచారణ జరపకుండా మహిళను లొంగదీసుకున్నాడు. రెండు రోజు ల క్రితం మహిళను ఎస్‌ఐ తిరుచెందూరు లాడ్జికి తీసుకువెళ్లి గడిపాడు. దీనిగురించి విచారణ జరిపిన స్పెషల్ బ్రాంచి పోలీసులు తూత్తుకుడి ఎస్పీకి నివేదిక అందజేశారు. దీంతో తూత్తుకుడి ఎస్పీ అరుణ్‌పాల్ గోపాలన్ సదరు ఎస్‌ఐని సాయుధ దళానికి మారుస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment