Japanese Company Bans Late Night Work At Office - Sakshi
Sakshi News home page

నైట్‌ షిఫ్ట్‌లు నిషేధం.. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఎంత పనిచేసిందంటే

Published Mon, Jul 17 2023 9:32 PM | Last Updated on Tue, Jul 18 2023 10:14 AM

Japanese Company Bans Late Night Work - Sakshi

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌లో జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశంలోని మహిళల సగటు సంతానోత్పత్తి రేటు వరుసగా ఏడో ఏడాదీ క్షీణించింది. 2022లో ఇది రికార్డు స్థాయిలో 1.26 కనిష్టానికి పడిపోయింది. అయితే, ఈ తరుణంలో ఆ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ ఇటోచు కార్పొరేష‌న్ 10 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో మ‌హిళా ఉద్యోగుల సంతాన సాఫ‌ల్య రేటు పెరిగినట్లు తెలుస్తోంది. 

2010లో జపాన్ ట్రేడింగ్ కంపెనీ ఇటోచు కార్ప్ సీఈవోగా మ‌షిహిరో ఒక‌ఫుజి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆఫీస్‌లో ప్రొడక్టివిటీని పెంచేందుకు పనిగంటల్ని తగ్గించారు. నైట్‌షిఫ్ట్‌లను రద్దు చేశారు. దీంతో ఇటోచు నిర్ణయం ఆ సంస్థ స‍్వరూపాన్నే మార్చేసింది. 2010 నుంచి 2021 వ‌ర‌కూ భారీ లాభాల్ని ఆర్జించింది. మెటర్నిటీ లీవ్‌లు తీసుకున్న మహిళా ఉద్యోగులు తిరిగి విధుల్లోకి వస్తున్నారు. 

జ‌పాన్‌లో స‌గ‌టు సంతాన రేటు 1.3ను ఈ కంపెనీ ఉద్యోగినులు అధిగ‌మించారు. ఇటీవ‌ల ఉద్యోగుల‌కు వారానికి రెండు రోజులు ఇంటినుంచి ప‌నిచేసేందుకు ఇటోచు అనుమ‌తించ‌డంతో పాటు కార్యాల‌య ప‌ని గంట‌ల‌ను ఎనిమిది నుంచి ఆరు గంట‌ల‌కు కుదించింది. కొన్ని సమయాల్లో ఓవ‌ర్‌టైమ్‌ను కూడా ర‌ద్దు చేశారు.

ఈ క్ర‌మంలో ప‌లువురు మ‌హిళా ఉద్యోగులు మెట‌ర్నిటీ లీవులు తీసుకుని పిల్ల‌ల‌ను క‌ని తిరిగి ప‌నిచేసేందుకు వ‌చ్చారు. తాము ఉత్పాద‌క‌త పెంచేందుకు తీసుకున్న ఈ నిర్ణ‌యం బ‌ర్త్ రేట్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని తామ‌నుకోలేద‌ని ఇటోచు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫుమిహికో కొబ‌య‌షి చెప్పుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement