చెన్నై: తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని, జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ఇదివరకే అనౌన్స్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు పాత కేసులు పలకరిస్తున్నాయి. తాజాగా తూత్తుకుడి కేసు విచారణకు హాజరు కావల్సిందిగా రజనీకి సమన్లు జారీ చేశారు. ఈ విషయంపై జనవరి 19 లోపు సమాధానం ఇవ్వాలని సింగిల్ జడ్జి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2018 మేలో తూత్తుకుడిలోని స్టెరిలైట్‌కు కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీలో ఫైరింగ్ జరగడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు. (లతా రజనీకాంత్‌కు హైకోర్టు నోటీసులు)
దీనిపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రిటైర్ట్ జస్టిస్ అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజనీకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. తూత్తుకుడి ఘటనలో పోలీసుల చర్యను సైతం ఆయన తప్పుబట్టారు. దీనిపై విచారణకు హాజరు కావాల్సిందిగా రజినీకి కమిషన్ సమన్లు జారీ చేయగా మినహాయింపు కోరారు. తాజాగా ప్రజలు ప్రతీ అంశంలో నిరసనలు ప్రారంభిస్తే అప్పుడు తమిళనాడు మొత్తం స్మశానవాటిక అవుతుందని పేర్కొన్నాడు. రజినీ రాజకీయాల్లో చేరబోయే కొద్దిసేపటి క్రితమే ఈ వ్యా్ఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా రజనీ పార్టీ అనౌన్స్‌మెంట్ చేశాక ఒక్కసారిగా కేసులు చుట్టుముట్టడంతో గమనార్హం. (రజనీతో పొత్తుకు సిద్ధం: కమల్‌హాసన్)
Comments
Please login to add a commentAdd a comment