
Aishwaryaa Rajinikanth Admitted In The Hospital: సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య మరోసారి ఆసుపత్రి పాలైంది. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. గతంలో కరోనా కారణంగా ఐశ్వర్య ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా పోస్ట్ కోవిడ్ కారణంగా అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జీవితం కరోనాకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉంది. జ్వరం, వర్టిగోతో మరోసారి ఆసుపత్రిలో చేరాను అంటూ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరూ తమతమ పనుల్లో ఫుల్ బిజీగా మారిపోయారు.