Rajinikanth Two Daughters Marriage Life Ended In Divorce, Deets Inside - Sakshi
Sakshi News home page

Rajinikanth: తలైవా కుటుంబంలో విడాకుల చిచ్చు.. అప్పట్లో చిన్న కూతురు..

Published Tue, Jan 18 2022 4:15 PM | Last Updated on Tue, Jan 18 2022 5:10 PM

Rajinikanth Two Daughters Marriage Life Ended In Divorce, Deets Inside - Sakshi

Rajinikanth Two Daughters Marriage Life Ended In Divorce, Deets Inside: విడాకుల ప్రకటనతో హీరో ధనుష్‌- ఐశ్వర్యలు అభిమానులకు ఊహించని షాక్‌ ఇచ్చారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ సోషల్‌ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్‌, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్‌ కపూల్‌.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు18 ఏళ్ల తర్వాత విడిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారంటూ ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ధనుష్‌- ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో రజనీకాంత్‌ చిన్న కూతురు సౌందర్య విడాకుల అంశం​ కూడా మరోసారి తెరమీదకి వచ్చింది. అప్పట్లో సౌందర్య విడాకులు కోలీవుడ్‌ నాట సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. 2010లో అశ్విన్‌ అనే వ్యాపారవేత్తతో సౌందర్యకు వివాహం జరిగింది. వీరికి వేద్‌ కృష్ణ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది.

అనంతరం రెండేళ్లకు నటుడు, బిజినెస్‌ మ్యాన్‌ విషగన్‌ వనంగముడిని పెళ్లాడింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సైతం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి కలతలు లేకుండా సాఫీగానే సాగుతుంది వారి బంధం. కానీ రజనీ కూతుళ్లు మాత్రం వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement