Soundarya Rajinikanth
-
మనవడిపై రజనీకాంత్ ప్రేమ.. ఫోటో స్టోరీ చెప్పిన సౌందర్య
కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. కుర్ర హీరోలతో దూసుకుపోతూ భారీ హిట్లు అందుకుంటున్నారు. అయితే, నిజజీవితంలో ఆయన చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారని తెలుసు.. మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఆయన లైఫ్‌స్టైల్ ఉంటుంది. తాజాగా ఆయన కూతురు సౌందర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన ఫోటోలు పంచుకుంది. అందులో రజనీకాంత్‌తో పాటు ఆమె పెద్ద కుమారుడు వేద్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈరోజు తన కుమారుడు వేద్ స్కూల్‌కు వెళ్లనంటూ మారం చేయడంతో మనవడి కోసం రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చారని సౌందర్య తెలిపింది. అప్పుడు మనవడిని రజనీకాంత్ స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లారని ఆమె చెప్పుకొచ్చింది. ఆన్ స్క్రీన్లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా ప్రతి పాత్రనూ పోషించడంతో మీరూ దిట్ట అంటూ తన తండ్రి గురించి ఆమె తెలిపింది. బెస్ట్ తాత, బెస్ట్ డాడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆమె చేర్చింది. తన మనుమడు వేద్‌తో పాటుగా రజనీకాంత్ కూడా తరగతి గదిలోకి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు అందరూ సర్ప్రైజ్ అయ్యారు. వెండితెరపైన కనిపించే తలైవా తమ ముందు ఒక సాధారణ వ్యక్తిలా వచ్చేసరికి వారు ఆశ్చర్యానికి గురైయారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.రజనీకాంత్ నటిస్తున్న 170వ చిత్రం ‘వేట్టయాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Soundarya Rajinikanth (@soundaryaarajinikant) -
మనవడి బర్త్‌డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసు దాటినా ఎంతో హుషారుగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ భాషల్లో కలిపి 170 చిత్రాలు చేశాడు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు విన్నాడు. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి పెద్ద పీట వేస్తుంటాడు.కూతురి కోసమే ఆ సినిమాలో..తన కుమార్తెలంటే రజనీకి ఎనలేని ప్రేమ. వారికోసం ఏదైనా చేస్తాడు. అందులో భాగంగానే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, పాత్ర గురించి ఆలోచించకుండా కేవలం కూతురి కోసమే ఆయన ఈ సినిమా చేశాడని అభిమానులు భావించారు.రజనీ పంచప్రాణాలురజనీ పంచప్రాణాలైన ఇద్దరు కూతుర్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ఐశ్వర్య.. ధనుష్‌ను పెళ్లి చేసుకోగా రెండేళ్ల క్రితమే అతడితో విడిపోయింది. చిన్నకూతురు సౌందర్య 2010లో అశ్విన్ రామ్‌కుమార్‌ను పెళ్లాడింది. వీరికి 2015లో వేద్ కృష్ణ జన్మించాడు. ఆ మరుసటి ఏడాదే భార్యాభర్తలిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు. 2017లో విడాకులు మంజూరయ్యాయి. తర్వాత ఆమె 2019లో నటుడు, బిజినెస్మెన్ విషగన్‌ను పెళ్లాడింది. వీరికి 2022లో వీర్ అనే కుమారుడు జన్మించాడు.వేద్ బర్త్డేతాజాగా సౌందర్య మొదటి కుమారుడు వేద్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చెన్నైలో ఘనంగా జరిగాయి. క్రికెట్ థీమ్‌తో పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ బర్త్‌డే ఈవెంట్‌కు రజనీ భార్య లతతో హాజరై మనవడితో కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.#Thalaivar at his grandson Ved birthday celebration ❤️❤️#Rajinikanth | #SuperstarRajinikanth | #superstar @rajinikanth | #Coolie | #Vettaiyan | #Jailer pic.twitter.com/tKvGGWrfjo— Suresh Balaji (@surbalu) May 19, 2024చదవండి: కమెడియన్‌తో రెండో పెళ్లి.. ఈ వయసులో అవసరమా? అని విమర్శలు.. స్పందించిన నటి -
కూతురు కోసం రజనీకాంత్ మరో సాహసం.. ఈ సారి రిజల్ట్ ఏంటో?
ఎవర్గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటుడు రజనీకాంత్. ఈయనకు దళపతి విజయ్ పోటీ అంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంతో నటుడు రజనీకాంత్ లాల్ సలామ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై గట్టిగానే కౌంటర్ ఇచ్చిన విషయం విధితమే. కాగా ఇప్పుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి పార్టీ పేరును కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఒకటి రెండు చిత్రాలు చేసి నటనకు స్వస్తి పలకబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రజనీకాంత్ సూపర్‌స్టార్ పట్టానికి మరి కొంతకాలం ఎలాంటి ఢోకా ఉండబోదనేది కోలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ విషయాన్ని పక్కన పెడితే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ఈయన ప్రస్తుతం జై భీమ్ చిత్ర ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత లోకేష్ కనకరాజ్‌తో తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల తన పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ అతిథిగా పవర్ఫుల్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే పెద్ద కూతురు చిత్రంలో నటించిన రజనీకాంత్ తాజాగా ఆయన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అతిథి పాత్రలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సౌందర్య ఇంతకు ముందే తన తండ్రి కథానాయకుడిగా కోచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కాగా తాజాగా సౌందర్య రజనీకాంత్ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు, ఈ చిత్రానికి పది రోజులు కాల్షీట్స్ కూడా కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. -
మరదలు చేయాల్సిన సినిమా.. ధనుష్ చేస్తున్నాడు!
నటుడిగా ఈ మధ్యే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు ధనుష్. అయితే ధనుష్ కేవలం నటుడు మాత్రమే కాదు.. గేయ రచయిత, సింగర్, నిర్మాత, దర్శకుడు కూడా! 2017లో వచ్చిన పా పండి చిత్రంతో దర్శకుడిగా మారాడు ధనుష్. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు. తన 50వ సినిమాకు తనే దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోబం సినిమాకు సైతం దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోబం సినిమా మోషన్ పోస్టర్‌ను ధనుష్ రిలీజ్ చేశాడు ధనుష్. ధనుష్ మూడో సినిమా! ఇందులో సినిమాలో నటించే తారాగణాన్ని పరిచయం చేశాడు. మాథ్యూ థామస్, పవిశ్, అనిఖా సురేంద్రన్, ప్రియ ప్రకాశ్ వారియర్, రమ్య రంగనాథన్, వెంకటేశ్ మీనన్, రబియా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు వీడియో ద్వారా స్పష్టం చేశారు. అయితే ఈ సినిమా ఇప్పటికిప్పుడు అనుకుని చేసింది కాదు! చాలా ఏళ్ల క్రితమే ఈ సినిమా కథ రాసుకున్నాడు ధనుష్. అంతేకాదు, ఈ చిత్రాన్ని తెరకెక్కించాల్సిన బాధ్యత నీదేనంటూ తన మరదలు సౌందర్య రజనీకాంత్(ధనుష్ భార్య ఐశ్వర్య సోదరి)కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. వీఐపీ 2 వల్ల సైడ్ అయిపోయిన ప్రాజెక్ట్ ఈ విషయాన్ని సౌందర్య గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది. 'నిలవుక్కు ఎన్మెల్ ఎన్నడి కోబం సినిమా కోసం ఎంతో కసరత్తులు చేశాను. ఈ సినిమాకు నటీనటులు కావలెనంటూ సోషల్ మీడియాలోనూ ప్రకటించాం. ధనుష్ ఈ స్క్రిప్ట్ చాలా బాగా రాశాడు. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమాకు సరైనవాళ్లను ఎంచుకోలేకపోయాం. పైగా అదే సమయంలో వీఐపీ 2(రఘువరన్ బీటెక్ సీక్వెల్) గురించి చర్చలు జరగడంతో ఇది సైడ్ అయిపోయింది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె చెప్పినట్లుగానే ధనుష్ 'వీఐపీ 2' సినిమాకు దర్శకురాలిగా వ్యవహరించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఇకపోతే ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే! చదవండి: ఆర్థిక కష్టాల్లో కమెడియన్ కుటుంబం.. సాయం చేసిన విజయకాంత్! -
'గ్యాంగ్స్' సిరీస్ నిర్మిస్తున్న రజనీ చిన్న కూతురు, ఆ ఓటీటీలోనే!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో ఆయన ముఖ్యపాత్రను పోషించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రజనీకాంత్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జైభీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య వెబ్‌సిరీస్‌ను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఆమె ఇంతకుముందు తండ్రి రజనీకాంత్ కథానాయకుడిగా కోచ్చడైయాన్ అనే యానిమేషన్ చిత్రాన్ని, ధనుష్ కథానాయకుడిగా వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రాలకు దర్శకత్వం వహించారన్న విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. దీనికి గ్యాంగ్స్ అనే టైటిల్ నిర్ణయించారు. నోవా అబ్రహం దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్‌లో అశోక్‌సెల్వన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. గురువారం చైన్నెలో ఈ వెబ్ సిరీస్ పూజాకార్యక్రమం జరిగింది. ఇందులో రజనీకాంత్ పాల్గొని ముహూర్తం షాట్‌కు క్లాప్‌కొట్టి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. My team and I are thrilled to get the blessings of “the one and only” today for our webseries 💥💥🙏🏻🙏🏻💥💥 thank you thalaivaaaa ⭐️⭐️⭐️⭐️ thank you Superstar ✨✨⚡️⚡️💫💫 thank you my dearest appa 🩵❤️🩵❤️🩵❤️ onwards & upwards 🙏🏻🙏🏻🙏🏻 gods and gurus grace !!!! @May6Ent pic.twitter.com/bp2WJOVQ40 — soundarya rajnikanth (@soundaryaarajni) September 7, 2023 చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా? అంత జరిగినా కూడా నేను వెనుకడుగు వేయలేదు: కృతిసనన్ -
రజనీకాంత్‌ను చూసి వారు ఆశ్చర్యపోతున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన చిత్రాల వేగాన్ని పెంచుతున్నారు. గ్యాప్ లేకుండా చిత్రాలు చేస్తూ ఈతరం హీరలను మించిపోతున్నారు. ఏడుపదుల వయసులోనూ అవిశ్రాంతిగా నటిస్తున్న రజనీకాంత్‌ను చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే జైలర్ చిత్రంలో నటించారు. దీన్ని సన్ పిచ్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. నెల్సన్ దర్శకత్వం వహించారు. ఇందులో జైలర్‌గా నటిస్తున్న రజినీకాంత్ రెండు గెటప్పుల్లో కనిపిస్తారా? లేక రెండు పాత్రల్లోనా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు 10వ తేదీన జైలర్ చిత్రం తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల) ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న లాల్ సలాం చిత్రం షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పుదుచ్చేరిలో జరుగుతోంది. దీంతో రజినీకాంత్ తన 170వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. (ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్) జైభీమ్ చిత్రం టీజే.జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. బోగస్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సాగే ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. -
రజనీకాంత్ చిన్న కూతురి ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగిన విషయం మరువక ముందే రజనీ చిన్నకూతురు సౌందర్య ఇంట్లో చోరీ జరిగింది. తన ఎస్యూవీ కారు కీ కనిపించడం లేదంటూ సౌందర్య చెన్నైలోని తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లివచ్చేలోపు తన ఎస్యూవీ కారు కీ కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా మార్చి నెలలో ఐశ్వర్య రజనీకాంత్ తన ఇంట్లో రూ.60 లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే! అవి తన పెళ్లి నగలని, వాటిని ఇంట్లోని లాకర్లో పెట్టినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 10న లాకర్ తెరిచి చూస్తే ఆ నగలేవీ కనిపించలేదని తెలిపింది. తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌లపై అనుమానం ఉందని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఐశ్వర్య అనుమానమే నిజమైంది. ఆమె ఇంట్లో పని చేసిన ఆ ముగ్గురే ఈ దొంగతనానికి తెగబడ్డారు. దొంగిలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అంతేకాకుండా కొంతకాలంగా ఐశ్వర్య ఇంట్లోని విలువైన వస్తువులను సైతం దొంగిలిచినట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. చదవండి: ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన కృతీ సనన్ -
తండ్రి యాక్షన్.. తనయ డైరెక్షన్.. కూతురి దర్శకత్వంలో సూపర్‌స్టార్!
రజనీకాంత్‌తో ‘2.0’,(2018) ‘దర్బార్’ (2020) వంటి చిత్రాలు తీసిన కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజనీతో మళ్లీ రెండు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల పూజా కార్యక్రమాలు ఈ నెల 5న చెన్నైలో జరగనున్నాయి. రజనీ కెరీర్లో 170, 171వ చిత్రాలుగా రూపొందనున్న ఈ సినిమాల దర్శకుల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సిబి చక్రవర్తి, దేసింగు పెరియస్వామి పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్యా రజనీకాంత్ పేరు తెరపైకి వచ్చింది. రజనీకాంత్ 170వ సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నారని కోలీవుడ్ టాక్. కాగా ఐశ్వర్య ఇప్పటికే ‘3’(2012), ‘వేయ్ రాజా వేయ్’(2015) చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఇక తన రెండో కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్ ‘కోచ్చడయాన్’ (2014) అనే సినిమా చేశారు. -
కొడుకు ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సౌందర్య రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. తాను తల్లైన విషయాన్ని పంచుకుంటూ చిన్నారికి వీర్ రజనీకాంత్ వనంగమూడి అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 20న తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఓ పోస్ట్ షేర్ చేశారు. తనయుడు వీర్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. ఇందులో సౌందర్య మెడలో పూలదండ వేసుకుని ఉండగా ఆమె వెనకాలే రజనీ నిలుచుని కనిపించారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్ కౌంటర్ ఇక తన పోస్ట్‌లో తండ్రిని ఉద్దేశిస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం దేవుడు నన్ను ఉత్తమమైన బహుమతితో దీవించాడు. అది నా పాప వీర్. అలాగే ఆ దేవుడు ఇచ్చిన మరో అద్భుతమైన వరం ఎప్పుడూ నా వెనకాల ఉంటుంది. ఆయనే నా ధైర్యం, బలం, ఆశీర్వాదం’ అంటూ సౌందర్య ఎమోషనల్ అయ్యారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్ కౌంటర్ కాగా 2017లో మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్ నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి తొలి సంతానంగా ఇటీవల వీర్ జన్మించాడు. అయితే గ్రాఫిక్ డిజైనర్, నిర్మాతగా సౌందర్య కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఓచెర్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న ఆమె తన తండ్రి రజనీకాంత్ విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారారు. To every person who took time to wish me on my birthday yesterday 💜💜💜🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻THANK YOU SO SO SO MUCH.. . gods have blessed me with the best gift this year, my Veer papa 😇😘😘😇 And having this amazing gods child behind me always 💪🏻💪🏻💪🏻💪🏻😍😍😍 life is a true blessing!!! pic.twitter.com/9PuIVyyWgq — soundarya rajnikanth (@soundaryaarajni) September 21, 2022 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్ కూతురు
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ రెండవసారి తల్లయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దేవుని దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్ కృష్ణ తమ్ముడికి స్వాగతం పలుకుతున్నాం. ఆదివారం(సెప్టెంబర్ 11) వీర్ రజనీకాంత్ వనంగమూడి మా జీవితాల్లోకి వచ్చాడని మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ ఆమె శుభవార్త పంచుకున్నారు. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? అంతేకాదు చిన్నారికి వీర్ రజనీకాంత్ వనంగమూడిగా పేరు పెట్టినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. కాగా గ్రాఫిక్ డిజైనర్, నిర్మాతగా సౌందర్య కోలీవుడ్‌లో రాణిస్తున్నారు. ఓచెర్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ ద్వారా పలు సినిమాలను తెరకెక్కిస్తున్న ఆమె తన తండ్రి రజనీకాంత్ విక్రమసింహ సినిమాతో దర్శకురాలిగా మారారు. 2017లో మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్ నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య.. 2019లో నటుడు, వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని రెండో వివాహం చేసుకున్నారు. తాజాగా వీరిద్దరికి తొలి సంతానంగా నిన్న(ఆదివారం) వీర్ జన్మించాడు. With gods abundant grace and our parents blessings 🙏🏻😇Vishagan,Ved and I are thrilled to welcome Ved’s little brother 💙💙💙 VEER RAJINIKANTH VANANGAMUDI today 11/9/22 #Veer #Blessed 😇🥰thank you to our amazing doctors @sumana_manohar Dr.Srividya Seshadri @SeshadriSuresh3 🙏🏻 pic.twitter.com/a8tXbqmTxf — soundarya rajnikanth (@soundaryaarajni) September 11, 2022 -
సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇద్దరు కూతుళ్లూ విడాకులు
Rajinikanth Two Daughters Marriage Life Ended In Divorce, Deets Inside: విడాకుల ప్రకటనతో హీరో ధనుష్- ఐశ్వర్యలు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు18 ఏళ్ల తర్వాత విడిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ధనుష్- ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య విడాకుల అంశం కూడా మరోసారి తెరమీదకి వచ్చింది. అప్పట్లో సౌందర్య విడాకులు కోలీవుడ్ నాట సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. 2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తతో సౌందర్యకు వివాహం జరిగింది. వీరికి వేద్ కృష్ణ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం రెండేళ్లకు నటుడు, బిజినెస్ మ్యాన్ విషగన్ వనంగముడిని పెళ్లాడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి కలతలు లేకుండా సాఫీగానే సాగుతుంది వారి బంధం. కానీ రజనీ కూతుళ్లు మాత్రం వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
రజనీకాంత్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన కూతురు సౌందర్య
సాక్షి, చెన్నై: తన తండ్రి రజనీకాంత్‌కు తమిళంలో రాయడం రాదని సినీ దర్శకురాలు, రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ విశాఖన్ అన్నారు. ఈమె సొంతంగా హూట్ అనే సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించారు. సోమవారం చెన్నైలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ ఆన్లైన్ ద్వారా దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సౌందర్య మాట్లా డుతూ.. తన తండ్రి ఓ సందర్భంలో ముఖ్యమైన విషయాన్ని వాయిస్ మెసేజ్ ద్వారా తనకు పంపించారన్నారు. చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? అప్పట్లో దివ్య భారతిని మైమరిపించారు అప్పుడే హూట్ పేరుతో సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించాలన్న ఆలోచన వచ్చిందన్నారు. ఇది ట్విట్టర్, ఫేస్బుక్ తరహాలో మరింత ఉన్నతమైన సేవలను ప్రజలకు అందిస్తుందని చెప్పారు. 15 జాతీయ భాషలు, 10 అంతర్జాతీయ భాషల్లో ఈ వాయిస్ హూట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తన తండ్రి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరని, అయితే తమిళంలో రాయడం సరిగా రాదని తెలిపారు. ఈ నిజం చెప్పడం వల్ల ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానం ఏ మాత్రం తగ్గదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చదవండి: ‘హరిహర వీరమల్లు’లో అకీరా?, తండ్రితో కలిసి పలు సీన్స్‌లో సందడి.. -
మామతో కలిసి ఒకేసారి అవార్డు అందుకోడం అద్భుతం: ధనుష్
తమిళ నటుడు ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం ‘అసురన్’లో ఆయన నటనకు గానూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు. అయితే అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్‌ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో ఇది వర్ణనాతీతమైన అనుభూతి అంటూ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ హీరో. ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మామ, స్టార్ రజనీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. దానికి.. ‘‘తలైవర్’ దాదాసాహెబ్ ఫాల్కే అందుకున్న అదే వేదికపై, అదే రోజు బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకోవడం వర్ణించడానికి మాటలు లేని అనుభూతి. ఇలాంటి గొప్ప బహుమతి ఇచ్చినందుకు జాతీయ అవార్డు జ్యూరీకి ధన్యవాదాలు. నాకు సపోర్టుగా నిలిచిన ప్రెస్, మీడియాకి కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఈ నటుడు ఫ్యాన్స్ కోసం అంటూ మెడల్ పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) To my fans ❤️❤️❤️❤️❤️ pic.twitter.com/USEEJLRGFR — Dhanush (@dhanushkraja) October 25, 2021 అంతేకాకుండా ధనుష్ పోస్ట్‌కంటే ముందు, ఆయన భార్య తన తండ్రి, భర్త ఉన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. రజనీకి కూతురిగా, ధనుష్‌కి భార్యగా ఉండడం గర్వంగా ఉందని తెలిపింది. అయితే ‘భోంస్లే’ చిత్రానికి గానూ మనోజ్ బాజ్‌పేయితో కలిసి ధనుష్ ఈ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) చదవండి: టాలీవుడ్‌పై ధనుష్ స్పెషల్ ఫోకస్.. మరో ఇద్దరితో చర్చలు! -
వైరల్: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌తో రజనీకాంత్.. ఫోటో వైరల్
Rajinikanth Meets Ravishankar: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఇద్దరు కుమార్తెలతో కలసి భేటీ అయ్యారు. రజనీకి ఆధ్యాత్మిక చింతన అధికం. ఆయన ప్రతి చిత్రం షూటింగ్ అనంతరం హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడపడం ఆనవాయితీ. ఇటీవల శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న అన్నాత్తై చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని అటుంచితే నటుడు రజనీకాంత్ తన ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ కలిసి ఆధ్యాత్మిక గురువుతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ ఆదివారం తన ట్విట్టర్లో ఈ మేరకు చిత్రాలు పోస్ట్ చేశారు. ఇప్పుడవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. Renowned actor @rajinikanth, @soundaryaarajni, @ash_r_dhanush met Gurudev @SriSri Ravi Shankar. https://t.co/Kuxpcesdc4 — Office Of Gurudev (@OfficeOfGurudev) August 29, 2021 చదవండి : విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు.. Karthikeya 2: హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది.. -
కోవిడ్ బాధితుల కోసం సౌందర్య రజనీకాంత్ రూ. కోటి విరాళం
కరోనా బాధితులకు చేయూతనిచ్చేందుకు కోలీవుడ్ నడుంబిగించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజరోజుకు లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో సమయానికి బాధితులకు వైద్య సదుపాయం, ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. ఇక బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే హీరో సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్‌లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ సైతం విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది. అనంతరం ఆమె భర్త విశాగన్ రాష్ట్రానికి కొత్త సీఎంగా ఎన్నికైన ఎంకే స్టాలిన్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక హీరో అజిత్ సైతం రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. -
రజనీ కుమార్తెకు చేదు అనుభవం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. తన కుమారుడు వేద్‌తో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో ఉన్న ఫొటోను ఆమె షేర్ చేశారు. ఈ క్రమంలో..‘తమిళనాడు ప్రజలు నీటి కోసం అలమటిస్తుంటే మీరు మాత్రం ఇలా ఈతకొలనులో నీటిని వృథా చేస్తారా’ అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. దీంతో సౌందర్య తన ఫొటోలను తొలగించారు. ఈ నేపథ్యంలో..‘ చిన్నతనం నుంచే పిల్లలకు శారీరక వ్యాయామం అవసరమనే విషయాన్ని చెప్పాలనే సదుద్దేశంతో ఆ ఫొటోను షేర్ చేశాను. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న నీటి కొరత నేపథ్యంలో నా ట్రావెల్ డైరీలోని ఈ ఫొటోను తొలగించాను’ అని సౌందర్య వివరణ ఇచ్చారు. కాగా ఈ విషయంలో రజనీ అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. ‘పాత ఫొటోతో మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వారిని పట్టించుకోకండి. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న వారికి తలైవా చేస్తున్న సహాయం వారికి కనిపించడం లేదు’ అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ఇక సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన కుమారుడు వేద్‌కు సంబంధించిన ఫొటోలు తరచుగా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. కాగా కొచ్చాడియాన్ మూవీతో డైరెక్టర్‌గా మారిన సౌందర్యా రజనీకాంత్ ఇటీవలె వ్యాపారవేత్త విశాగన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Removed the pictures shared in good spirit from my #TravelDiaries considering the sensitivity around the current #WaterScarcity we are facing 🙏🏻. The throwback pics were to emphasise the importance for physical activities for children from a young age only 🙂🙏🏻 #LetsSaveWater — soundarya rajnikanth (@soundaryaarajni) June 30, 2019 -
ఆయనను తాత అనకండి ప్లీజ్!!
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య ట్విటర్లో షేర్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అచ్చం రజనీకాంత్‌లాగే పోజ్ పెట్టి నిల్చున్న ఆమె కుమారుడు వేద్ ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కానీ ఆ ఫొటోకు సౌందర్య ఇచ్చిన క్యాప్షన్ మాత్రం మార్చాలని సూచిస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. పేట సినిమాలోని రజనీ స్టైల్‌ను అనుకరిస్తూ నిల్చున్న వేద్ ఫొటోను పోస్ట్ చేసిన సౌందర్య... ‘ తాతలాగే మనుమడు!!!’ అంటూ క్యాప్షన్ జతచేశారు. ఈ క్రమంలో.. ‘ప్లీజ్ మేడమ్ రజనీ సార్‌ను తాత అనకండి. తలైవా ఎప్పుడూ నిత్య యవ్వనుడిలాగానే కనిపిస్తారు. అయితే ఒక విషయం వేద్ కూడా ఆయనలాగే సూపర్‌గా ఉన్నాడు. భవిష్యత్తులో రజనీ స్థాయికి ఎదుగుతాడు. ఇందులో సందేహం లేదు’ అంటూ అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా రజనీ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా దర్బార్ సెట్లోనూ వేద్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక కొచ్చాడియాన్ మూవీతో డైరెక్టర్‌గా మారిన సౌందర్యా రజనీకాంత్ ఇటీవలె వ్యాపారవేత్త విశాగన్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. కాగా 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌందర్యకు ఆయన ద్వారా వేద్ కృష్ణ అనే కుమారుడు కలిగాడు. Well ... 🤷🏻♀️🙌🏻❤️😍 like thatha like grandson !!! #RajinikanthLineage #VedNailsThathaPose #ProudMother pic.twitter.com/wUZepY7GRx — soundarya rajnikanth (@soundaryaarajni) June 25, 2019 -
వేద్ వచ్చే వరకూ తాళి కట్టనన్నారు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య, విశాగన్ వనంగముడిల వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం తెలిసిందే. 2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సౌందర్య ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకోవడం, వీరికి వేద్ అనే ఓ కుమారుడు ఉన్న విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన రెండో వివాహ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను ఓ తమిళ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు సౌందర్య. ‘‘నా కుమారుడు వేద్‌కి ముందు విశాగన్ ఫొటో చూపించి.. ‘ఇదిగో మీ డాడీ’ అని చెప్పగానే సంబరపడిపోయాడు. తొలిసారే వేద్‌కి విశాగన్ నచ్చేశారు. వేద్ విషయంలో విశాగన్‌కి ఓపిక ఎక్కువ. పెళ్లి మండపంలో కూర్చున్నపుడు ముహూర్తం టైమ్‌కి వేద్ మండపానికి రాకపోవడంతో టెన్షన్ పడ్డాను. వేద్ వచ్చేవరకూ నేను తాళి కట్టనని విశాగన్ అన్నారు. అంతేకాదు.. పెళ్లికి ముందు ‘మీ అమ్మను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’ అని వేద్ దగ్గర విశాగన్ అనుమతి కూడా తీసుకున్నారు. దాని తాలూకు వీడియో కూడా నా వద్ద ఉంది. కానీ, అది వేద్‌కి 18 ఏళ్లు వచ్చేవరకూ ఎవరికీ చూపించను. విశాగన్ వద్ద ఉంటే వేద్ సురక్షితంగా ఉంటాడనే నమ్మకం నాకుంది. నాక్కావాల్సింది కూడా అదే’’ అని పేర్కొన్నారు సౌందర్యా రజనీకాంత్. -
చలిలో చిల్లింగ్
ఇలా పెళ్లయిందో లేదో అలా హనీమూన్ చెక్కేశారు సౌందర్యా రజనీకాంత్, విశాగన్. తమ విహారయాత్రలకు ఐస్‌ల్యాండ్ బెస్ట్ అనుకుని అక్కడకు వాలిపోయారు ఈ కొత్త దంపతులు. చల్ల చల్లని ప్రాంతంలో చిల్ అవుతూ ఆ మూమెంట్స్ తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
మనం ఒక్కటే కదా.. వారిద్దరి తర్వాత నువ్వే!
తలైవా రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యా రజనీకాంత్- వ్యాపారవేత్త విశాగన్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. కాగా వివాహానంతరం సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సంగీత్ నాటి ఫొటోలను ట్విటర్లో పోస్ట్ చేసిన సౌందర్య... ‘ మాటలకు అందని సంతోషం! నా జీవితంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు.. ప్రియమైన నాన్న.. నా ముద్దుల కుమారుడు.. ఇప్పుడు నువ్వే.. నా విశాగన్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. వీటితో పాటుగా.. # మిస్టర్ అండ్ మిసెస్, #మేముఒక్కటే అనే హ్యాష్ ట్యాగ్‌తో భర్త, కుమారుడు, తండ్రితో కలిసి ఉన్న మరిన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇక 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌందర్య రెండున్నరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరికి వేద్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Blessed & grateful beyond words !!!! The three most important men in my life ... my darling father ... my angel son ... and now you my Vishagan ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/v7Ra32oiYe — soundarya rajnikanth (@soundaryaarajni) February 10, 2019 #Mr&Mrs #MyFamily #WeAreOne #VedVishaganSoundarya ❤️🙏🏻🤗😇🙌🏻👪😀♾ pic.twitter.com/W3XbTc8Msf — soundarya rajnikanth (@soundaryaarajni) February 11, 2019 -
ఘనంగా రజనీ కుమార్తె వివాహం
-
వైభవంగా సౌందర్య-విశాగన్ వివాహం
సాక్షి, చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య వివాహం నటుడు వ్యాపారవేత్త విశాగన్‌తో సోమవారం ఘనంగా జరిగింది. మొదటి వివాహ రద్దు అనంతరం సౌందర్య ప్రేమించి పెద్దల సమ్మతితో విశాగన్‌ను వివాహం చేసుకుంది. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగిన వివాహంలో రాష్ట్ర సీఎం పళణిసామి, డిప్యూటి సీఎం పన్నీరు సెల్వంతోపాటు పలువురు మంత్రులు చివిధ పార్టీల నేతలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక రజనీకాంత్ ఇంటి వివాహం కావటంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు హాజరై అభినందనలు తెలిపారు. రజనీకాంత్ స్నేహితుడు నటుడు మోహన్‌బాబు కుటుంబంతో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగిన పెళ్లితంతులో సంగీత్, మెహింది అంటూ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సూపర్‌స్టార్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్టెప్పులేస్తున్న రజనీకాంత్
-
స్టెప్పులేస్తున్న సూపర్‌స్టార్!
ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ డైలాగ్‌లకు, స్టైల్‌కు, స్టెప్పులకు ఎంత ఫేమస్సో తెలిసిందే. తెరపై తలైవా స్టెప్పులేసినా, డైలాగ్‌లు చెప్పినా.. టాప్ లేచి పోవాల్సిందే. రజినీ బయట ఫంక్షన్లో డ్యాన్సులు వేయడం చాలా అరుదు. అలాంటిది రజనీ డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లికి వచ్చిన అతిథులకు సీడ్ బాల్స్‌ను రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చి అందర్నీ ఆశ్యర్యపరిచారు. సౌందర్య పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం రజనీ పోయస్ గార్డెన్‌లోని ఇంట్లో మెహిందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో బంధుమిత్రులు ఆడి పాడి ఎంజాయ్ చేశారు. వారితో పాటు రజనీకాంత్ ఒకరిగా స్టెప్స్ వేశారు. ముత్తు చిత్రంలోని ఒరువన్ ఒరువన్ మొదలాలీ అనే పాటకు రజనీకాంత్ చిందులతో సందడి చేస్తుంటే అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోయారు. దటీజ్ రజనీకాంత్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రజనీ ప్రస్తుతం మురుగుదాస్‌తో ఓ చిత్రం చేసేందుకు రెడీ అయ్యారు. -
రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యా రజనీ కాంత్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. శుక్రవారం చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో సన్నిహితులు, బంధువులకు గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు రజనీ కుటుంబ సభ్యులు. ఈ రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌గా సీడ్ బాల్‌ను అందించడం విశేషం. ఫార్మా బిజినెస్‌మేన్ విశాగన్ వనంగాముడి, సౌందర్య రజనీకాంత్ వివాహం ఆదివారం జరగనుంది. సౌందర్యకు ఇది రెండో వివాహం. ఆల్రెడీ అశ్విన్ రామ్‌కుమార్ అనే పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్న వీళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నారు. -
సౌందర్యా రజనీకాంత్ వివాహ విందు
చెన్నై: రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ వివాహ విందు శుక్రవారం ఘనంగా జరిగింది. విశాగన్‌ను ఫిబ్రవరి 11న సౌందర్య వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రజనీకాంత్ దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సినీ, రాజకీయ ప్రముఖులు కనబడలేదు. సౌందర్య, విశాగన్.. ఇద్దరికీ ఇది రెండో వివాహం. గతంలో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నాడు. విశాగన్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. -
రజనీకాంత్ కూతురు సౌందర్య వెడ్డింగ్ రిసెప్షన్
-
‘మరో వారంలో పెళ్లికూతుర్ని కాబోతున్నాను’
రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ మరో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని సౌందర్యా రజనీకాంత్ స్వయంగా నిర్ధారించారు. ‘‘ఇంకోవారంలో పెళ్ళి కూతురిని కాబోతున్నాను’’ అంటూ పెళ్లి గెటప్‌లో ఉన్న ఫోటోను ట్వీటర్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు తన కుమారుడి పేరు, కాబోయే భర్త పేరుతో తన పేరుని జతచేసి క్యాప్షన్‌గా పెట్టడం విశేషం. గతంలో పారిశ్రామికవేత్త అశ్విన్ కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2016లో విడాకులు తీసుకున్నారు. వాళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం విశాగన్‌ను ఫిబ్రవరి 11న వివాహం చేసుకోనున్నారు. విశాగన్ కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. 9 నుంచి 11 వరకూ పెళ్లి సంబరాలు జరుగుతాయట. -
నిర్మాతగా సౌందర్యా రజనీకాంత్
కల్కి కృష్ణమూర్తి రచించిన తమిళ చారిత్రాత్మక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించాలని చాలామంది దర్శక–నిర్మాతలు కలలు కంటుంటారు. వారిలో దర్శకుడు మణిరత్నం పేరు కూడా వినిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా తీసే పనిలోనే ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ‘కొచ్చాడియన్’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఎస్. సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తారు. ‘‘ఈ నవలకు దృశ్యరూపం ఇవ్వాలని చదివినప్పుడే అనిపించింది’’ అని పేర్కొన్నారు సౌందర్య. -
‘పెళ్లికి బందోబస్తు కల్పించండి’
మా ఇంట పెళ్లికి పోలీస్‌బందోబస్తు కల్పించాలని నటుడు రజనీకాంత్ కుటుంబం పోలీసులకు వినతి పత్రాన్ని అందించారు. రజనీ రెండవ కూతురు సౌందర్య రెండో పెళ్లికు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈమెకు నటుడు, వ్యాపారవేత్త విశాఖన్‌కు మధ్య ప్రేమ పెళ్లికి దారి తీసింది. విశాఖన్ ప్రముఖ వ్యాపారవేత్త వణంగాముడి కుమారుడు. ఈయన మొదటి భార్య నుంచి విడాకులు పొందారు. వంజగ ఉలగం చిత్రంలో నటించారు. కాగా విశాఖన్, సౌందర్యల ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 10, 11 తేదీల్లో పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి వద్ద వీరి వివాహ, రిసెప్షన్ జరుగనున్నాయి. దీంతో శుక్రవారం రజనీకాంత్ సతీమణి తేనాంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కూతురు పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని, పోలీస్ బందోబస్తు కల్పించాలని వినతి పత్రాన్ని అందించారు. -
సౌందర్య, విశాఖన్ల పెళ్లి ఫిబ్రవరి 11న..
తమిళనాడు, పెరంబూరు: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటి పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి వాతావరణంతో స్థానిక పోయెస్‌గార్డెన్‌లోని తలైవా ఇల్లు కళకళలాడుతోంది. రజనీకాంత్ రెండో కూతురు, దర్శకురాలు సౌందర్య రెండో పెళ్లికి ముస్తాబవుతోంది. ఈమె రజనీకాంత్ హీరోగా కోచ్చడైయాన్ వంటి త్రీడీ యానిమేషన్ చిత్రానికి, ధనుష్ హీరోగా నటించిన వీఐపీ–2 చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈమె 2000 సంవత్సరంలో అశ్విన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. ఆ తరువాత మనస్పర్థల కారణంగా దంపతులు విడిపోయి విడాకులు పొందారు. తరువాత అశ్విన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రెండో పెళ్లికి సిద్ధమైంది. ఈమె విశాఖన్ అనే యువ వ్యాపారవేత్తను పెళ్లాడనుంది. విశాఖన్ ప్రముఖ వ్యాపారవేత్త వణంగాముడి కొడుకు అన్నది గమనార్హం. సౌందర్య, విశాఖన్ల పెళ్లి ఫిబ్రవరి 11న చెన్నైలోని ఒక కల్యాణమండపంలో బ్రహ్మాండంగా జరగనుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. అభిమానులకు అభినందనలు: నటుడు రజనీకాంత్ బుధవారం తన అభిమానులను ప్రత్యక్షంగా కలిశారు. రజనీ ప్రజా సంఘం ద్వారా డెల్టా జిల్లాల్లోని గజ తుపాను బాధితులను ఆదుకునే విధంగా పలు రకాలుగా సహాయ కార్యక్రమాలను నిర్వహించిన సంఘ కార్యకర్తలను రజనీకాంత్ తన ఇంటికి పిలిపించి ప్రశంసించారు. -
పెళ్లికి బాజా మోగింది
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంట్లో పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఆయన కుమార్తె సౌందర్య పెళ్లికి బాజా మోగింది. సినీ నటుడు, వ్యాపారవేత్త అయిన విశాగన్ వనంగాముడిని ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఫిబ్రవరిలో ఈ పెళ్లి వేడుక జరగనుంది. గతేడాది ఇరు కుటుంబీకుల సమక్షంలో సౌందర్య, విశాగన్‌ల నిశ్చితార్థం జరిగిందట. ఎంగేజ్మెంట్ సింపుల్‌గానే జరిపారని టాక్. పెళ్లిని కూడా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరపాలనుకుంటున్నారట. అయితే రిసెప్షన్ మాత్రం ఘనంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారని భోగట్టా. మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో కలిపి మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయట. కాగా అశ్విన్ రామ్‌కుమార్ అనే వ్యాపారవేత్తను 2010లో సౌందర్య వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. -
ఫిబ్రవరి 11న రజనీకాంత్ కూతురి పెళ్లి
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం ఫిబ్రవరి 11న జరగనుంది. ప్రముఖ వ్యాపార వేత్త, నటుడు విశాగన్ వనంగమూడిని సౌందర్య వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే రజనీ కుంటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. సౌందర్య, విశాగన్ ల నిశ్చితార్థం గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. వివాహం మాత్రం చెన్నైలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు. లతా రజనీకాంత్ ఇచ్చే పార్టీతో పెళ్లి వేడుకలు ప్రారంభకానున్నాయి. సౌందర్య అక్క, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య స్వయంగా ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. గతంలో అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకున్న సౌందర్య 2017లో వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. -
నల్ల తంబి
‘ఎందుకమ్మా నన్నింత నల్లగా కన్నావు’ అంటే ‘నిన్ను ఎర్రగా కని ఉంటే త్వరగా మాసిపోయేవాడివి కదా’ అంటుంది అమ్మ.‘ఎవరిని పట్టుకుని నలుపు అంటున్నావ్.. ఇది గ్యారంటీ కలర్’ అంటాడు శివాజీ వాళ్ల మామయ్య. రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఈ నల్ల ఆ నల్ల కాదు. తమిళంలో నల్ల అంటే మంచి అని. డిసెంబర్ 12 రజనీకాంత్ జన్మదినం సందర్భంగా ఆయన అన్నయ్య సత్యనారాయణ రావ్ ఈ తంబి గురించి ‘సాక్షి’తో పంచుకున్న నల్ల సంగతులు. ►రజనీకాంత్‌గారి బర్త్‌డే (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూ... సత్యనారాయణ రావ్: చాలా సంతోషం. ►ఇప్పుడంటే రజనీగారి పుట్టిన రోజులు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ అయితే ఓ పండుగలా చేస్తున్నారు. చిన్నప్పుడు ఆయన బర్త్‌డేలు ఎలా జరిగేవి? ఇంటివరకే పరిమితం అయ్యేది. మా అమ్మగారు ఉన్నంతవరకూ సింపుల్‌గా చేసేవారు. రజనీకి తొమ్మిదేళ్ల వయసప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. అమ్మ చనిపోయిన ఏడాదికి నాకు పెళ్లయింది. అప్పటినుంచి మా ఆవిడే రజనీ బర్త్‌డేలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా సింపుల్‌గానే. పాయసం, పూరి, వడ.. ఆయన బర్త్‌డే అంటే ఈ మూడూ చేసేది. మా దగ్గర ఆయన ఉన్నంతవరకూ ఇదే ఆనవాయితీ. ► జనరల్‌గా తమ్ముడి గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ అంటుంటారు. మీరేమో ‘ఆయన’ అంటున్నారు. స్టార్ కాబట్టి అలా అనాల్సి వచ్చిందా? అదేం కాదు. మాకు ‘ఏరా.. పోరా’ అని పిలుచుకునే అలవాటు చిన్నప్పుడే లేదు. ‘ఎన్నప్పా.. వాప్పా.. పోప్పా’ (ఏమప్పా.. రాప్పా.. పోప్పా) అంటుంటాను. తను కూడా నన్ను అంతే. పిలుపులు గౌరవంగా ఉన్నప్పటికీ అవేవీ మా అనుబంధాన్ని దూరంగా ఉంచినట్లు కాదు. ►రజనీగారికి తోడబుట్టినవాళ్లు ఎంతమంది? ఒక అక్క, తన తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, రజనీ నాలుగో ఆయన. మా అక్కకి పదహారేళ్ల వయసులోనే పెళ్లయింది. తమ్ముడు చనిపోయాడు. రజనీ, నేను కలిసి పెరిగింది ఎక్కువ. ► మీ ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్లేవారా? కథలు చెప్పుకునేవారా? బోల్డన్ని కథలు చెప్పుకునేవాళ్లం. ముఖ్యంగా రాజుల కథలు చదివేవాళ్లం కూడా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కథ, మహాభారతం చెప్పుకునేవాళ్లం. రజనీకి శివాజీ కథ అంటే ఇష్టం. ఇక సినిమాల గురించి చెప్పాలంటే.. రజనీ ఎక్కువగా తమిళ సినిమాలు, నేను కన్నడ సినిమాలు చూసేవాళ్లం. అందుకని దాదాపు విడివిడిగానే వెళ్లేవాళ్లం. రజనీకి ఎంజీఆర్, శివాజీ గణేశన్గార్ల సినిమాలంటే చాలా ఇష్టం. ► సినిమాల్లో శివాజీ, హిస్టరీలో ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం అన్న మాట. రజనీగారి రియల్ నేమ్ కూడా శివాజీరావ్ గైక్వాడ్ కదా? అమ్మానాన్న పెట్టిన పేరు అదే. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ కె. బాలచందర్‌గారు పేరు మార్చా రు. ఆ పేరే స్థిరపడిపోయింది. ► చిన్న రజనీ అల్లరిపిల్లవాడేనా? (నవ్వేస్తూ) రుంబ కురుంబు (బాగా అల్లరి). అయితే ఫ్రెండ్స్‌తో బాగా గొడవలు పడటం లాంటివి ఉండేవి కాదు. ఎప్పుడైనా చిన్న చిన్న తగాదాలు ఆడటం, ఆ తర్వాత వెంటనే కలిసిపోవడం. రజనీకి ఫుట్‌బాల్, కబడ్డీ అంటే ఇష్టం. ► మరి ఆటల్లో తొండి చేయడం, ఓడిపోయినప్పుడు ఫీలవ్వడం లాంటివి? రజనీకి ఓటమి అనేది లేదు. ఎప్పుడూ విజయమే. ఆటల్లో ఫస్ట్. చదువులో కూడా బెస్టే. చిన్నప్పుడే మంచి భావాలు ఉండేవి. ఏదైనా అన్యాయం అనిపిస్తే వెంటనే ఎదురు తిరిగి అడగడం లాంటివి. ► ‘శివాజీ’ సినిమాలో నల్లగా ఉన్న రజనీ పాత్ర తెల్లబడటానికి ట్రై చేస్తుంది. ‘బాబా’ సినిమాలో ‘గ్యారంటీ కలర్’ అని ఓ పాటలో వస్తుంది. రజనీగారు ‘నల్ల పయ్యనే కదా’? (నవ్వేస్తూ) అవును. నల్ల పయ్యన్ (మంచి అబ్బాయి). రుంబ రుంబ నల్ల పయ్యన్ (చాలా చాలా మంచి అబ్బాయి). ► మీ అమ్మగారు చనిపోయాక రజనీగారు, మీ నాన్నగారు మీ కుటుంబంతోనే ఉండేవారా? తమ్ముడి స్కూల్ ఫీజులు మీరేమైనా కట్టేవారా? నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. 55 ఏళ్లకు రిటైర్ అయ్యారు. 30 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత 50, 100. 1985లో నాన్న చనిపోయారు. అప్పటికి ఆయనకు 150 రూపాయలు వచ్చేది. నాతోనే ఉండేవారు. రజనీ స్కూల్ ఫీజులు కట్టేవాడిని. నాకు తనని బాగా చదివించాలని ఉండేది. డాక్టర్ చేయాలని కోరిక. బాగా చదువుకుంటే సీట్ వస్తుంది.. డాక్టర్ అవ్వొచ్చు అనేవాడిని. అయితే డ్రామాల్లో నటించడం మొదలుపెట్టాక రజనీ మైండ్ డైవర్ట్ అయింది. ► మరి ఎంతదాకా చదువుకున్నారు? ప్లస్ టు వరకే. చిన్నప్పుడు రజనీని రామకృష్ణ మిషన్ వాళ్లు స్థాపించిన రామకృష్ణ మఠంలో చేర్పించాను. స్కూల్ అయిపోగానే మఠంకి వెళ్లేవాళ్లం. నేను ప్రార్థనలు చేసేవాడిని. రజనీ అయితే వేద మంత్రాలు నేర్చుకుని, అక్కడ సేవలు కూడా చేయడం జరిగింది. ఆ మఠంలో ఏడాదికి ఒకసారి డ్రామాలు వేసేవారు. ఆ డ్రామాల్లో ఉత్సాహంగా పాల్గొన్న రజనీకి అప్పుడే యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ మొదలైంది. రామకృష్ణ మఠంలో మాత్రమే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లోనూ నటించడం స్టార్ట్ అయింది. దాంతో చదువు మీద ఆసక్తి పోయింది. ► మీరు మందలించలేదా? అలా ఏం లేదు కానీ కాలేజీకి వెళ్లకపోవడంతో ఖాళీగా ఉండటంవల్ల మాకు తెలిసిన ఆయన రజనీని కండక్టర్‌గా చేర్పించారు. ఆ జాబ్‌లో జాయిన్ అయినా ధ్యాస అంతా నాటకాల మీదే. ఫ్రెండ్స్‌తో కలిసి నాటకాలు వేయడం అలవాటైంది. అప్పుడు తన స్నేహితులు ‘నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అవకాశాలు వస్తాయి’ అన్నారు. దాంతో తనకి కూడా ఆసక్తి పెరిగి, మదరాసు వెళ్లడం జరిగింది. ► కండక్టర్ జాబ్ రిజైన్ చేసి, మదరాసు వెళతానంటే మీరేమన్నారు? నెల ఖర్చులు మీరే పంపించేవారా? కండక్టర్‌గా చేసింది రెండేళ్లే. రజనీ ఏం చేస్తానంటే దానికి ఓకే అనేవాడిని. మదరాసు వెళతానంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టాను. ఖర్చుల నిమిత్తం నెలకి రూ.500 పంపించేవాడిని. తన స్నేహితులు కూడా కొంచెం పంపించేవాళ్లు. రజనీకి పట్టుదల ఎక్కువ. పైగా ఇష్టంగా ఎంచుకున్నది కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో క్లాసులకు బాగా వెళ్లి, చివరికి బాలచందర్‌గారి దృష్టిలో పడటం జరిగింది. ► మీ తమ్ముడు సూపర్‌స్టార్ స్థాయికి చేరుకుంటారని ఊహించారా? చిన్నప్పుడు ఆటల్లోనే ఓటమి లేదని చెప్పాను కదా. పెద్ద స్థాయికి వెళ్లడం ఖాయం అనుకున్నాను. సినిమా అవకాశాలు రావడం, బిజీ అవ్వడం.. అంతా సాఫీగా జరిగినందుకు ఆనందంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి కారణం. ►రజనీగారి స్టైల్ ఆయన్ను మాస్‌కి దగ్గర చేసింది. ఆ నడక వేగం, మాట తీరు ఆకట్టుకున్నాయి. చిన్నప్పుడూ ఇంతేనా? అసలు స్లోగా నడవడం తనకు అలవాటు లేదు. చిన్నప్పుడూ అంతే. ఫాస్ట్‌గా నడవడం, ఫాస్ట్‌గా మాట్లాడటం. స్టైల్ అనేది తను స్క్రీన్ కోసం అలవాటు చేసుకున్నది కాదు. నేచురల్‌గా వచ్చింది. ► మీ కుటుంబం గురించి? మీకెంత మంది పిల్లలు? నా భార్య మూడు నెలల క్రితం చనిపోయింది. నాకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. కూతుళ్లిద్దరికీ పెళ్లయింది. కొడుకులు కూడా బాగా సెటిలయ్యారు. ► మీ పిల్లలు సెటిలవ్వడానికి వాళ్ల చిన్నాన్న సహాయం ఎంతవరకూ ఉంది? నా ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లూ తన చేతుల మీదగానే జరిగాయి. కొడుకులను నేను చదివించుకున్నాను. మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ నా తమ్ముడు సమకూర్చడంతో హ్యాపీగా ఉన్నాం. నేను బెంగళూరు కార్పొరేషన్లో సూపర్వైజర్గా చేసేవాడిని. రిటైర్ అయి పదిహేనేళ్లకుపైనే అయింది. పెన్షన్ వస్తోంది. ► రజనీగారికి పెళ్లయ్యాక ఆయన భార్య లతగారు, మీ ఆవిడ ఎలా ఉండేవారు? మీ కుటుంబాన్ని మీ తమ్ముడు చూసే విషయంలో లతగారికి ఏమైనా ఆక్షేపణ ఉండేదా? అలా ఏం లేదు. మా మరదలు, మా ఆవిడ ఇద్దరూ బాగుండేవాళ్లు. తమ్ముడు మదరాసులో సెటిలైనా నా కుటుంబంతో నేను బెంగళూరులోనే ఉండిపోయాను. మంచీ చెడుకి కలుసుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. మా ఇంటి ఆడవాళ్ల వల్ల మాకెలాంటి మనస్పర్థలు రాలేదు. ► చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచిన వదిన మూడు నెలల క్రితం చనిపోయినప్పుడు రజనీగారు వచ్చారా? వచ్చి, తన వదిన అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి చేయడం జరిగింది. ఇలా చెప్పొచ్చో లేదో కానీ అలాంటి తమ్ముడు దొరకడం నా పుణ్యం. ► మీ ‘స్టార్ బ్రదర్’కి మీరు ఫోన్ చేయాలంటే.. అందరిలా మేనేజర్ ద్వారానా? డైరెక్ట్‌గా చేస్తారా? లేదు. డైరెక్ట్‌గానే చేస్తాను. వీలున్నప్పుడల్లా మాట్లాడుకుంటాం. ఆరోగ్యం బాగుందా? పిల్లలందరూ బాగున్నారా? అని రజనీ ఫోన్ చేస్తే, తన క్షేమసమాచారాలు తెలుసుకోవడం కోసం నేను ఫోన్ చేస్తుంటాను. ► మీ తమ్ముడు పెద్ద స్టార్ కాబట్టి ఆయనతో సినిమా నిర్మించి క్యాష్ చేసుకోవాలని మీరు అనుకోలేదా? రజనీగారు మీకా సలహా ఇవ్వలేదా? నాకు జాబ్ ఉంది కాబట్టి నేనా విషయం గురించి ఆలోచించలేదు. తమ్ముడు కూడా ఎప్పుడూ నాతో ఆ మాట అనలేదు. అయినా తనతో ఎంతోమంది నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఒక సినిమా మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మా తమ్ముడి సినిమా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి నాకు ఆనందమే. ► మీ పిల్లల్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకోలేదా? నా రెండో కొడుకు పాండురంగకి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లోకి రావాలని ఫుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరాడు. కానీ మా తమ్ముడికి అంతగా ఇష్టం లేదు. సినిమాల్లో ఏదీ శాశ్వతం కాదు.. జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుందనడంతో నాకూ అదే మంచిదనిపించింది. ఎందుకంటే ఇక్కడ పేరు రావాలంటే అదృష్టం ఉండాలి. కొంతమంది పేరు తెచ్చుకోగలిగారు. కొంతమంది ఏమీ లేకుండా పోయారు కూడా. అందుకే తమ్ముడి మాటే కరెక్ట్ అనిపించింది. దాంతో మా పాండురంగ కూడా సినిమా ఆలోచన వదులుకున్నాడు. ► రజనీగారి పిల్లలు ఐశ్వర్య, సౌందర్య మీతో ఎలా ఉంటారు? మీ పిల్లలు ఆయనతో? పెదనాన్న అని నాతో బాగుంటారు. రజనీ పిల్లలు బంగారాలు. నా పిల్లలు కూడా వాళ్ల చిన్నాన్నతో బాగుంటారు. ► మీ అక్కగారికి ఎంతమంది పిల్లలు? వాళ్లను కూడా రజనీగారు బాగా చూసుకుంటారా? అక్కకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇప్పుడు అక్క లేదు. చనిపోయింది. ఆమె పిల్లలను కూడా రజనీ బాగానే చూసుకోవడంతో వాళ్ల జీవితాలూ బాగున్నాయి. ► రజనీగారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాబాజీ అంటూ హిమాలయాలకు వెళ్లడం లాంటివి చేసినప్పుడు కెరీర్ గురించి మీరేమైనా కంగారుపడ్డారా? లేదు. ఎందుకంటే చిన్నప్పుడే తనలో ఆధ్యాత్మికం ఉంది. రామకృష్ణ మఠం ప్రభావం తన మీద ఉంది. ఆధ్యాత్మిక బాటలో వెళుతూనే కెరీర్‌ని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం తనకు తెలుసు. ఏదో వైరాగ్యం వచ్చినట్లు కుటుంబాన్ని, వృత్తిని వదిలేస్తే అప్పుడు కంగారు పడేవాడిని. ► చిన్నప్పుడు కూడా ఆయనలో ఆధ్యాత్మిక భావాలు ఉండేవన్నారు. గుడికి వెళ్లడంలాంటివి చేసేవారా? మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ శివుడి గుడి ఉండేది. ఆ పక్కనే రజనీ చదువుకున్న స్కూల్ ఉంది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు శివుడి గుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కండక్టర్ అయిన తర్వాత, హీరో అయ్యాక కూడా రజనీ ఆ గుడిని దర్శించుకున్న సందర్భాలు ఎక్కువే. ► ఆయనతో పాటు హిమాలయాలు రమ్మని మిమ్మల్నెప్పుడూ అడగలేదా? చాలాసార్లు పిలిస్తే నేనే వెళ్లలేదు. కాలి నడకన 40, 50 కిలోమీటర్లు కొండల్లో వెళ్లాలి. నాక్కొంచెం మోకాళ్ల నొప్పి. అందుకే నా వల్ల కాదన్నాను. ► మీకూ, ఆయనకు వయసు వ్యత్యాసం ఎంత? దాదాపు పదేళ్లు. నాకు 77 ఏళ్లు. ► రజనీగారి షూటింగ్ లొకేషన్‌కి మీరు వెళతారా? లేదు. రజనీకి పద్మ విభూషణ్ అవార్డు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. అప్పుడు ‘2.ఓ’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. అందుకని ఆ లొకేషన్‌కి వెళ్లాను. అప్పుడు రజనీకి ఆరోగ్యం అంత బాగాలేదు. ‘2.ఓ’ అంత బాగా వచ్చిందంటే దానికి కారణం డైరెక్టర్ శంకర్. తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఓపికగా చేయించుకున్నారు. ► మీ తమ్ముడి ఆరోగ్యం విషయంలో మీరు కలవరపడుతుంటారా? అది ఉంటుంది. అప్పుడప్పుడూ హెల్త్ వైజ్‌గా డౌన్ అయితే ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటాను.. తన ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్లు అనారోగ్యంపాలైతే బాధగా ఉంటుంది. నాకు మోకాలి నొప్పి ఉన్నా ఆరోగ్యపరంగా వేరే సమస్యలు లేవు. అందుకే రజనీ అస్వస్థతకు గురైతే బాధపడిపోతుంటాను. అయినా ఆ మహావతార్ బాబాజీ అనుగ్రహం తన మీద ఉంది. అభిమానుల ప్రార్థనలు ఉంటాయి. అవే చల్లగా కాపాడతాయి. ► రజనీగారి సినిమాలు చూసి బాగుంటే బాగుందని లేదంటే లేదని నిక్కచ్చిగా చెబుతారా? నా తమ్ముడి సినిమా రిలీజ్ అవ్వగానే సాధ్యమైనంతవరకూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా. బాగుంటే బాగుందని చెబుతాను. బాగా లేకపోతే ఆ విషయం కూడా చెప్పేస్తాను. ‘కాలా’ సినిమాని సరిగ్గా తీయలేదని చెప్పాను. హీరో క్యారెక్టర్‌కి, విలన్ క్యారెక్టర్‌కి మధ్య ఇంకా ఏదో ఉండాలనిపించిందని అన్నాను. ► ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనవి? ఐదు, పది సినిమాలని లెక్కేసి చెప్పలేను. తమ్ముడు యాక్ట్ చేసే సినిమాలన్నీ ఇష్టమే. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ► ‘ఈ ఫంక్షన్ నాకు స్పెషల్. ఎందుకంటే మా అన్నయ్య వచ్చారు’ అని ‘2.ఓ’ ఫంక్షన్లో రజనీగారు అన్నారు.. ఆయన ఎందుకలా అన్నారు? నేను సాధారణంగా షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్లనని చెప్పాను కదా. సినిమా ఫంక్షన్స్‌కి కూడా వెళ్లను. చెన్నైలో జరిగిన ‘2.ఓ’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కి నన్ను రమ్మని రజనీ పిలిస్తే వెళ్లాను. ఇంటి ఫంక్షన్స్‌కి తప్ప సినిమా ఫంక్షన్స్‌కి వెళ్లను కాబట్టి, తనకు ఆనందంగా ఉండి ఉంటుంది. ►ఫైనల్లీ.. రజనీగారికి రాజకీయాలు సూట్ అవుతాయంటారా? ఆ విషయం గురించి నేను చెప్పేకన్నా ఆయన చెబితేనే బాగుంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఇప్పుడు రాజకీయ నాయకుల్లా మాత్రం పరిపాలించే అవకాశం లేదు. తన స్టైల్లో ఉంటుంది. – డి.జి. భవాని -
సౌందర్యారజనీకాంత్‌కు రెండో పెళ్లి?
చెన్నై, పెరంబూరు: నటుడు రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రెండో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తండ్రి రజనీకాంత్ హీరోగా కోచ్చాడయాన్ అనే యూనిమేషన్ చిత్రం, అక్క భర్త ధనుష్ హీరోగా వీఐపీ–2 చిత్రాలకు దర్శకత్వం వహించిన సౌందర్యకు ఇంతకుముందే అశ్విన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి వేద్ అనే కొడుకు ఉన్నాడు. ఈ స్థితిలో మనస్పర్థల కారణంగా అశ్విన్, సౌందర్య విడిపోయారు. గత కొద్ది కాలంగా ఒంటరిగానే నివశిస్తున్న సౌందర్య ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. ఈమె విశాఖన్ అనే వ్యక్తిని పెళ్లాడబోతున్నారట. ఎంబీఏ పట్టభద్రుడైన విశాఖన్ ప్రముఖ వ్వాపారవేత్త, నటుడు కూడా. ఈయనకు వివాహం అయ్యి భార్య నుంచి విడిపోయారన్నది గమనార్హం. మందుల కంపెనీ అధినేత అయిన విశాఖన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త వణంగాముడి కొడుకు. వీరి వ్యాపారం రూ.600 కోట్ల టర్నవర్ అని తెలిసింది. విశాఖన్, సౌందర్యల వివాహ నిశ్చితార్థం ఇటీవలే పెద్దల సమక్షంలో జరిగినట్లూ, జనవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం గురించి రజనీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నది గమనార్హం. -
తలైవర్ తయార్!
అంతా సిద్ధం చేశారు. కెమెరా.. యాక్షన్.. రోలింగ్ అనగానే సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగటమే బ్యాలెన్స్. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. డెహ్రాడూన్‌లో జరగనున్న ఈ సినిమా షూట్ కోసం రజనీ బుధవారం చెన్నై నుంచి ప్రయాణం అయ్యారు. ఈ విషయాన్ని రజనీ తనయ సౌందర్యా రజనీకాంత్ పేర్కొన్నారు. ‘‘నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం తలైవర్ (నాయకుడు) తయారయ్యారు. మల్టీపుల్ రోల్స్’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నా రామె. దీంతో ఈ సినిమాలో రజనీ మల్టీపుల్ రోల్స్ చేయనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సౌందర్య– ‘‘మల్టీపుల్ రోల్స్ సినిమాలో కాదు. లైఫ్‌లో. ఈ మూవీ గురించి సరైన టైమ్‌లో సుబ్బరాజే చెబుతారు’’ అన్నారు. ఈ సంగతి కాస్త పక్కనపెడితే.. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ నటించిన ‘కాలా’ సినిమా ఈ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే -
రజనీ భార్యకు షాక్
రజనీకాంత్ హీరోగా రూపొందిన యానిమేషన్ మూవీ ‘కొచ్చాడయాన్’ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ మీడియా వన్‌కు యాడ్ బ్యూరో కంపెనీ పది కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ సమయంలో రజనీ భార్య లతా రజనీకాంత్ హామీ సంతకం చేశారు. ఈ రుణానికి సంబంధించి కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించిన చిత్ర యూనిట్ మిగతా మొత్తాన్ని ఇంతవరకు చెల్లించలేదు. ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై కొచ్చాడయాన్ టీం నుంచి స్పందన రాకపోవటంతో యాడ్ బ్యూరో కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం షూరిటీగా ఉన్న లతా రజనీకాంత్‌ను పన్నెండు వారాల్లోగా 6.2 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ మూవీ కొచ్చాడయాన్లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, సీనియర్ హీరోయిన్ శోభనలు హీరోయిన్లుగా కనిపించారు. -
బాషా... త్రీజీ బాషా... నేనూ ఆటోవాణ్ణే!
‘బాషా’... రజనీకాంత్! మరి, ‘త్రీజీ బాషా’ ఎవరు? ‘త్రీజీ’ అంటే... ‘థర్డ్ జనరేషన్’. ఇన్సెట్ ఫొటోలో... బుల్లి ఆటోలో ఏముందోనని తీక్షణంగా చూస్తున్న బుల్లి బాబే త్రీజీ బాషా! రజనీకాంత్ మనవడు. పేరు... వేద్. రజనీ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్ కుమారుడు. ఈ బుడతడు బాషా ఏంటనుకుంటున్నారా? ‘బాషా’లో రజనీకాంత్ ఏం చేశారు? కొన్ని సన్నివేశాల్లో ఆటో నడుపుతూ కనిపించారు. ఇప్పుడు వేద్ కూడా ఆటో నడుపుతున్నారు. అయితే... వేద్ది బుల్లి ఆటో! బుల్లి బాబు కదా మరి! ‘నాన్ ఆటో కారన్.. ఆటో కారన్ (‘బాషా’లో నేను ఆటోవాణ్ణి... ఆటోవాణ్ణి పాట గుర్తుండే ఉంటుంది)! జస్ట్ లైక్ తాత’’ అని సౌందర్యా రజనీకాంత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆటోలతో ఆడు కుంటున్న వేద్ పెదై్దన తర్వాత తాతయ్యలా హీరో అయ్యి, సినిమాల్లో ఆటో నడుపుతాడేమో? ‘బాషా... త్రీజీ బాషా... నేనూ ఆటోవాణ్ణే’ అని డైలాగులు చెబుతాడేమో! పుట్టినరోజున పార్టీ అనౌన్స్మెంట్? డిసెంబర్ 12... రజనీకాంత్ పుట్టినరోజు. అదే రోజున రజనీ తన రాజకీయ ప్రణాళికలు, స్థాపించబోయే పార్టీ, ఇతర అంశాల గురించి అభిమానుల సమక్షంలో ప్రకటిస్తారని చెన్నైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా రజనీ పుట్టినరోజుకి ముందు ఇటువంటి ప్రచారాలు రావడం సాధారణమే. అయితే... ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ శూన్యత నెలకొన్న దృష్ట్యా ఈ ప్రచారానికి ప్రాముఖ్యత లభిస్తోంది. రజనీ ఏమంటారో మరి? వెయిట్ అండ్ సీ!! -
సౌందర్య రజనీకాంత్‌కు విడాకులు మంజూరు
చెన్నై : రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌కు చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టు మంగళవారం విడాకులు మంజూరుచేస్తూ తీర్పు వెల్లడించింది. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్యకు 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. నాలుగేళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే జరిగింది. 2015లో సౌందర్య, అశ్విన్ రామ్‌కుమార్ దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు వేద్ అని పేరు పెట్టారు. ఆ బాబు తొలి పుట్టిన వేడుక సందర్భంలోనే అశ్విన్‌రామ్‌కుమార్, సౌందర్య మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరిగింది. ఆ తరువాత భర్తకు దూరంగా ఉంటున్న సౌందర్య సంసార జీవితాన్ని సరిదిద్దడానికి రజనీకాంత్ కుటుంబ హితులు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. దీంతో గత డిసెంబర్ నెలలో సౌందర్య, అశ్విన్ రామ్‌కుమార్‌లిద్దరూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులకు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ కేసును నాయ్యమూర్తి మరియా విచారిస్తున్నారు. గతనెల 26న సౌందర్య, అశ్విన్ రామ్‌కుమార్ కోర్టుకు హాజరై వివాహ రద్దుపై వివరణ ఇచ్చారు. అనంతరం జూలై 4వ తేదీన తుది తీర్పును ప్రకటిస్తానని న్యాయమూర్తి తెలిపారు. కాగా మంగళవారం సౌందర్య రజనీకాంత్‌కు, అశ్విన్ రామ్‌కుమార్‌కు విడాకులను మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే ఈ విడాకుల వ్యవహారంపై సౌందర్యతో పాటు అశ్విన్ పెదవి విప్పలేదు. ఈ సందర్భంగా సౌందర్య తరఫు న్యాయవాది మాట్లాడుతూ దంపతుల మధ్య తలెత్తిన విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతోనే ఇక కలిసి జీవించేలేమని నిర్ణయానికి వచ్చాకే విడాకులు తీసుకోవాలని సౌందర్య కోర్టును ఆశ్రయించలినట్లు తెలిపారు. మరోవైపు సౌందర్య రజనీకాంత్ ’వీఐపీ-2’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ధనుష్, అమలాపాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సౌందర్యా రజనీకాంత్ స్క్రిప్ట్ షురూ!
రజనీకాంత్ కుమార్తె సౌందర్యా రజనీకాంత్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ఆరేళ్ళ వివాహ బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ, వ్యాపారవేత్త అయిన భర్త అశ్విన్ రామ్‌కుమార్‌తో విడాకులకు సిద్ధమవుతు న్నారంటూ ఇటీవలే మీడియా అంతా సౌందర్య పేరు మారుమోగింది. ఆ వార్త నిజమేనంటూ ప్రకటించిన ఆమె కొత్త ప్రయత్నాల్లో పడ్డారు. గతంలో తన తండ్రితో మోషన్ క్యాప్చర్ 3డి ఫిల్మ్ ‘కొచ్చడయాన్’ రూపొందించిన ఆమె ఇప్పుడు పూర్తిస్థాయిలో మామూలు ఫీచర్ ఫిల్మ్ రూపొందించే పనిలో ఉన్నారు. ఇటీవలే రజనీకాంత్‌తో ‘కబాలి’ సినిమా తీసిన ప్రముఖ నిర్మాత ‘కలైపులి’ ఎస్. థానూయే ఈ కొత్త ప్రాజెక్ట్‌కి నిర్మాత. ఇప్పటికే థాను బృందం మరో తమిళ సినిమా ‘ఇంద్రజిత్’ రూపకల్పనలో బిజీగా ఉంది. ఆ మధ్య మణిరత్నం ‘కడలి’ సినిమాలో నటించిన గౌతమ్ కార్తీక్ (ఒకప్పటి హీరో కార్తీక్ కుమారుడు)తో కళాప్రభు దర్శకత్వంలో ‘ఇంద్రజిత్’ సినిమా రూపొందిస్తోంది. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్యాంటసీ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ పనులు ఓ పక్కన జరుగుతుండగానే, మరోపక్క ప్రస్తుతం సౌందర్యా రజనీకాంత్‌తో సినిమాకు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టించారు. ఈ కొత్త సినిమాకు కావాల్సిన నటీనటుల కోసం తాజాగా ప్రకటన కూడా ఇచ్చారు. ఓ ప్రముఖ తమిళ యువ హీరో ఇందులో కథానాయకుడిగా నటిస్తారని కోడంబాకమ్ వర్గాల కథనం. సౌందర్య అక్క, హీరో ధనుష్ భార్య అయిన ఐశ్వర్య గతంలో దర్శకురాలిగా తమిళంలో ‘3’, ‘వెయ్ రాజా వెయ్’ సినిమాలు తీశారు. ‘3’ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డీ’ పాట దేశవిదేశాల్లో ఎంత సంచలనమో అందరికీ తెలుసు. మరి గతంలో గ్రాఫిక్స్ డిజైనర్‌గా పనిచేసి, నిర్మాతగా ప్రయత్నించి, ఇప్పుడు అక్క ఐశ్వర్య బాటలోకి వచ్చిన సౌందర్య ఏ సంచనాలు సృష్టిస్తారో చూడాలి. సినిమాలు, వాటి ఫలితాల మాటెలా ఉన్నా ‘కబాలి’తో రజనీకాంత్‌కీ, ఆయన కుటుంబానికీ నిర్మాత థాను బాగా దగ్గరైనట్లే కనిపిస్తోంది కదూ! -
సౌందర్య రజనీకాంత్ చిత్రపటాలు దహనం
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు, సినీ దర్శకురాలు సౌందర్యరజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఆమె చిత్ర పటాలను దహనం చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకెళితే సౌందర్యరజనీకాంత్‌ను భారత దేశం యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. సౌందర్యరజనీకాంత్ ఆ బాధ్యతలను చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ తిరుచ్చిలో వీరవిళైయాట్టు మీట్పు కళగం నిర్వాహకులు మంగళవారం ఆందోళనకు దిగారు.సౌందర్యరజనీకాంత్ చిత్ర పటాలను దహనం చేసి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. అయితే అక్కడి పోలీసులు సౌందర్య రజనీకాంత్ చిత్ర పటాలు దహనం చేయడాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీరవిళైయాట్టు మీట్పు కళకం నిర్వాహకుడు రాజేశ్ మాట్లాడుతూ సౌందర్య రజనీకాంత్‌ను యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమించడాన్ని జల్లికట్టును ఆదరించేవాళ్లు, తమిళ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిందన్నారు. జల్లికట్టు నిషేధానికి కారణంగా నిలిచిన యానిమల్ వెల్ఫేర్ బోర్డుకు అంబాసిడర్‌గా సౌందర్య రజనీకాంత్‌ను ఎంపిక చేయడం ఖండించతగ్గ విషయంగా పేర్కొన్నారు. అంతే కాకుండా తమిళ చిత్రాల్లో నటించి డబ్బు సంపాదించుకున్న కొందరు నటీనటులు జల్లికట్టుకు వ్యతిరేకంగా మాట్లాడడం గర్హనీయం అన్నారు. నటుడు రజనీకాంత్ మురట్టుకాళై చిత్రంలో జల్లికట్టు అంబోతుతో పోరాడి గెలిచినట్లు నటించి తమిళ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్నారన్నారు. రజనీకాంత్ ఈ విషయంలో కలగజేసుకుని యానిమల్ వెల్ఫేర్ బోర్డు అంబాసిడర్‌గా నియమితులైన తన కూతురు సౌందర్యరజనీకాంత్‌ను ఆ బాధ్యతనుంచి వైదొలిగేలా చేయాలని లేని పక్షంలో ఆయనకు వ్యతరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. -
రజనీ కూతురి రిక్వెస్ట్..రెస్పెక్ట్ ప్లీజ్!
ఓ పక్క అభినందనలు.. మరోపక్క ఈ వార్త నిజమేనా సౌందర్యా? అంటూ ఆరాలు.. శుక్రవారం రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్యా రజనీకాంత్ భిన్నమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమె నియమితులయ్యారు. అదే రోజున ఆమె విడాకులు తీసుకోనున్నారనే అంశం ప్రముఖంగా వినిపించింది. వ్యాపారవేత్త అశ్వినీ రామ్‌కుమార్, సౌందర్యా రజనీకాంత్‌లు 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2015లో వీరికో బాబు పుట్టాడు. వీరిద్దరూ విడిపోతున్నారనే వార్త శుక్రవారం హైలైట్ అయ్యింది. అభినందనలు తెలిపిన వారికి థ్యాంక్స్ చెబుతూనే, విడాకుల వార్తపై సౌందర్యా రజనీకాంత్ స్పందించారు. ‘‘నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు నిజమే. ఏడాదిగా మేమిద్దరం విడిగా ఉంటున్నాం. విడాకుల గురించి చర్చలు జరుగుతున్నాయి. మా ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించాలని అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను’’ అని ఆమె ట్వీట్ చేశారు. -
ఈసారి రొమాంటిక్ కామెడీ
సినిమాకు ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా అంటే రొమాంటిక్ కామెడీ కథలే. ఇవి మినిమమ్ గ్యారెంటీ చిత్రాలు కూడా. ఈసారి తనూ ఆ పంథాలోనే నటుస్తున్నానంటున్నారు మహిళా దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్. ఈమె సూపర్‌స్టార్ రజనీకాంత్ వారుసురాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి హీరోగా చిత్రం చేసిన అరుదైన దర్శకురాలీమె. సౌందర్య కోచ్చడైయాన్ చిత్రంతో మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలోనే క్యాప్చరింగ్ ఫార్మాట్లో తెరకెక్కిన తొలి యానిమేషన్ 3డీ చిత్రం ఇది. ఆ విధంగా సౌందర్య రజనీకాంత్ అశ్విన్ మొదటి చిత్రంతోనే గొప్ప ప్రయోగం చేశారని చెప్పవచ్చు. కాగా తన తండ్రి సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత చరిత్రను చిత్రంగా మలచనున్నారనే ప్రచారం ఇటీవల మీడియాలో హల్చల్ చేసింది. అయితే అందులో నిజం లేదని సౌందర్య స్పష్టం చేశారు. మలి ప్రయత్నంగా ఒక రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇందులో నటుడు, ఆమె బావ ధనుష్ కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అదీ అసత్య ప్రచారమేననీ, మరో యువ నటుడు నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయనీ, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్లనుందని సౌందర్య తెలిపారు. -
ఈ సారి బావ హీరోగా సినిమా..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచయం అయిన సౌందర్య రజనీ కాంత్, కొచ్చాడయాన్ సినిమాతో డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో పలు చిత్రాలకు గ్రాఫిక్స్ డిజైనర్ గా పనిచేసిన సౌందర్య, కొచ్చాడయాన్తో నిర్మాత, దర్శకురాలిగానూ మారింది. అయితే ఈ సినిమా నిరాశపరచటంతో మెగాఫోన్‌ను పక్కనపెట్టి బిజినెస్ పనులు చూస్తూ కాలం గడుపుతోంది. తాజాగా మరోసారి తన డైరెక్షన్ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది ఈ స్టార్ వారసురాలు. గతంలో తండ్రి హీరోగా సినిమా తెరకెక్కించిన సౌందర్య, ఈ సారి తన అక్క భర్త, ధనుష్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉందట. అయితే ఈ సినిమాకు కేవలం స్క్రిప్ట్ అందిస్తుందా లేక దర్శకత్వం కూడా తానే చేస్తుందా..? అన్న విషయాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ధనుష్ కూడా ఇప్పట్లో సౌందర్యకు డేట్స్ అడ్జస్ట్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లు చేతిలో ఉన్న ధనుష్, ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు. ధనుష్ హీరోగా ప్రభు సోలొమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొడరి రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అగ్నిహోత్రి, సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సౌందర్యకు కొడుకు పుట్టాడు..
చెన్నై: ప్రముఖ నటుడు రజనీకాంత్ మరోసారి తాత ప్రమోషన్ కొట్టేశారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య బుధవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తాత హోదాలో ఉన్న ఆయన ఈసారి బుజ్జి మనవడు పుట్టడంతో సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం పాపతో పాటు సౌందర్య కూడా క్షేమంగా ఉన్నట్లు రజనీకాంత్ సన్నిహితుడొకరు తెలిపారు. 2010లో ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరిద్దరికి ఇదే తొలి సంతానం. కాగా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య...ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వారిద్దరికీ ఇద్దరు కుమారులు. ఇక రజనీ కాంత్ నటించిన 3డి యానిమేషన్ చిత్రం కోచ్చడయాన్ చిత్రం ద్వారా సౌందర్య దర్శకురాలిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ 'తన కూతుళ్లు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు. తాను సంపాదించింది వృథా చేయకుండా ఉంటే చాలు వారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా'నని అన్నారు. అదే వేదికపై తన నాన్న మాటను పాటిస్తానని సౌందర్య తెలిపింది. పెళ్లి అయిన నాలుగేళ్లకు పైగా సంతానానికి దూరంగా ఉన్న సౌందర్య.. తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించి బుజ్జిబాబుకు జన్మనిచ్చింది. -
రజనీ అభిమానుల హంగామా
చెన్నై : కోచ్చడయాన్ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానుల హంగామా మొదలైంది. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసి న చిత్రం కోచ్చడయాన్. ఆయన రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్. భారతీయ సినీ చరిత్రలోనే తొలి సారిగా హాలీవుడ్ చిత్రం అవతార్ తరహాలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీతో 3డీ ఫార్మెట్లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం కోచ్చడయాన్. రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఆరు వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. దీంతో రజనీ అభిమానుల హంగామా బుధవారం నుంచే మొదలైంది. చిత్ర బ్యానర్లతో మారథాన్ నిర్వహిస్తున్నారు. పర్యావరణ సంరక్షణ, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సైదాపేటకు చెందిన రజనీ అభిమాన సంఘం నిర్వాహకుడు సైదై రవి, నందంబాక్కం షణ్ముగ పాండియన్ల ఆధ్వర్యంలో ఊరేగింపుగా గిండి నుంచి బయలుదేరి నెలై్ల, మదురై జిల్లాల్లో కోచ్చడయాన్ చిత్రం విజయం సాధించాలని పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. -
ఏప్రిల్ 11న కొచ్చాడయాన్ విడుదల
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'కొచ్చాడయాన్' ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న విడుదల కానుంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదో సరికొత్త ముందడుగని సౌందర్య అంటున్నారు. గత సంవత్సరం భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో, ఈసారి దాని తదుపరి ముందడుగుగా కొచ్చాడయాన్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మన దేశంలో పెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీ ఆధారంగా తీసిన పూర్తిస్థాయి తొలి సినిమా ఇదేనని, ఇతర యాక్షన్ చిత్రాల కంటే ఇది చాలా విభిన్నంగా నిలుస్తుందని తాను ఆశిస్తున్నానని సౌందర్య అన్నారు. కొచ్చాడయాన్ సినిమాలో చాలా విభిన్నమైన పెర్ఫార్మెన్స్ కాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలిసారి ఉపయోగించారు. మంచికి, చెడుకు మధ్య జరిగే యుద్ధాన్ని ఇందులో చూపించారు. రజనీకాంత్ ఇందులో డబుల్ రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు దీపికా పడుకొనే, శరత్ కుమార్, నాజర్, ఆది, శోభన, రుక్మిణి తదితరులు నటిస్తున్నారు. ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాను ఒకేసారి తమిళం, తెలుగు, హిందీ, మరాఠీ, భోజ్‌పురి, బెంగాలీ, పంజాబీ భాషల్లో విడుదల చేస్తున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 6వేల థియేటర్లలో ఇది విడుదల కానుంది. అంతర్జాతీయంగా ఇంగ్లీషులోనూ విడుదల అవుతోందని ఇరోస్ ఎండీ సునీల్ లుల్లా తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. కార్బన్ మొబైల్ సంస్థ ప్రత్యేకంగా ఈ చిత్రం బ్రాండుతో పది లక్షల మొబైల్ ఫోన్లు విడుదల చేస్తోంది. వీటిని ఆడియో లాంచ్ సందర్భంగా మార్కెట్లోకి తెస్తారు. ఇందులో సినిమాకు సంబంధించిన స్క్రీన్ సేవర్లు, కొన్ని స్టిల్స్, ట్రైలర్, సిగ్నేచర్ ట్యూన్ ఉంటాయి.