
సౌందర్యారజనీకాంత్ ,విశాఖన్
చెన్నై, పెరంబూరు: నటుడు రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రెండో పెళ్లికి సిద్ధం అయ్యారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తండ్రి రజనీకాంత్ హీరోగా కోచ్చాడయాన్ అనే యూనిమేషన్ చిత్రం, అక్క భర్త ధనుష్ హీరోగా వీఐపీ–2 చిత్రాలకు దర్శకత్వం వహించిన సౌందర్యకు ఇంతకుముందే అశ్విన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి వేద్ అనే కొడుకు ఉన్నాడు. ఈ స్థితిలో మనస్పర్థల కారణంగా అశ్విన్, సౌందర్య విడిపోయారు.
గత కొద్ది కాలంగా ఒంటరిగానే నివశిస్తున్న సౌందర్య ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. ఈమె విశాఖన్ అనే వ్యక్తిని పెళ్లాడబోతున్నారట. ఎంబీఏ పట్టభద్రుడైన విశాఖన్ ప్రముఖ వ్వాపారవేత్త, నటుడు కూడా. ఈయనకు వివాహం అయ్యి భార్య నుంచి విడిపోయారన్నది గమనార్హం. మందుల కంపెనీ అధినేత అయిన విశాఖన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త వణంగాముడి కొడుకు. వీరి వ్యాపారం రూ.600 కోట్ల టర్నవర్ అని తెలిసింది. విశాఖన్, సౌందర్యల వివాహ నిశ్చితార్థం ఇటీవలే పెద్దల సమక్షంలో జరిగినట్లూ, జనవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే ఈ విషయం గురించి రజనీకాంత్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నది గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment