ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే తన పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకుంది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్‌ను ఆమె పెళ్లాడింది. సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజు జోసెఫ్ అలప్పుజా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.
శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అంజు.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు సినీతారలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.
కాగా.. అంజు జోసెఫ్ డాక్టర్ లవ్ చిత్రంలోని చిల్లానే పాటతో సింగర్‌గా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పలు మలయాళ సినిమాలో పదికి పైగా పాటలు పాడింది. తనదైన టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఆమె తొలిసారిగా అర్చన 31 నాటౌట్ అనే చిత్రంలోనూ నటించింది. అయితే గతంలో అంజు స్టార్ స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment