
ఈ మధ్యకాలంలో హనీరోజ్ (Honey Rose) సినిమాలతో కన్నా వివాదాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడిని అరెస్టు చేయగా తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ విషయంలో కొందరు హనీరోజ్‌కు మద్దతుగా నిలబడితే మరికొందరు ఆమెను తప్పుపట్టారు.
దాని అర్థమేంటి?
తాజాగా నటి ఫరా శిబిల (Fara Shibla).. హనీ పోరాటాన్ని ఓపక్క మెచ్చుకుంటూనే మరోపక్క ఆమె తీరుపై విమర్శలు గుప్పించింది. ఫరా మాట్లాడుతూ.. హనీరోజ్ వేషధారణను నేను తప్పుపట్టడం లేదు. కాకపోతే ఆమెను రకరకాల యాంగిల్స్‌లో తీసిన ఫోటోలను వీడియోలను తనే స్వయంగా షేర్ చేస్తోంది. దీని ద్వారా ఆమె ఏం చెప్పాలనుకుంటోందని మాత్రమే ప్రశ్నించాను. నేను వేసుకునే దుస్తులు అవతలివారికి అసౌకర్యంగా అనిపించకూడదు.

అందరూ అదే పని!
దేనికైనా కొన్ని హద్దులుంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో అందరూ తమ శరీరాల్ని చూపిస్తూ ఎగ్జిబిషన్ పెట్టేస్తున్నారు. చాలామంది సోషల్ మీడియాలో ఇదే చేస్తున్నారు. నేను కూడా ఫోటోషూట్ చేశాను కదా అని ప్రశ్నిస్తారేమో! ఏదైనా ఐడియా నచ్చితేనే, చూడటానికి బాగుందనిపిస్తేనే ఆయా ఫోటోషూట్ చేస్తాను. కానీ ఇప్పుడు జనాలు కేవలం లోదుస్తులతో కోల్డ్ కాఫీ తయారు చేస్తూ వీడియోలు చేస్తున్నారు.
అమాయకురాలేం కాదు
హనీరోజ్ అమాయకురాలైతే కాదు.. తను తెలివైనది. తనేం చేస్తుందో తనకు బాగా తెలుసు. డబ్బు సంపాదించడం తప్పు కాదు.. కానీ ఇండస్ట్రీలో కష్టాలు ఎదుర్కొంటున్న ఎంతోమందికి ఆమె ఒక చెత్త ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాలు లేకపోతే ఇలా శరీరాన్ని ఎగ్జిబిషన్‌గా పెట్టి డబ్బు సంపాదించుకోవాలని నేర్పిస్తోంది. మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతిభను నమ్ముకోవాలి తప్ప శరీరాన్ని కాదు అని చెప్పుకొచ్చింది. మలయాళ బ్యూటీ హనీరోజ్ ఆలయం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ వర్షం సాక్షిగా, వీరసింహారెడ్డి చిత్రాల్లో నటించింది.
చదవండి: దర్శన్‌తో గొడవ? ఇలాంటివాడికి ఆస్కార్ ఇవ్వాలంటూ నటి వరుస పోస్టులు!
Comments
Please login to add a commentAdd a comment