Anju
-
ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోలు
-
ప్రియుడితో ప్రముఖ సింగర్ రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే తన పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకుంది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్‌ను ఆమె పెళ్లాడింది. సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజు జోసెఫ్ అలప్పుజా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అంజు.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు సినీతారలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.కాగా.. అంజు జోసెఫ్ డాక్టర్ లవ్ చిత్రంలోని చిల్లానే పాటతో సింగర్‌గా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పలు మలయాళ సినిమాలో పదికి పైగా పాటలు పాడింది. తనదైన టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఆమె తొలిసారిగా అర్చన 31 నాటౌట్ అనే చిత్రంలోనూ నటించింది. అయితే గతంలో అంజు స్టార్ స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Anju Joseph (@anjujosephofficial) -
పాక్ నుంచి భారత్ తిరిగొచ్చిన అంజూ ఎక్కడుంది?
ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన మహిళ అంజూ.. మరోసారి వార్తల్లో నిలించింది. ఫేస్బుక్ ప్రేమికుడు నస్రుల్లాను పెళ్లాండేందుకు.. ఇండియాలోని భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి పాక్‌కు వెళ్లిపోయిన ఆమె.. ఇటీవల మళ్లీ తిరిగి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంజూ ఇండియాలో ఎక్కడుందో ఎవరికి తెలియరాలేదు. ఈ వారమే అంజూ పాక్‌నుంచి ఢిల్లీ తిరిగి రాగా.. ఆమె రాజస్థాన్‌లోని భివాడికి వెళ్లలేదు. తన పిల్లలను కలవలేదు. అంజూ ఆచూకీని అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. అయితే భివాడిలోని ఆమె అంతకముందు నివసించే రెసిడెన్షియల్ సొసైటీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను, అపరిచిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇంటలిజెన్స్ బ్యూరోకి చెందిన బృందం అంజు పిల్లలను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా రెసిడెన్షియల్ సొసైటీలో ఉంటున్న ఆమె పిల్లల కూడా తమ తల్లిని కలవబోమని చెబుతున్నారు. కాగా మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూకి ఇదివరకే పెళ్లైంది. ఆమెకు 15ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. 2019లో ఫేస్బుక్ ద్వారా నస్రుల్లా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరు ప్రేమించుకున్నారు. జైపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి.. గత జులైలో ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లింది. అక్కడ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వివాహం తరువాత తన పేరును ఫాతిమాగా మార్చుకుంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్ దిర్ జిల్లాలోని ఓ గ్రామంలో వారు నివసిస్తున్నారు. ఈ జంటకు పాక్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ యాజమాని మోహసీన్ ఖాన్ అబ్బాసీ కొంత భూమి, నగదును బహుమతిగా అందించారు. నాలుగు నెలల తర్వాత తాజాగా ఆమె మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చింది. పాకిస్తాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్‌లోకి ఆమె బుధవారం రాత్రి ప్రవేశించింది. తన పిల్లలను తీసుకెళ్లేందుకే ఇండియా వచ్చానని ఆమె చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్‌గా మారాయి. -
ప్రియుని కోసం పాక్ వెళ్లిన అంజూ తిరిగొచ్చింది!
జైపూర్: ప్రియుని కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజూ తిరిగి స్వదేశానికి వచ్చింది. వాఘా సరిహద్దు దాటి భారత్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దర్యాప్తు బృందాల అదుపులో ఉంది. విచారణ అనంతరం ఆమెను ఢిల్లీకి తరలించనున్నారు. ప్రియుడు నస్రుల్లా కోసం గత జులైలో అంజూ పాకిస్థాన్‌కు వెళ్లింది. అంజూ రాజస్థాన్ బివాండీకి చెందిన మహిళ. భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్బుక్లో పరిచయమైన పాక్ వ్యక్తి నస్రుల్లాను ప్రేమించింది. అతని కోసం గత జులైలో భారత్ సరిహద్దు దాటి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌కి వెళ్లింది. అయితే.. తన స్నేహితున్ని కలుసుకోవడానికి మాత్రమే వెళ్లానని తెలిపిన అంజూ.. ఆ మరుసటి రోజే అతనితో వివాహం చేసుకుంది. అంజూ నుంచి ఫాతిమాగా పేరు మార్చుకుని ఇస్లాం స్వీకరించింది. జైపూర్ మాత్రమే వెళ్తున్నట్లు, మరో రెండు రోజుల్లో వెచ్చేస్తానని అప్పట్లో తనతో చెప్పినట్లు అంజూ భర్త అరవింద్ తెలిపారు. అప్పటి నుంచి అంజూతో వాట్సాప్‌లో టచ్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు. అంజూ, నస్రుల్లాల స్నేహం గురించి తనకు ముందే తెలుసని చెప్పారు. అంజూ ఎప్పటికైనా భారత్ తిరిగివస్తుందని తనకు ముందే తెలుసని అన్నారు. అరవింద్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఇరువురు క్రిస్టియన్ స్వీకరించారు. ఇదీ చదవండి: కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన -
అంజూ ఘటన: ఆ కుటుంబానికి ఉపాధే కరువైంది!
జైపూర్: మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ అనే వివాహిత పాక్‌కు వెళ్లి అక్కడే తన ప్రియున్ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనల అనంతరం అంజూ కుటుంబం స్థానికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంజూ నిర్వాకం తర్వాత స్థానికులు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నారట. కేవలం గ్రామంలోనే గాక ఉద్యోగంలో కూడా వెలివేతకు గురికావాల్సి వస్తోందని సమాచారం. అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ బౌనా అనే గ్రామంలో బట్టల కుట్టే వృత్తి చేస్తున్నారు. తన కూతురు అంజూ పాక్‌కు వెళ్లిపోయిన తర్వాత ఎవరూ తనకు ఉపాధిని కల్పించడం లేదని చెప్పారు. మొదట సానుభూతి చూపిన గ్రామస్థులే.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని వాపోయారు. అటు.. అంజూ సోదరుడు, భర్తకు కూడా తమ కంపెనీల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందట. అంజూ సోదరుడు డేవిడ్ ఓ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. అయితే.. అంజూ వ్యవహారం తర్వాత తాను పనిచేసే సంస్థ డేవిడ్‌ను ఇంటివద్దే ఉండమని చెప్పేసిందని చెప్పారు. అంజూ భర్తను కూడా ఆయన పనిచేసే కంపెనీ బెంచ్‌కే పరిమితం చేసిందట. ఏ పని అప్పగించడం లేదట. ఖాలీ గానే ఉంచున్నారని వెల్లడించారు. అంజూ అనే వివాహిత ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ప్రియుని కోసం పాకిస్థాన్‌కు కొన్ని రోజుల క్రితం వెళ్లిపోయింది. అక్కడే తన పేరును ఫాతిమాగా మార్చుకుని పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత అంజూపై ఆమె తండ్రి తీవ్ర ఆరోపణలు చేశాడు. తనకు చెప్పకుండానే పాకిస్థాన్‌కు వెళ్లిందని అంజూ భర్త తెలిపారు. పాక్ వెళ్లాక రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. అంజూ పాక్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అంజూ కొత్త జంటకు భూములు వంటి అనేక కానుకలు సమర్పించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు. ఇదీ చదవండి: భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో! -
'చావడమే మేలు..' పాక్ వెళ్లి ప్రియున్ని పెళ్లాడిన అంజు తండ్రి ఆవేదన..
జైపూర్: పాక్ వెళ్లి ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్న భారతీయ మహిళ అంజు చర్యల పట్ల ఆమె తండ్రి గయా ప్రసాద్ థామస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కూతురు చనిపోవడమే మేలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి భారత్‌కు రావడానికి అంజూకు హక్కు లేదని అన్నారు. ఒకవేళ తిరిగివస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఆమె చేసింది చాలా తప్పు పని అని అన్నారు. అంజు.. వివాహిత అయిన రాజస్థాన్‌కు చెందిన భారతీయ మహిళ. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇండియా నుంచి పాక్‌కు వెళ్లి తన ఫేస్బుక్ ప్రియుడు నస్రుల్లాతో గత మంగళవారమే వివాహం చేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర దుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పిన అంజూ తండ్రి థామస్.. తమ కూతురు చేసిన పనికి సిగ్గుపడుతున్నట్లు చెప్పారు. గౌరవప్రదేమైన భారతదేశానికి తన కూతురు చర్యతో కలంకం సోకినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు. అంజు తండ్రిగా తన పేరును ప్రభుత్వ రికార్డుల నుంచి తీసేయాలని కోరారు. ఇదీ చదవండి: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి! అంజూతో తమకు ఎలాంటి బంధుత్వం లేదని థామస్ తెలిపారు. దేశ సరిహద్దు దాటినప్పుడే తమతో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. చాలా విచారకరమైన విషయమని అన్నారు. సీమా హదర్ కేసుకు భిన్నంగా అంజు అనే వివాహిత రాజస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోని తన ఫేస్బుక్ ప్రియున్ని కలవడానికి వెళ్లింది. రాజస్థాన్‌లో బివాడీకి చెందిని అంజూకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీసాతో అధికారికంగానే పాక్‌లోకి అడుగుపెట్టిన అంజు.. ప్రియుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. తాను తన స్నేహితున్ని కలవడానికి మాత్రమే వెళ్లినట్లు అంజు చెప్పారు. ఈ పరిణామాల అనంతరం అంజూ తండ్రి తీవ్రంగా స్పందించారు. అంజు తనకు చెప్పకుండానే పాక్ వెళ్లిందని ఆమె భర్త తెలిపారు. లాహోర్‌లో ఉన్నట్లు కాల్ చేసినట్లు తెలిపిన ఆయన.. రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రేమ వ్యవహారంగా భావించిన రాజస్థాన్ పోలీసులు.. నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి కేసు నమోదు కాలేదని చెప్పారు. ఇదీ చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్! -
మతం మారలేదు.. మేం పెళ్లి చేసుకోలేదు!
ఓవైపు పాక్ మహిళ సీమ వ్యవహారం వార్తల్లో ఉండగానే.. ఫేస్బుక్ స్నేహితుడు(ప్రియుడి!) కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ వెళ్లిన రాజస్థానీ వివాహిత అంజు ఎపిసోడ్‌కు విపరీతమైన హైప్ వచ్చింది. ఈలోపు ఈ ప్రేమకథా చిత్రమ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మతం మార్చుకుని ఫాతిమా పేరుతో ఆమె నస్రుల్లాను వివాహం చేసుకుందని.. ఈ మేరకు ఫొటోలు, వీడియోలు, వివాహ సర్టిఫికెట్ కూడా వైరల్ అయ్యాయి. అయితే.. భారత్‌కు చెందిన ఓ జాతీయ ఛానెల్ అంజు-నస్రుల్లాను విడివిడిగా సంప్రదించగా.. మీడియాలో వస్తున్న కథనాలన్నింటిని, తమకు వివాహం జరిగిందన్న ప్రచారాన్ని ఇద్దరూ కొట్టేశారు. నస్రూల్లా ఏమన్నాడంటే.. నేను అంజుని పెళ్లి చేసుకోలేదు. మా పేరుతో వైరల్ అవుతున్న సర్టిఫికెట్ కూడా ఫేక్. అన్నీ పుకార్లే. ఆమె కేవలం నాకు మంచి స్నేహితురాలే. మా ఇద్దరి గురించి మీడియాలో రావడంతో భద్రత కోసమే కోర్టుకు వెళ్లాం. ఇక్కడ బుర్ఖా సంప్రదాయం కాబట్టి ఆమె ధరించింది అంతే. అంజూ విదేశీయురాలు. పైగా భారతీయురాలు. ఆమెకు ముప్పు పొంచి ఉండడం సహజం. గనుక.. ప్రభుత్వం కూడా మాకు భద్రత కల్పించేందుకు ముందుకు వచ్చింది. 50 మంది పోలీసులు మాకు భద్రత కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మేం కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. ఆమె ఇంకా హిందువుగానే ఉంది. టూరిస్ట్ వీసా మీద పాక్‌ను చూడడానికి వచ్చింది. భర్తతో ఆమెకు గొడవలు వచ్చాయని.. విడాకుల ప్రక్రియ నడుస్తోందని నాకూ తెలుసు. విడాకులు మంజూరు అయ్యాక నన్ను ఇష్టపడితే ఆమెను తప్పకుండా వివాహం చేసుకుంటా. కానీ, అది ఆమె నిర్ణయం. ఇప్పటికైతే.. ఆగష్టు 4 వీసా గడువు ముగిశాక ఆమె తిరిగి భారత్‌కు వెళ్లిపోతుంది. అంజూ ఏమందంటే.. పాక్‌కు వెళ్లాలనుకున్నాను.. వెళ్లాను. నేనేం మతం మారలేదు. ఎవరినీ వివాహం చేసుకోలేదు. ఇక్కడ ఓ ఫేమస్ వ్లోగర్ మా ఇద్దరినీ కలిపి షూట్ చేశాడు. అంతేగానీ.. అదేం ప్రీ వెడ్ షూట్ లేదంటే పోస్ట్ వెడ్ షూట్ కాదు. అంతా పుకార్లే. నేను నస్రుల్లా మంచి స్నేహితులం మాత్రమే. నేనింకా భారతీయురాలినే. భారత్‌కు తిరిగొచ్చాక.. నా వ్యక్తిగత జీవితంపై నిర్ణయం తీసుకుంటా అని పేర్కొందామె. అక్కడే చచ్చిదనుకంటాం అంజూ(34) ఇంటి నుంచి వెళ్లిపోయి మరీ మతం.. ఫాతిమాగా పేరు మార్చేసుకుని పాకిస్తాన్ ఖైబర్ ఫంక్తుఖ్వా ప్రావిన్స్‌కు చెందిన నస్రుల్లా(29)ను వివాహం చేసుకుందంటూ పాక్ నుంచి కథనాలు వెలువడ్డాయి. ఈ విషయం తెలియగానే.. ఆమె తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. స్వస్థలం మధ్యప్రదేశ్ గ్వాలియర్ బౌనా గ్రామం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన .. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇద్దరు పిల్లలు, భర్త గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కనీసం బిడ్డల గురించి కూడా ఆలోచించలేదు. తన ఇష్టం, తన జీవితం తనది కావొచ్చు. కానీ, ఇలా చేయాలనుకుంటే.. ముందు భర్తకు విడాకులు ఇవ్వాలి కదా. కానీ, ఇలా పరువు తక్కువ పని చేయకూడదు కదా. అన్ని బంధాలను తెంచుకున్న అంజూ ఇక మా దృష్టిలో చచ్చినట్లే అని అంజు తండ్రి గయా ప్రసాద్ థామస్ ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, తిరిగొస్తుందన్న నమ్మకం తనకు ఉందంటూ అంతకు ముందు వ్యాఖ్యానించిన ఆయన.. కూతురి నిఖా చేసుకుందనే వార్త తెలిసే సరికి దిగ్భ్రాంతికి లోనయ్యారు. తిరిగి ఆమెను భారత్‌కు రప్పించే ప్రయత్నం చేస్తారా?.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారా? అంటే.. అలాంటి ప్రయత్నమేమీ చేయబోమని తెలిపారాయన. చస్తే అక్కడే చావనివ్వండి.. తన ఇద్దరి పిల్లలను మేం చూసుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. #WATCH | Gwalior, Madhya Pradesh | Gaya Prasad, father of Anju who travelled to Pakistan says, "We don't have any relations with her (Anju). The moment she left India, we cut off all ties with her...I had never imagined that my daughter can do something like this...What she has… pic.twitter.com/aN0YvI8RpM — ANI (@ANI) July 26, 2023 ఇదీ చదవండి: ఆకాశంలో వింత.. స్వర్గానికి దారి ఇదేనా? -
ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి!
ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారతీయ మహిళా అంజూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలిసేందుకు ఆమె తన భర్త, పిల్లలను వదిలి దాయాది దేశానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తరువాత నస్రుల్లా తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని, అతన్ని పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని పేర్కొంది అంజూ. తాను కేవలం ఓ పెళ్లికి హాజరు కావడానికి మాత్రమే పాక్‌కు చేరినట్లు, త్వరలోనే భారత్‌కు రానున్నట్లు తెలిపింది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. మాతం మార్చుకున్న అంజూ ప్రియుడు నస్రుల్లాను పెళ్లి చేసుకునేందుకు అంజూ ఇస్లాం మతంలోకి మారినట్లు తెలుస్తోంది. తన పేరును సైతం అంజూ నుంచి ఫాతిమాగా మార్చుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె బురఖా ధరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్‌లోని దిర్ జిల్లా కోర్టులో వీరిద్దరూ అధికారికంగా నిఖా జరుపుకున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ మేరకు అంజూ, నస్రుల్లా ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతూ.. టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించే ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. సంబంధిత వార్త: అందుకే పాక్ వచ్చా.. అంజూ వ్యవహారంలో ట్విస్ట్! నిఖా హోగయా అంజూ, నస్రుల్లా వివాహాన్ని మలకాండ్ డివిజన్ డీఐజీ నసీర్ మెహమూద్ సత్తి ధృవీకరించారు. ఆ మహిళా ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరును మార్చుకున్నట్లు పేర్కొన్నారు. నస్రుల్లా కుటుంబ సభ్యులు, పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో దంపతులు దిర్ బాలాలోని జిల్లా కోర్టుకు హాజరయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా అంజూను పోలీసు భద్రతతో కోర్టు నుంచి ఆమె కొత్త అత్తవారి ఇంటికి తీసుకెళ్లారు. 24 గంటలు గడవకముందే నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తన వీసా గడువు ముగియగానే ఆగస్టు 20న భారత్‌కు తిరిగి వస్తుందని పేర్కొన్న మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు నస్రుల్లా సైతం తమ ప్రేమ వ్యవహారంపై వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. అయితే 24 గంటలు గడవకముందే మొత్తం సీన్ మారిపోవడంతో ప్రజలు అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు అంజూ చెప్పింది అబద్దమేనా..? ఆమె ముందుగానే ప్లాన్ ప్రకారం అతడిని పెళ్లి చేసుకుందా? లేదా వారు బలవంతంగా ఇలా చేశారా? అన్నది ఆసక్తిగా మారింది. పాక్‌లోనే ఉంటుందా? తిరిగొస్తుందా! ప్రస్తుతం అంజూ వీసా గడువు ఆగస్ట్ 20వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇండియా వచ్చేయాలి. అంజూ ఇప్పుడు ఇస్తాం మతం స్వీకరించటంతోపాటు.. నుజురుల్లాను పెళ్లి చేసుకోవటం, పేరు మార్చుకోవటం చూస్తుంటే పాకిస్థాన్‌లోనే ఉండిపోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వ్యవహారమంతా లవ్ జీహాదీ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: ఏంటిది? మొత్తం ముఖానికే మాస్క్! బాబోయ్! మళ్లీ చైనాకు ఏమైంది? Video: Indian girl #Anju with her Pakistani friend Nasrullah Khan in his home district Dir pic.twitter.com/jJJaCmxq1U — Naimat Khan (@NKMalazai) July 25, 2023 -
ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. అందుకేనేమో ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలు దాటుతున్నారు. కుటుంబాన్ని, ఉన్న ఊరును విడిచి ప్రేయసి, ప్రియుడు కోసం దారులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రేమ పావురాలు. సోషల్ మీడియా వినియోగంతో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. పబ్జీ ప్రేమ ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్థాన్‌కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌కు చెందిన అజు అనే మహిళ ఫేస్బుక్లో పరిచయమైన ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాక్‌స్థాన్‌కు వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనపై మీడియాలో వస్తున్న వార్తలపై అంజూ స్పందించింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తను కేవలం సందర్శన కోసమే పాకిస్థాన్ వచ్చిన్నట్లు పేర్కొంది. పాక్‌లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరు అయ్యేందుకు వచ్చానని తెలిపింది. ఇందుకు అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినట్లు చెప్పింది. మూడేళ్లుగా పరిచయం తన పాకిస్థాన్ రాకపై ఎవరికీ ఏం తెలియదని, తన భర్తతో జైపూర్‌కు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపింది. ‘ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్‌సర్‌కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్‌కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తన పేరు నస్రుల్లా. మేం ఫేస్బుక్ ద్వారా స్నేహితులం. తను రెండుమూడేళ్లేగా నాకు తెలుసు. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు. మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. సీమా హైదర్‌తో పోల్చకండి కేవలం పెళ్లి కోసమే వచ్చాను. నాకు ఇక్కడ ఇంకేం పని లేదు. నన్ను సీమా హైదర్‌తో పోల్చకండి.. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. త్వరలోనే తిరిగి భారత్ వస్తాను. నా భర్తకు నాకు మనస్పర్థలు తలెత్తాయి. నా భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నాను’ అని తెలిపింది. సంబంధిత వార్త: ఆమెకు పిల్లలున్నా పాక్ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి.. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు మరోవైపు అంజూ ఆగస్టు 20న భారత్‌కు రానుందని ఆమె పాకిస్థాన్ స్నేహితుడు నస్రుల్లా(29) తెలిపాడు. అంజూ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్‌కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్‌కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె తన ఇంట్లోనే వేరే గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని తెలిపాడు. 2019లో పరిచయం కాగా ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్‌కు చెందిన అంజూ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివాసముంటోంది. ఈమెకు అరవింద్ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లాతో 2019లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వాలిడ్ పాస్పోర్టుతో.. అయితే అతడిని నస్రుల్లాను కలవడానికి అంజు 30 రోజుల పాకిస్తాన్ వీసాపై గురువారం పాక్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఎఅప్పర్ దిర్ జిల్లాకు వెళ్లిన్నట్లు తేలింది. అయితే, అంజు పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్‌కు వెళ్లేందుకు అంజూ వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్‌గానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
ఆ స్టార్ హీరో మూడు పెళ్లిళ్ల విషయం దాచి నాతో పెళ్లి, గర్భం..: నటి
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. 'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ సర్ చూసి నన్ను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్‌కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్‌తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు. -
విమాన ప్రమాదం: అంజూను మర్చిపోలేం.. షాక్‌కు గురైన సహ విద్యార్థులు
సాక్షి, తెనాలి: నేపాల్‌లోని పొఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో కోపైలట్ అంజూ ఖతివాడ మరణించడంతో.. తెనాలిలోని ఆమె సహ విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. నేపాల్‌లోని విరాట్ నగర్‌కు చెందిన అంజూ 1995లో తెనాలిలోని వివేకానంద జూనియర్ కాలేజ్‌లో ఇంటర్ విద్యాభ్యాసం చేశారు. ఆ బ్యాచ్‌లో నేపాలీలు మొత్తం 125 మంది వరకు ఉన్నారని.. అందులో అంజూ అందరితో కలివిడిగా.. చదువులో చురుగ్గా ఉండేది. బైపీసీలో 72 శాతం మార్కులు సాధించిందని.. వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరితో టచ్‌లో ఉండేదని సహ విద్యార్థి లింగం మకుటం శివకుమార్ చెప్పారు. ఆమె భర్త కూడా పైలట్ అని.. ఓ విమాన ప్రమాదంలో మరణించారని పేర్కొన్నారు. బీమా డబ్బుతో అంజూ పైలట్ శిక్షణ తీసుకుందని చెప్పారు. 6,400 గంటలకు పైగా విమానం నడిపిన అంజూ ఇలా ప్రమాదంలో మరణించడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. అంజూను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. కాగా, అంజూ మృతిపై వివేక విద్యాసంస్థల డైరెక్టర్ వీరనారాయణ సంతాపం తెలిపారు. చదవండి: (శ్రీహరికోటలో మరో విషాదం.. వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య) -
సక్సెస్‌స్టోరీ..:ఎకో–ఫ్రెండ్లీ ఫ్రెండ్స్
‘ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది’ అనే మాటను వింటూనే ఉన్నాం. ఈ ముగ్గురు కుర్రాళ్ల జీవితాన్ని మార్చేసి, అంకుర దిగ్గజాలుగా మార్చింది మాత్రం ఒక చాక్లెట్ రేపర్. అదేలా అంటే... ‘విజయానికి దారి ఏమిటి?’ అని మల్లగుల్లాలు పడుతుంటాంగానీ కొన్నిసార్లు పరిస్థితులే విజయానికి దారి చూపుతాయి. ముగ్గురు మిత్రులు, మూడు సంవత్సరాల క్రితం... అక్షయ్ వర్మ, ఆదిత్య రువా, అంజు రువా ఆరోజు చెమటలు కక్కుతూ ముంబైలో బీచ్ క్లీన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ ఎండలో వారికి తళతళ మెరుస్తూ ఒక ఒక చాక్లెట్ బ్రాండ్ ప్లాస్టిక్ రేపర్ కనిపించింది. ఆ బ్రాండ్ తన ఉత్పత్తులను 1990లోనే ఆపేసింది. రేపర్ మాత్రం ‘నిను వీడని నీడను నేను’ అన్నట్లుగా చూస్తోంది. కాలాలకు అతీతంగా పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్‌పై ముగ్గురూ చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి చర్చ, ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘బెకో’ అనే స్టార్టప్. వెదురు, ప్లాంట్ బేస్డ్ ఇన్‌గ్రేడియంట్స్‌తో పర్యావరణహితమైన వస్తువులు, ఫ్లోర్ క్లీనర్స్, డిష్‌వాషింగ్ లిక్విడ్లాంటి కెమికల్ ఫ్రీ డిటర్జెంట్స్, గార్బేజ్ సంచులు, రీయూజబుల్ కిచెన్ టవల్స్, టూత్‌బ్రష్‌లు... మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది బెకో. దీనికి ముందు... పెట్ యాజమానుల కోసం ‘పెట్ ఇట్ అప్’ అనే సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు అక్షయ్ వర్మ. కో–ఫౌండర్ జారుకోవడంతో ఒక సంవత్సరం తరువాత అది మూతపడింది. ఇక ఆదిత్య కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే ప్రొఫెషనల్స్ కోసం ఇంటర్–ఆర్గనైజేషన్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మొదలుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ వెంచర్‌ను అమ్మేశాడు. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. ఈ ముగ్గురు కలిసి ప్రారంభించిన ఎకో–ఫ్రెండ్లీ బిజినెస్ మొదట్లో తడబడినా, కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగిన తరువాత ఊపందుకుంది. ఆన్లైన్ మార్కెట్ప్లేసులతో పాటు, ముంబై, బెంగళూర్లలో దీనికి ఆఫ్‌లైన్ స్టోర్లు ఉన్నాయి. ‘బెకో’లో క్లైమెట్ ఎంజెల్స్ ఫండ్, టైటాన్ క్యాపిటల్, రుకమ్ క్యాపిటల్...మొదలైన సంస్థలు పెట్టుబడి పెట్టాయి. ‘లాభాల కోసం ఆశించి ప్రారంభించిన వ్యాపారం కాదు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించింది. వీరి తపన చూస్తుంటే భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలరనే నమ్మకం కలుగుతుంది’ అంటున్నారు ‘రుకమ్ క్యాపిటల్’ ఫౌండర్ అర్చన జాహగిర్దార్. పర్యావరణ ప్రేమికురాలు, ప్రసిద్ధ నటి దియా మీర్జా ఈ ముగ్గురి భుజం తట్టడమే కాదు, కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు. ముగ్గురు మిత్రులు అక్షయ్ (26), ఆద్యిత (26), అంజు (27) ముక్తకంఠంతో ఇలా అంటున్నారు... ‘భూగోళాన్ని పరిరక్షించుకుందాం అనేది పర్యావరణ దినోత్సవానికి పరిమితమైన నినాదం కాదు. పర్యావరణ స్పృహ అనేది మన జీవనశైలిలో భాగం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎకో–సెన్సిటివ్ ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుంది. వినియోగదారుల్లో 85 శాతం యువతరమే. పర్యావరణహిత వస్తువులను ఆదరించే ధోరణి పెరిగింది’ పర్యావరణహిత ఉత్పత్తుల మార్కెట్ రంగంలో ‘బెకో’ లీడింగ్ ప్లేయర్ పాత్ర పోషించనుందని ఆర్థికనిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో ‘బెకో’ను 500 కోట్ల రూపాయల బ్రాండ్‌గా చేయాలనేది ముగ్గురు మిత్రుల ఆశయం. అది ఫలించాలని ఆశిద్దాం. మొదటి వ్యక్తి దగ్గర ఫెయిల్యూర్ ఉంది. రెండో వ్యక్తి దగ్గర అనుభవం ఉంది. మూడో వ్యక్తి దగ్గర ఏమీ లేదు. -
మాజీ మోడల్‌కి జీవిత ఖైదు
లక్నో: తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో మాజీ మోడల్ ప్రియాంక సింగ్, ఆమె స్నేహితురాలు అంజూలకు జీవిత ఖైదు విధిస్తూ మీరట్ జిల్లా జడ్జి రామకృష్ణన్ గౌతమ్ తీర్పు వెలువరించారు. అలాగే ఒకొక్కరు రూ. 20 వేల జరిమాన విధించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. 2008, నవంబర్ 11న ప్రియంక... అంజూ సహాయంతో తన తల్లిదండ్రులు ప్రేమ్ వీర్ సింగ్ (65) అతడి భార్య సంతోష్ సింగ్ (62) లను కత్తితో పోడిచి దారుణంగా హత్య చేసింది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా 17వ తేదీన ప్రియాంక, అంజూలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో పోలీసులు అనుమానించి గట్టిగా ప్రశ్నించారు. దీంతో ప్రియాంక, అంజూలు హత్య చేసినట్లు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. ఆస్తి తగాదాలతోపాటు తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే కోపంతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు వారు పోలీసుల ఎదుట చెప్పారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరిచారు. దీంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. -
ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణకాంతి!