సౌందర్య రజనీకాంత్, విశాగన్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంట్లో పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఆయన కుమార్తె సౌందర్య పెళ్లికి బాజా మోగింది. సినీ నటుడు, వ్యాపారవేత్త అయిన విశాగన్ వనంగాముడిని ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఫిబ్రవరిలో ఈ పెళ్లి వేడుక జరగనుంది. గతేడాది ఇరు కుటుంబీకుల సమక్షంలో సౌందర్య, విశాగన్‌ల నిశ్చితార్థం జరిగిందట.
ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గానే జరిపారని టాక్. పెళ్లిని కూడా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరపాలనుకుంటున్నారట. అయితే రిసెప్షన్ మాత్రం ఘనంగా ఏర్పాటు చేయాలనుకుంటున్నారని భోగట్టా. మెహందీ, సంగీత్ కార్యక్రమాలతో కలిపి మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయట. కాగా అశ్విన్ రామ్‌కుమార్ అనే వ్యాపారవేత్తను 2010లో సౌందర్య వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment