మనవడి బర్త్‌డే.. దగ్గరుండి కేక్‌ కట్‌ చేయించిన రజనీకాంత్‌ | Rajinikanth, wife Latha Attend Grandson Ved Krishna Birthday Party | Sakshi
Sakshi News home page

సౌందర్య కుమారుడి బర్త్‌డే పార్టీ.. భార్యతో కలిసి హాజరైన రజనీకాంత్‌

Published Mon, May 20 2024 3:57 PM | Last Updated on Mon, May 20 2024 4:49 PM

Rajinikanth, wife Latha Attend Grandson Ved Krishna Birthday Party

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏడు పదుల వయసు దాటినా ఎంతో హుషారుగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ భాషల్లో కలిపి 170 చిత్రాలు చేశాడు. ప్రస్తుతం వేట్టైయాన్‌ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు విన్నాడు. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి పెద్ద పీట వేస్తుంటాడు.

కూతురి కోసమే ఆ సినిమాలో..
తన కుమార్తెలంటే రజనీకి ఎనలేని ప్రేమ. వారికోసం ఏదైనా చేస్తాడు. అందులో భాగంగానే ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన లాల్‌ సలామ్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, పాత్ర గురించి ఆలోచించకుండా కేవలం కూతురి కోసమే ఆయన ఈ సినిమా చేశాడని అభిమానులు భావించారు.

రజనీ పంచప్రాణాలు
రజనీ పంచప్రాణాలైన ఇద్దరు కూతుర్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ఐశ్వర్య.. ధనుష్‌ను పెళ్లి చేసుకోగా రెండేళ్ల క్రితమే అతడితో విడిపోయింది. చిన్నకూతురు సౌందర్య 2010లో అశ్విన్‌ రామ్‌కుమార్‌ను పెళ్లాడింది. వీరికి 2015లో వేద్‌ కృష్ణ జన్మించాడు. ఆ మరుసటి ఏడాదే భార్యాభర్తలిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు. 2017లో విడాకులు మంజూరయ్యాయి. తర్వాత ఆమె 2019లో నటుడు, బిజినెస్‌మెన్‌ విషగన్‌ను పెళ్లాడింది. వీరికి 2022లో వీర్‌ అనే కుమారుడు జన్మించాడు.

వేద్‌ బర్త్‌డే
తాజాగా సౌందర్య మొదటి కుమారుడు వేద్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చెన్నైలో ఘనంగా జరిగాయి. క్రికెట్‌ థీమ్‌తో పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ బర్త్‌డే ఈవెంట్‌కు రజనీ భార్య లతతో హాజరై మనవడితో కేక్‌ కట్‌ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: కమెడియన్‌తో రెండో పెళ్లి.. ఈ వయసులో అవసరమా? అని విమర్శలు.. స్పందించిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement