
Rajinikanth Meets Ravishankar: ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ తన ఇద్దరు కుమార్తెలతో కలసి భేటీ అయ్యారు. రజనీకి ఆధ్యాత్మిక చింతన అధికం. ఆయన ప్రతి చిత్రం షూటింగ్ అనంతరం హిమాలయాలకు వెళ్లి కొన్ని రోజులు గడపడం ఆనవాయితీ. ఇటీవల శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న అన్నాత్తై చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్రాన్ని భారీ అంచనాల మధ్య దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ విషయాన్ని అటుంచితే నటుడు రజనీకాంత్ తన ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య ధనుష్, సౌందర్య రజనీకాంత్ కలిసి ఆధ్యాత్మిక గురువుతో భేటీ అవడం చర్చనీయాంశమైంది. రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ ఆదివారం తన ట్విట్టర్‌లో ఈ మేరకు చిత్రాలు పోస్ట్ చేశారు. ఇప్పుడవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Renowned actor @rajinikanth, @soundaryaarajni, @ash_r_dhanush met Gurudev @SriSri Ravi Shankar. https://t.co/Kuxpcesdc4
— Office Of Gurudev (@OfficeOfGurudev) August 29, 2021
చదవండి : విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..
Karthikeya 2: హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది..
Comments
Please login to add a commentAdd a comment