మనవడిపై రజనీకాంత్‌ ప్రేమ.. ఫోటో స్టోరీ చెప్పిన సౌందర్య | Soundarya Comments On Rajinikanth | Sakshi
Sakshi News home page

మనవడిపై రజనీకాంత్‌ ప్రేమ.. ఫోటో స్టోరీ చెప్పిన సౌందర్య

Published Fri, Jul 26 2024 1:42 PM | Last Updated on Fri, Jul 26 2024 1:58 PM

Soundarya Comments On Rajinikanth

కోలీవుడ్‌ స్టార్‌ హీరో రజనీకాంత్‌ వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఈ వయసులోనూ ఆయన చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. కుర్ర హీరోలతో దూసుకుపోతూ భారీ హిట్లు అందుకుంటున్నారు. అయితే, నిజజీవితంలో ఆయన చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారని తెలుసు.. మధ్యతరగతి జీవితాలకు దగ్గరగా ఆయన లైఫ్‌స్టైల్‌ ఉంటుంది. తాజాగా ఆయన కూతురు సౌందర్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన ఫోటోలు పంచుకుంది. అందులో రజనీకాంత్‌తో పాటు ఆమె పెద్ద కుమారుడు వేద్‌ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఈరోజు తన కుమారుడు వేద్‌ స్కూల్‌కు వెళ్లనంటూ మారం చేయడంతో మనవడి కోసం రజనీకాంత్‌ ఎంట్రీ ఇచ్చారని సౌందర్య తెలిపింది. అప్పుడు మనవడిని రజనీకాంత్‌ స్వయంగా స్కూల్‌కు తీసుకెళ్లారని ఆమె చెప్పుకొచ్చింది. ఆన్‌ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌లో కూడా ప్రతి పాత్రనూ పోషించడంతో మీరూ దిట్ట అంటూ తన తండ్రి గురించి ఆమె తెలిపింది. బెస్ట్ తాత, బెస్ట్ డాడ్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ఆమె చేర్చింది.  

తన మనుమడు వేద్‌తో పాటుగా రజనీకాంత్‌ కూడా తరగతి గదిలోకి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. వెండితెరపైన కనిపించే తలైవా తమ ముందు ఒక సాధారణ వ్యక్తిలా వచ్చేసరికి వారు ఆశ్చర్యానికి గురైయారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

రజనీకాంత్‌ నటిస్తున్న 170వ చిత్రం ‘వేట్టయాన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, మంజు వారియర్‌ వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ఏడాది  అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement