'గ్యాంగ్స్‌' సిరీస్‌ నిర్మిస్తున్న రజనీ చిన్న కూతురు, ఆ ఓటీటీలోనే! | Soundarya Rajinikanth's 'Gangs' Web Series Launched - Sakshi
Sakshi News home page

Soundarya Rajinikanth: వెబ్‌ సిరీస్‌ తీసేందుకు రెడీ అయిన సౌందర్య.. రజనీ ఆశీర్వాదంతో..

Published Fri, Sep 8 2023 8:31 AM | Last Updated on Fri, Sep 8 2023 9:06 AM

Soundarya Rajinikanth Gangs Web Series Launched - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన జైలర్‌ సినిమా సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్న లాల్‌ సలామ్‌ చిత్రంలో ఆయన ముఖ్యపాత్రను పోషించారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రజనీకాంత్‌ ప్రస్తుతం తన నెక్స్ట్‌ మూవీకి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రానికి జైభీమ్‌ ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించనున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య వెబ్‌సిరీస్‌ను రూపొందించడానికి సిద్ధమయ్యారు. ఆమె ఇంతకుముందు తండ్రి రజనీకాంత్‌ కథానాయకుడిగా కోచ్చడైయాన్‌ అనే యానిమేషన్‌ చిత్రాన్ని, ధనుష్‌ కథానాయకుడిగా వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రాలకు దర్శకత్వం వహించారన్న విషయం తెలిసిందే.

తాజాగా ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌తో కలిసి ఒక వెబ్‌ సిరీస్‌ రూపొందిస్తున్నారు. దీనికి గ్యాంగ్స్‌ అనే టైటిల్‌ నిర్ణయించారు. నోవా అబ్రహం దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ సీరీస్‌లో అశోక్‌సెల్వన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. గురువారం చైన్నెలో ఈ వెబ్‌ సిరీస్‌ పూజాకార్యక్రమం జరిగింది. ఇందులో రజనీకాంత్‌ పాల్గొని ముహూర్తం షాట్‌కు క్లాప్‌కొట్టి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: ఈ హీరోల మల్టీ టాలెంట్‌ గురించి తెలుసా?

అంత జరిగినా కూడా నేను వెనుకడుగు వేయలేదు: కృతిసనన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement