మా ఇంట పెళ్లికి పోలీస్‌బందోబస్తు కల్పించాలని నటుడు రజనీకాంత్ కుటుంబం పోలీసులకు వినతి పత్రాన్ని అందించారు. రజనీ రెండవ కూతురు సౌందర్య రెండో పెళ్లికు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈమెకు నటుడు, వ్యాపారవేత్త విశాఖన్‌కు మధ్య ప్రేమ పెళ్లికి దారి తీసింది. విశాఖన్ ప్రముఖ వ్యాపారవేత్త వణంగాముడి కుమారుడు. ఈయన మొదటి భార్య నుంచి విడాకులు పొందారు. వంజగ ఉలగం చిత్రంలో నటించారు.
కాగా విశాఖన్, సౌందర్యల ప్రేమకు ఇరు కుటుంబ పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 10, 11 తేదీల్లో పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్ ఇంటి వద్ద వీరి వివాహ, రిసెప్షన్ జరుగనున్నాయి. దీంతో శుక్రవారం రజనీకాంత్ సతీమణి తేనాంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ కూతురు పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారని, పోలీస్ బందోబస్తు కల్పించాలని వినతి పత్రాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment