నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ విలక్షణ నటి అనాలో, సంచలన నటి అనాలో, బహుభాషా నటి అనాలో, డేర్ అండ్ డేరింగ్ నటి అనాలో ప్రేక్షక మహాశయులకే వది లేద్దాం. అయితే నటిగా మాత్రం ఒక చట్రంలో ఇరుక్కోకుండా వచ్చిన పాత్రల్లో నచ్చినవి చేసుకుంటూ తనకుంటూ ఒక స్టార్ ఇమేజ్‌ను సంపాధించుకున్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ప్రేమలో నికోలాయ్‌ని పెళ్లి కూడా చేసుకున్నారు. ఇటీవలే చైన్నె లో వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, నటుడు రజనీకాంత్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు వీరి వివాహా వేడుకకు హాజరై శుభాకాంక్షలు అందించారు.
ఇలా కొద్ది రోజులుగా శుభలేఖలు పంచడం, హల్దీ, మెహీందీ, ఫ్రీ వెడ్డింగ్ పార్టీ, పెళ్లి, రిసెప్షన్, వివాహానరంతరం జరిగే విశేష కార్యక్రమాలతో ఊపిరాడనంత బిజీ బిజీగా గడిపిన నటి వరలక్ష్మీశరత్‌కుమార్ ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లారు. అయితే ఈ నూతన జంట హనీమూన్‌కు ఏ ప్రదేశానికి వెళ్లారో చెప్పలేదు గానీ, సుందరమైన ప్రదేశంలో వారు తీసుకున్న ఫొటోలను మాత్రం నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పో స్ట్ చేశారు. అందులో తుపాన్ తరువాత ప్రశాంతత అని పేర్కొనడం విశేషం. ఇప్పుడు ఈ జంట హనీమూన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment