
తలైవా రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యా రజనీకాంత్- వ్యాపారవేత్త విశాగన్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
కాగా వివాహానంతరం సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సంగీత్ నాటి ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసిన సౌందర్య... ‘ మాటలకు అందని సంతోషం! నా జీవితంలో ఉన్న అత్యంత ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు.. ప్రియమైన నాన్న.. నా ముద్దుల కుమారుడు.. ఇప్పుడు నువ్వే.. నా విశాగన్’ అంటూ క్యాప్షన్ జత చేశారు. వీటితో పాటుగా.. # మిస్టర్ అండ్ మిసెస్, #మేముఒక్కటే అనే హ్యాష్ ట్యాగ్‌తో భర్త, కుమారుడు, తండ్రితో కలిసి ఉన్న మరిన్ని ఫొటోలను షేర్ చేశారు.
ఇక 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్న సౌందర్య రెండున్నరేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. వీరికి వేద్ కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Blessed & grateful beyond words !!!! The three most important men in my life ... my darling father ... my angel son ... and now you my Vishagan ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/v7Ra32oiYe
— soundarya rajnikanth (@soundaryaarajni) February 10, 2019
#Mr&Mrs #MyFamily #WeAreOne #VedVishaganSoundarya ❤️🙏🏻🤗😇🙌🏻👪😀♾ pic.twitter.com/W3XbTc8Msf
— soundarya rajnikanth (@soundaryaarajni) February 11, 2019
Comments
Please login to add a commentAdd a comment