
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అగ్నిహోత్రి, సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.