
రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్యా రజనీ కాంత్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. శుక్రవారం చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో సన్నిహితులు, బంధువులకు గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు రజనీ కుటుంబ సభ్యులు. ఈ రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌గా సీడ్ బాల్‌ను అందించడం విశేషం. ఫార్మా బిజినెస్‌మేన్ విశాగన్ వనంగాముడి, సౌందర్య రజనీకాంత్ వివాహం ఆదివారం జరగనుంది. సౌందర్యకు ఇది రెండో వివాహం. ఆల్రెడీ అశ్విన్ రామ్‌కుమార్ అనే పారిశ్రామికవేత్తను వివాహం చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్న వీళ్లకు వేద్ అనే కుమారుడు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment