
రజనీకాంత్ హీరోగా రూపొందిన యానిమేషన్ మూవీ ‘కొచ్చాడయాన్’ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాల కోసం నిర్మాణ సంస్థ మీడియా వన్‌కు యాడ్ బ్యూరో కంపెనీ పది కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ సమయంలో రజనీ భార్య లతా రజనీకాంత్ హామీ సంతకం చేశారు. ఈ రుణానికి సంబంధించి కొంత మొత్తాన్ని వెంటనే చెల్లించిన చిత్ర యూనిట్ మిగతా మొత్తాన్ని ఇంతవరకు చెల్లించలేదు.
ఎప్పుడు చెల్లిస్తారన్న విషయంపై కొచ్చాడయాన్ టీం నుంచి స్పందన రాకపోవటంతో యాడ్ బ్యూరో కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం షూరిటీగా ఉన్న లతా రజనీకాంత్‌ను పన్నెండు వారాల్లోగా 6.2 కోట్ల రూపాయలను వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆదేశించింది. రజనీ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన యానిమేషన్ మూవీ కొచ్చాడయాన్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే, సీనియర్ హీరోయిన్ శోభనలు హీరోయిన్లుగా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment