సౌందర్య రజనీకాంత్
తమిళసినిమా: కొచ్చడైయాన్ చిత్ర వ్యవహారం సుప్రీంకోర్టుకెళ్లడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొచ్చాడైయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యాడ్‌బ్యూరో సంస్థకు రూ.6.20 కోట్లను మీడియా ఒన్ గ్లోబల్ సంస్థగానీ, లతా రజనీకాంత్ గానీ చెల్లించాల్సిందేనని గత ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జూలై 3వ తేదీ వరకూ గడువు ఇస్తూ ఆ రోజుకు విచారణను వాయిదా వేశారు. అయితే జూలై 3న ఈ కేసు విచారణకు రాగా యాడ్ బ్యూరో సంస్థకు ఎందుకు రుణం చెల్లించలేదని సుప్రీంకోర్టు లతా రజనీకాంత్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎప్పుడు చెల్లిస్తారో ఈ నెల 10వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
పత్రికలు వక్రీకరించాయి
సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడ్డ కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారంపై రజనీకాంత్ రెండో కూతురు, కొచ్చడైయాన్ చిత్ర దర్శకురాలు సౌందర్య స్పందించారు.ఆమె శుక్రవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో సుప్రీంకోర్టు ఆదేశాలను పత్రికలు వక్రీకరించాయ ని, పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదని పేర్కొన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ గురించి, అందులో లతారజనీకాంత్ బాధ్యత ఏమిటన్నదానికంటే ఆమె తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోకుండా, పిటిషన్‌దారుడు దాఖలు చేసిన పిటిషన్ గురించి పూర్తిగా విచారించాల్సి ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు తెలిపా రు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతారజనీకాంత్‌కు బాధ్యతలు లేవని, అందువల్ల గత ఏప్రిల్ 16న న్యాయస్థానం ఆదేశాలను అమలుపరచడం కూడదని పేర్కొందన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతా రజనీకాంత్ బాధ్యత ఎంత అన్న విషయం కంటే అసలు కేసును పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని అందుకు ఈ నెల 10 తేదీ వరకూ కేసు విచారణను వాయిదా వేసినట్లు సౌందర్య రజనీకాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment