Soundarya Rajnikanth
-
ధనుష్-ఐశ్వర్య విడాకులు: అక్కకు సపోర్ట్‌గా సౌందర్య.. ఫోటో వైరల్
స్టార్ కపూల్ ధనుష్- ఐశ్వర్యల విడాలకుల విషయం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఐశ్వర్య, ధనుష్‌లు.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?) ‘స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి’అంటూ ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించారు. అలాగే ధనుష్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ..తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా వీరి విడాకుల ప్రకటనపై రజనీకాంత్ ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. అయితే విడాకుల ప్రకటనకు ముందే రజనీకాంత్‌కు ధనుష్, ఐశ్వర్యలు ఫోన్ చేశారని, ఆయన వారి నిర్ణయానికి ఎలాంటి అడ్డు చెప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూతురుకు మద్దతుగా మాత్రం రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్క నిర్ణయానికి సపోర్ట్‌గా నిలిచింది రజనీకాంత్ చిన్న కూతురు, ఐశ్వర్య చెల్లెలు సౌందర్య. అక్క విడాకుల నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లుగా ట్విటర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ని మార్చింది. తండ్రి రజనీకాంత్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటోని తన ప్రొఫెల్ పిక్‌గా మార్చింది. అందులో రజనీకాంత్ ఇద్దరి కూతుళ్లను ఎత్తుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కకు సపోర్ట్‌గా ఉండమని నెటిజన్స్ కోరుతున్నారు. #NewProfilePic pic.twitter.com/0SnIQYvkkg — soundarya rajnikanth (@soundaryaarajni) January 17, 2022 -
రజనీ కొచ్చడైయాన్ వివాదం ముగియలేదు!
తమిళసినిమా: కొచ్చడైయాన్ చిత్ర వ్యవహారం సుప్రీంకోర్టుకెళ్లడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొచ్చాడైయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యాడ్‌బ్యూరో సంస్థకు రూ.6.20 కోట్లను మీడియా ఒన్ గ్లోబల్ సంస్థగానీ, లతా రజనీకాంత్ గానీ చెల్లించాల్సిందేనని గత ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు జూలై 3వ తేదీ వరకూ గడువు ఇస్తూ ఆ రోజుకు విచారణను వాయిదా వేశారు. అయితే జూలై 3న ఈ కేసు విచారణకు రాగా యాడ్ బ్యూరో సంస్థకు ఎందుకు రుణం చెల్లించలేదని సుప్రీంకోర్టు లతా రజనీకాంత్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఎప్పుడు చెల్లిస్తారో ఈ నెల 10వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పత్రికలు వక్రీకరించాయి సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడ్డ కొన్ని రోజుల తరువాత ఈ వ్యవహారంపై రజనీకాంత్ రెండో కూతురు, కొచ్చడైయాన్ చిత్ర దర్శకురాలు సౌందర్య స్పందించారు.ఆమె శుక్రవారం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో సుప్రీంకోర్టు ఆదేశాలను పత్రికలు వక్రీకరించాయ ని, పూర్తి సమాచారాన్ని ప్రచురించలేదని పేర్కొన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ గురించి, అందులో లతారజనీకాంత్ బాధ్యత ఏమిటన్నదానికంటే ఆమె తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోకుండా, పిటిషన్‌దారుడు దాఖలు చేసిన పిటిషన్ గురించి పూర్తిగా విచారించాల్సి ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు తెలిపా రు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతారజనీకాంత్‌కు బాధ్యతలు లేవని, అందువల్ల గత ఏప్రిల్ 16న న్యాయస్థానం ఆదేశాలను అమలుపరచడం కూడదని పేర్కొందన్నారు. మీడియా ఒన్ గ్లోబల్ సంస్థలో లతా రజనీకాంత్ బాధ్యత ఎంత అన్న విషయం కంటే అసలు కేసును పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని అందుకు ఈ నెల 10 తేదీ వరకూ కేసు విచారణను వాయిదా వేసినట్లు సౌందర్య రజనీకాంత్ తెలిపారు. -
విడాకులు కోరిన సూపర్ స్టార్ కూతురు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ రామ్ కుమార్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. తన భర్త నుంచి ఏడాది కాలానికి పైగా దూరంగా ఉంటూ వచ్చిన సౌందర్య వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలపై ట్వీట్ చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విడాకుల విషయమై ఇరు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సౌందర్య వెల్లడించారు. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆమె తన బాధను ఫాలోయర్స్ తో పంచుకున్నారు. తన కుటుంబ పరువు, ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయాలపై ఫోకస్ చేయవద్దని సూచిస్తూ పలు ట్వీట్స్ చేశారు. 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో సౌందర్య రజనీకాంత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్రయించినట్లు భిన్న కథనాలు ప్రచారంలో ఉండగా స్వయంగా డైవర్స్ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. గత కొన్ని నెలలుగా దంపతులు ఎవరి దారి వారిదే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. News about my marriage is true. We have been separated for over a year & divorce talks are on. I request all to respect my family's privacy. — soundarya rajnikanth (@soundaryaarajni) 16 September 2016 -
రజనీ కోసం తిరుపతికి అభిమానుల పాదయాత్ర!
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారనే సంగతి ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ఏప్రిల్ 11 తేదిన రజనీ నటించిన 'కొచ్చడయాన్' చిత్రం విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో అభిమానులు పాదయాత్ర చేపట్టారు. కొచ్చడయాన్ చిత్రం ఘన విజయం సాధించాలని ఏప్రిల్ 2 తేదిన వెల్లూరు నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టనున్నారు. నెల్లూరు కు చెందిన రజనీకాంత్ ఫ్యాన్ క్లబ్ ట్రెజరర్ ఎన్ రవి పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాది రజనీ ఫ్యాన్స్ ఏప్రిల్ 2 తేదిన పాదయాత్రగా తిరుపతి బయలు దేరుతున్నాం. రెండేళ్ల తర్వాత కొచ్చడయాన్ చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలి. అంతేకాకుండా రజనీకాంత్ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తాం అని రవి తెలిపారు. భారత దేశపు తొలి ఫోటో రియలిస్టిక్ 3D యానిమేషన్ చిత్రంగా 'కొచ్చడయాన్'ను సౌందర్య రజనీకాంత్ రూపొందించారు. దీపికా పదుకొనే, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, ఆది పినిశెట్టి నటించిన ఈ చిత్రం ఆరు భాషల్లో విడుదలకు సిద్దమవుతోంది.