విడాకులు కోరిన సూపర్ స్టార్ కూతురు! | Soundarya rajnikanth files for divorce from husband Ashwin | Sakshi
Sakshi News home page

విడాకులు కోరిన సూపర్ స్టార్ కూతురు!

Published Fri, Sep 16 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

విడాకులు కోరిన సూపర్ స్టార్ కూతురు!

విడాకులు కోరిన సూపర్ స్టార్ కూతురు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ వారసురాలిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ రామ్ కుమార్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. తన భర్త నుంచి ఏడాది కాలానికి పైగా దూరంగా ఉంటూ వచ్చిన సౌందర్య వైవాహిక జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలపై ట్వీట్ చేశారు. భర్త నుంచి విడాకులు తీసుకోవాలని తాను నిర్ణయం తీసుకున్నానని ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విడాకుల విషయమై ఇరు కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సౌందర్య వెల్లడించారు. అయితే తన వ్యక్తిగత జీవితం గురించి వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆమె తన బాధను ఫాలోయర్స్ తో పంచుకున్నారు.

తన కుటుంబ పరువు, ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకుని ఈ విషయాలపై ఫోకస్ చేయవద్దని సూచిస్తూ పలు ట్వీట్స్ చేశారు. 2010లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్ తో సౌందర్య రజనీకాంత్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆమె ఆశ్రయించినట్లు భిన్న కథనాలు ప్రచారంలో ఉండగా స్వయంగా డైవర్స్ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. గత కొన్ని నెలలుగా దంపతులు ఎవరి దారి వారిదే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement