లతా రజనీకాంత్‌కు సుప్రీం షాక్‌ | Rajinikanth Wife Latha To Face Trial For Fraud Over Non Payment | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 10 2018 4:19 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Rajinikanth Wife Latha To Face Trial For Fraud Over Non Payment - Sakshi

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కొచ్చాడయాన్ సినిమాకు సంబంధంచిన కర్నాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది.

కొచ్చాడయాన్‌ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్‌ గ్లోబల్‌ డైరెక్టర్లలో ఒకరైన లతా రజనీకాంత్‌ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పుఇచ్చింది. అయితే మీడియా ఒన్‌ గ్లోబల్‌ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్త సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement