![Vijayadashami Celebrations in Rajinikanth House - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/26/rajinikanth.jpg.webp?itok=cwGOyp4W)
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంట్లో మంగళవారం నాడు నవరాత్రి వేడుకలు ఘనంగా సాగాయి. పండగ చివరి రోజున రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పోయిస్ గార్డెన్‌లోని తమ ఇంటిలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొనడం విశేషం.
ముఖ్యంగా తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, ఆయన కుటుంబ సభ్యులు, మాజీ ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, సీనియర్ నటి లత, నటి మీనా, నటుడు విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్ సహా పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు.
కాగా నటుడు రజనీకాంత్ తన 170వ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్న కారణంగా ఈ వేడుకలకు హాజరుకాలేదు. ఆయన కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలు ఇంట జరిగిన వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా లతా రజనీకాంత్ అతిథులందరికీ కానుకలు అందించారు.
చదవండి: వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్ బాబు హాజరు
Comments
Please login to add a commentAdd a comment