తలైవర్‌ తయార్‌! | Rajinikanth Starts Shooting For Karthik Subbaraj's Film | Sakshi
Sakshi News home page

తలైవర్‌ తయార్‌!

Published Thu, Jun 7 2018 12:56 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

Rajinikanth Starts Shooting For Karthik Subbaraj's Film - Sakshi

సౌందర్యా రజనీకాంత్‌

అంతా సిద్ధం చేశారు. కెమెరా.. యాక్షన్‌.. రోలింగ్‌ అనగానే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రంగంలోకి దిగటమే బ్యాలెన్స్‌. ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. డెహ్రాడూన్‌లో జరగనున్న ఈ సినిమా షూట్‌ కోసం రజనీ బుధవారం చెన్నై నుంచి ప్రయాణం అయ్యారు. ఈ విషయాన్ని రజనీ తనయ సౌందర్యా రజనీకాంత్‌ పేర్కొన్నారు.

‘‘నెక్ట్స్‌ సినిమా షూటింగ్‌ కోసం తలైవర్‌ (నాయకుడు) తయారయ్యారు. మల్టీపుల్‌ రోల్స్‌’’ అని సోషల్‌ మీడియాలో పేర్కొన్నా రామె. దీంతో ఈ సినిమాలో రజనీ మల్టీపుల్‌ రోల్స్‌ చేయనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సౌందర్య– ‘‘మల్టీపుల్‌ రోల్స్‌ సినిమాలో కాదు. లైఫ్‌లో. ఈ మూవీ గురించి సరైన టైమ్‌లో సుబ్బరాజే చెబుతారు’’ అన్నారు. ఈ సంగతి కాస్త పక్కనపెడితే.. ‘కబాలి’ ఫేమ్‌ పా.రంజిత్‌ దర్శకత్వంలో రజనీ నటించిన ‘కాలా’ సినిమా ఈ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement