Karthik Subba Raju
-
దళపతి విజయ్‌తో యంగ్ డైరెక్టర్.. హిట్ కొడతాడా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలా మంది డైరెక్టర్స్ ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ఒప్పించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం. ఇందులో త్రిష నాయకిగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. కాగా ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయ బావుటా ఎగురవేసిన అట్లీ విజయ్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చినవే. ఇదిలా ఉండగా విజయ్ను దర్శకత్వం వహించే దర్శకుల లిస్ట్‌లోకి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దూసుకొచ్చారన్నది తాజా సమాచారం. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడైన ఈయన తాజాగా జిగర్తండ డబుల్ ఎక్స్ వంటి హిట్ చిత్రం చేయడం గమనార్హం. కాగా.. కార్తీక్ సుబ్బరాజ్ నటుడు విజయ్ కోసం ఒక కథను సిద్ధం చేసి.. దాన్ని ఆయనను కలిసి వినిపించినట్లు తెలిసింది. కథ నచ్చడంతో విజయ్ కూడా అందులో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. తదుపరి విజయ్ నటించే ఇదే అవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అంతే కాకుండా 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ క్రేజీ కాంబోలో చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు టాక్. -
'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జిగర్ తండ(డబుల్ ఎక్స్) నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య, నిమిషా, నవీన్ చంద్ర తదితరులు నిర్మాణ సంస్థ: స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మాతలు: కార్తికేయన్ సంతానం, కతిరేశన్ దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: తిరు ఎడిటింగ్: షఫీక్ మహమ్మద్ అలీ విడుదల తేది: నవంబర్ 10, 2023 రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరెకెక్కించిన చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్. కథిరేసన్ నిర్మించగా.. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇది తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన జిగర్ తండ(ఈ మూవీ తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా రీమేక్ అయింది) సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సీజర్(రాఘవ లారెన్స్) రాయలసీమలోని కర్నూలులో గ్యాంగ్‌స్టార్. ఆ ప్రాంతంలోని మరో గ్యాంగ్ స్టార్ లారెన్స్‌తో గొడవ పడుతుంటారు. అప్పుడే తన గురువు లాంటి అతన్ని సీజర్ చంపేస్తాడు. కానీ సీజర్కు స్థానిక రాజకీయ నాయకుడైన కారుమంచి(ఇళవరసు) సపోర్ట్ ఉంటుంది. మరో రాజకీయ నాయకుడైన టామ్ చాకో(జయకృష్ణ) మనిషిని సీజర్ చంపడంతో అతనిపై పగ పెంచుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే సీజర్‌ను చంపేయాలని జయకృష్ణ.. ఫారెస్ట్ ఆఫీసర్ అయిన నవీన్ చంద్రకు చెప్తాడు. అయితే సీజర్‌ను చంపే ప్రయత్నంలో ఎస్సై కావాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్) మధ్యలో ఎందుకు ఎంటరయ్యాడు? అసలు జయకృష్ణకు సీజర్‌ను చంపాల్సిన అవసరమేంటి? చివరికీ జయకృష్ణ సీజర్‌ను చంపాడా? లేదా? అసలు సీజర్(లారెన్స్)ను, రే దాసన్(ఎస్జే) ఎందుకు చంపాలనుకున్నాడు? వీరిద్దరి మధ్య గల వైరానికి కారణమేంటి? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మరోవైపు అడవిలో ఉండే ఆదివాసీలకు, అసలు సీజర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఫారెస్ట్ అధికారుల వేధింపుల నుంచి ఆదివాసీలను సీజర్ ఎందుకు రక్షించాలనుకుంటాడు? చివరికీ వారికి అండగా నిలిచాడా? లేదా? ప్రభుత్వం, అటవీ అధికారులకు దొరకకుండా.. అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లను సీజర్ ఎందుకు పట్టుకున్నాడు? వాళ్లను పట్టుకున్నాక సీజర్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వచ్చింది? చివరికీ తాను అనుకున్న లక్ష్యం నేరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే. ఎలా సాగిందంటే.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే కథను పరిచయం చేశాడు డైరెక్టర్. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ ముందుకొచ్చిన కార్తీక్ సుబ్బరాజు సీక్వెల్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 1970 ప్రాంతంలో రాయలసీమలోని నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే ఏనుగుల దంతాల స్మగ్లింగ్ నేపథ్యంలో కథను తీసుకొచ్చారు. ఫస్టాఫ్‌లో రాయలసీమ జిల్లాల్లోని స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, అడవిలో నివసించే ఆదివాసీల చుట్టే తిరుగుతుంది. అయితే ఎస్సైగా జాబ్‌లో చేరాల్సిన ఎస్జే సూర్య(రే దాసన్), మరో వైపు హీరో కావాలనుకున్నా రాఘవ(సీజర్) మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఫస్టాప్‌లో మరీ ముఖ్యంగా సీరియస్‌గా సాగుతున్న స్టోరీలో సత్యన్, ఎస్జే సూర్యతో కామెడీని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సుబ్బరాజు. ఇంటర్వెల్‌కు ముందు చిన్న ట్విస్ట్ ఇచ్చి సింపుల్‌గా ముగించారు. సెకండాఫ్ మొదలవగానే కథలో కాస్తా వేగం పెరిగింది. అడవితల్లితో వారికున్న బంధాన్ని చాలా చక్కగా చూపించారు. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీల జీవన విధానాన్ని సైతం ప్రేక్షకులకు పరిచయం చేశారు కార్తీక్. ముఖ్యంగా అడవిలో ఏనుగులను అంతమొందిస్తున్నషెటానీ ముఠా.. రాఘవ లారెన్స్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తితో పాటు కాస్తా ఉత్కంఠకు గురి చేస్తాయి. ఒకవైపు రాజకీయ నాయకులు, అధికారుల కుట్రలను ప్రేక్షకులకు చూపిస్తూనే.. మరోవైపు ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. అడవి బిడ్డలైన ఆదివాసీలకు, జంతువులకు మధ్య ఉండే ప్రేమానురాగాలను కాస్తా కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఏనుగులను చంపే షెటానీ ముఠా, సీజర్(రాఘవ లారెన్స్) మధ్య జరిగే ఫైట్ సీన్స్ సెకండాఫ్‌లో హైలెట్. ఒకవైపు రాజకీయ నాయకుల కుట్రలు, మరోవైపు అడవిలో స్మగ్లింగ్, వీరి మధ్యన నలిగిపోతున్న ఆదివాసీ బిడ్డలతో కథను ముందుకు తీసుకెళ్లారు. అక్కడక్కడ వచ్చే ప్రేకకుల ఊహకందే ట్విస్టులతో థియేటర్లో కూర్చోబెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్‌ను కంటతడి పెట్టించారు డైరెక్టర్. సినిమా చివరి 20 నిమిషాలు ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఆడియన్స్‌లో మాత్రం ఉత్కంఠ పెంచుతాయి. దాదాపు పదేళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కించడంలో ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడనిపిస్తోంది. జగర్ తండకు సీక్వెల్ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్ అంతా దాదాపుగా ఒకే తరహాలో సాగుతుంది. అయితే మరో సీక్వెల్‌గా త్రిబుల్ ఎక్స్ తీసుకురానున్నట్లు చివర్లో హింట్ మాత్రం ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే... రాఘవ లారెన్స్ ఎప్పటిలాగే తన నటనతో అదరగొట్టేశారు. తనలోని ఫుల్ మాస్ యాక్షన్‌తో మరోసారి తనదైన నటనతో మెప్పించారు. ఎస్జే సూర్య సైతం తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నవీన్ చంద్ర అటవీశాఖ అధికారి పాత్రలో ఒదిగిపోయారు. నిమిశా, ఇళవరసు, టామ్ చాకో, సత్యన్, బావ చెల్లాదురై, అరవింద్ ఆకాష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే.. సంతోష్ నారాయణన్ సంగీతం పర్వాలేదు. ఈ చిత్రంలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా సందర్భాన్ని తగినట్లుగానే ఉన్నాయి. బీజీఎం ఫరవాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్తా పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్ డెస్క్ -
నాపై నాకు నమ్మకం వచ్చింది
‘‘జిగర్తాండ డబుల్ ఎక్స్’లో నాకు మేకప్ వాడలేదు. మేకప్ లేకుంటే బాగుండనేమో? అనుకున్నాను. కానీ, స్క్రీన్‌పై చూసుకున్నాక నా మీద నాకు నమ్మకం ఏర్పడింది’’ అన్నారు రాఘవా లారెన్స్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రాఘవా లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమాలోని ‘కోరమీసం..’ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ– ‘‘జిగర్తాండ’లో నేను చేయాల్సింది.. కానీ, కుదర్లేదు. ఆ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ కోసం ఓ ఊర్లో రోడ్డు, బ్రిడ్జి నిర్మించారు మా నిర్మాత. ఆయన మంచి మనసు కోసమైనా ఈ చిత్రం బాగా ఆడాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పండగలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయన్. ‘‘జిగర్తాండ’ కంటే డబుల్ ఎక్స్ రేంజ్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ‘‘ఈ సినిమా నాకు ప్రత్యేకం’’ అన్నారు ఎస్జే సూర్య. -
ట్రైలర్ టాక్: లండన్ వీధుల్లో రియల్ గ్యాంగ్‌స్టర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ‘జగమే తందిరమ్’, (తెలుగులో ‘జగమే తంత్రం’) కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ ఉదయం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ను డైరెక్టర్ కార్తీక్ ట్విట్టర్లో ప్రకటించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 18న హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లో స్ట్రీమ్ కానుంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కోర మీసాలతో మాస్ లుక్‌లో, మరోవైపు స్టైయిల్ కాస్టూమ్స్తోనూ సూరాలి అనే పాత్రలో ధనుష్ కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు ఇదివరకే హిట్ కాగా, ట్రైలర్‌తో బ్యాక్‌గ్రౌండ్‌ను ఆకట్టుకునేలా ఇచ్చాడు. ఓ తమిళ తంబి లండన్‌లో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారతాడు? అక్కడి మాఫియాను ఎలా ఆడుకుంటాడు? ఆ వెనుక ఉద్దేశం ఏంటనే? కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక కాగా, ధనుష్‌కి ఇది 40వ సినిమా. మలయాళ విలక్షణ నటుడు జోజూ జార్జ్, సంచన నటరాజన్, కలైరసన్, రామచంద్రన్ దురైరాజా, సౌందరరాజా, చిన్న జయంత్, వడివక్కరసి తదితరులు ఇందులో నటిస్తుండగా, ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ యాక్టర్ జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్రలో నటించాడు. పోయినేడాదే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. కరోనాతో వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్య నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలన్న నిర్ణయంపై థియేటర్ యాజమాన్యాలు గోల చేశాయి. అయినప్పటికీ ఓటీటీ రిలీజ్‌కే నిర్మాతలు మొగ్గుచూపారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ అభిమానులను ఆకట్టుకోగా, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వై నాట్ స్టుడియోస్ కలిసి సంయుక్తంగా జగమే తందిరమ్ను నిర్మించాయి. చదవండి: ధనుష్‌గా క్రికెటర్ -
కల నిజమైంది
ఒకే తెరపై తండ్రీ కొడుకులు కనిపిస్తే చూడాలని అభిమానులు అనుకుంటారు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ కాంబినేషన్ కుదిరితే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు. తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. దీనికి కారణం తండ్రీ కొడుకులు విక్రమ్– ధ్రువ్ విక్రమ్ కలిసి తొలిసారి ఒకే సినిమాలో నటì ంచనుండటం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న సినిమాలో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోలుగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘కార్తీక్ సుబ్బరాజ్‌గారి సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. మా నాన్నగారికి నేను పెద్ద అభిమానిని. అనిరు«ద్ పాటలన్నీ అదే పనిగా వినేవాణ్ణి. ఈ ముగ్గురితో కలిసి పని చేయడం కల నిజమైనట్టు ఉంది’’ అన్నారు ధ్రువ్. ఇది విక్రమ్ కెరీర్లో 60వ సినిమా కావడం విశేషం. ధ్రువ్‌కి ఇది రెండో సినిమా. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు ధ్రువ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించగలిగారు. ఇక తండ్రితో కలసి ధ్రువ్ నటించనున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు చిత్రబృందం. పోస్టర్లో రెండు చేతులు కనిపిస్తున్నాయి. ఒకటి విక్రమ్, మరోటి ధ్రువ్‌ది అని ఊహించవచ్చు. లలిత్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీతం అందించనున్నారు. ∙కుమారుడు ధ్రువ్‌తో విక్రమ్ -
ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం
‘పెంగ్విన్’ చిత్రబృందానికి టాటా చెప్పేశారు కథానాయిక కీర్తీ సురేష్. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ‘పేట’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు ఓ నిర్మాత. ఈ చిత్రంలో గర్భవతి పాత్రలో నటించారు Mీ ర్తి.‘‘పెంగ్విన్’ చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా ప్రయాణం నా కెరీర్లో జ్ఞాపకంగా మిగిలిపోతుంది. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని కీర్తీసురేష్ పేర్కొన్నారు. తెలుగులో ‘మిస్ ఇండియా, గుడ్‌లక్ సఖీ’ సినిమాలతో పాటు హిందీలో ‘మైదాన్’ అనే చిత్రంతో కీర్తీ సురేష్ మస్త్ బిజీగా ఉన్నారు. -
ఫారిన్ గ్యాంగ్‌స్టర్
ధనుష్ హీరోగా ‘పిజ్జా, పేట’ చిత్రాల ఫేమ్ కార్తీ్తక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ సినిమా నిర్మించనున్నట్లు వై నాట్ స్టూడియో సంస్థ తెలిపింది. ఇందులో ఐశ్వర్యాలక్ష్మీ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. షూటింగ్ మొత్తాన్ని యూకేలో జరుపనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్నారు. -
కాంబినేషన్ రిపీట్?
‘పేట’ సినిమాలో రజనీకాంత్ లుక్ చాలా యంగ్‌గా కనిపించింది. ఆ సినిమాలో రజనీ క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేశారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మళ్లీ రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, దర్శక, నిర్మాత, నటుడు ధనుష్ నిర్మాణ సంస్థ వండర్‌బార్ బ్యానర్ నిర్మించనుందట. గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రానికి ధనుష్ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. మరి... రజనీకాంత్–కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెటజ్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
జోడీ కుదిరేనా?
అనుకున్నామని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని. ఇప్పుడీ సామెత రజనీకాంత్ తాజా చిత్రానికి సూట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకంటే... రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయాయి. 164 సినిమాలు చేశారాయన. అలాగే కెరీర్లో చెన్నై సుందరి త్రిష కూడా హాఫ్ సెంచరీ మైలురాయిని దాటారు. సినిమా ఫీల్డ్‌లో లీడ్ యాక్ట్రస్‌గా పదిహేను సంవత్సరాలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు రజనీకాంత్‌కు జోడీగా త్రిష నటించలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందంటున్నారు కోలీవుడ్ వాసులు. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా నటించబోతున్నారని తాజా సమాచారం. దాదాపు 19ఏళ్ల క్రితం వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్ ఒక కథానాయికగా నటిస్తే, అందులో త్రిష ఓ స్మాల్ రోల్ చేశారు. ఆ తర్వాత మళ్లీ త్రిష, సిమ్రాన్ స్క్రీన్ షేర్ చేసుకోలేదట. ఇప్పుడు ఈ సినిమాకి కుదురుతుందేమో. రీసెంట్గా డెహ్రాడూన్‌లో ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్ చెన్నై, మధురైలో స్టార్ట్ కానుందని టాక్. విజయ్ సేతు పతి, బాబీ సింహా, సనత్ రెడ్డి, మేఘా ఆకాశ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. -
తలైవర్ తయార్!
అంతా సిద్ధం చేశారు. కెమెరా.. యాక్షన్.. రోలింగ్ అనగానే సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగటమే బ్యాలెన్స్. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. డెహ్రాడూన్‌లో జరగనున్న ఈ సినిమా షూట్ కోసం రజనీ బుధవారం చెన్నై నుంచి ప్రయాణం అయ్యారు. ఈ విషయాన్ని రజనీ తనయ సౌందర్యా రజనీకాంత్ పేర్కొన్నారు. ‘‘నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం తలైవర్ (నాయకుడు) తయారయ్యారు. మల్టీపుల్ రోల్స్’’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నా రామె. దీంతో ఈ సినిమాలో రజనీ మల్టీపుల్ రోల్స్ చేయనున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలుసుకున్న సౌందర్య– ‘‘మల్టీపుల్ రోల్స్ సినిమాలో కాదు. లైఫ్‌లో. ఈ మూవీ గురించి సరైన టైమ్‌లో సుబ్బరాజే చెబుతారు’’ అన్నారు. ఈ సంగతి కాస్త పక్కనపెడితే.. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ నటించిన ‘కాలా’ సినిమా ఈ రోజు విడుదల కానున్న సంగతి తెలిసిందే -
ఇక షురూ!
వచ్చే నెలలో ఉత్తరాఖండ్ వెళ్లేందుకు అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారట సూపర్‌స్టార్ రజనీకాంత్. ఎందుకంటే ఆయన నెక్ట్స్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అక్కడే స్టార్ట్ కానుందని కోలీవుడ్ సమాచారమ్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ఉత్తరాఖండ్‌లో షురూ చేయనున్నారట. అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాలో సిమ్రాన్ ఓ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే విజయ్‌సేతుపతితో పాటు బాబీ సింహా, సనాత్, యోగిబాబు కీలక పాత్రలు చేయనున్నారని చెన్నై టాక్. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కాలా’ చిత్రం జూన్ 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
సూపర్ స్టార్‌తో...
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సిమ్రాన్ తొలిసారి జోడీ కట్టనున్నారని కోలీవుడ్ టాక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే రజనీకి జోడీగా సిమ్రాన్ నటించనున్నారట. ఈ చిత్రంలో తలైవాకి జోడీగా తొలుత త్రిష, మీనాతో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి. తాజాగా ఆ చాన్స్ సిమ్రాన్‌ని వరించిందట. తెలుగులో సిమ్రాన్ నటించిన ఆఖరి చిత్రం ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’. 2008లో ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా తర్వాత తమిళ చిత్రాలకే పరిమితమయ్యారామె. రజనీకాంత్ చిత్రాలన్నీ ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతాయి. సో.. ఈ చిత్రంలో సిమ్రాన్ నటిస్తే పదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఆమెను వెండితెరపై చూసే అవకాశం రానుందన్నమాట. -
కొత్త స్టెప్!
సినిమాల్లోకి ప్రభుదేవా ఫస్ట్ స్టెప్ కొరియోగ్రఫీ – సక్సెస్. సెకండ్ స్టెప్ హీరో – సక్సెస్. థర్డ్ స్టెప్ డైరెక్షన్ – సక్సెస్. రెండు తమిళ సినిమాలకు పాటలు పాడారు. ఓ సినిమాకి పాట రాశారు. ఇప్పుడు ప్రభుదేవా ఇంకో స్టెప్ వేయనున్నారు. ఇప్పటివరకూ వేసిన అడుగులకన్నా అది ఫుల్ డిఫరెంట్. ప్రభుదేవా విలన్‌గా స్టెప్ వేయనున్న ఆ సినిమా పేరు ‘మెర్క్యురీ’. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ అండ్ ఒరిజినల్స్ పతకాంపై ‘పిజ్జా’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇది థ్రిల్లర్ మూవీ. ‘నిశ్శబ్దం ఎంతో శక్తిమంతమైనది’ అనేది ట్యాగ్‌లైన్. ప్రభుదేవా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. టీనేజ్‌లో కెరీర్ ఆరంభించి, వేసిన ప్రతి అడుగులోనూ సక్సెస్ అయిన ప్రభుదేవా ఇప్పుడు వేయనున్న ఈ కొత్త స్టెప్‌లోనూ సక్సెస్ అవుతారని ఊహించవచ్చు.