కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలా మంది డైరెక్టర్స్ ఎదురు చూస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ఒప్పించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 68వ చిత్రం. ఇందులో త్రిష నాయకిగా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో విజయ్ తన 69వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. కాగా ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయ బావుటా ఎగురవేసిన అట్లీ విజయ్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహిస్తారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వీరిది సూపర్ హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మెర్సల్, బిగిల్ వంటి విజయవంతమైన చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చినవే. ఇదిలా ఉండగా విజయ్‌ను దర్శకత్వం వహించే దర్శకుల లిస్ట్‌లోకి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దూసుకొచ్చారన్నది తాజా సమాచారం. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడైన ఈయన తాజాగా జిగర్తండ డబుల్ ఎక్స్ వంటి హిట్ చిత్రం చేయడం గమనార్హం.
కాగా.. కార్తీక్ సుబ్బరాజ్ నటుడు విజయ్ కోసం ఒక కథను సిద్ధం చేసి.. దాన్ని ఆయనను కలిసి వినిపించినట్లు తెలిసింది. కథ నచ్చడంతో విజయ్ కూడా అందులో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. తదుపరి విజయ్ నటించే ఇదే అవుతుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అంతే కాకుండా 2024 మార్చి లేదా ఏప్రిల్లో ఈ క్రేజీ కాంబోలో చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు టాక్.
Comments
Please login to add a commentAdd a comment