
ఒకే తెరపై తండ్రీ కొడుకులు కనిపిస్తే చూడాలని అభిమానులు అనుకుంటారు. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ కాంబినేషన్ కుదిరితే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు. తాజాగా విలక్షణ నటుడు విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. దీనికి కారణం తండ్రీ కొడుకులు విక్రమ్– ధ్రువ్ విక్రమ్ కలిసి తొలిసారి ఒకే సినిమాలో నటì ంచనుండటం. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న సినిమాలో విక్రమ్, ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోలుగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘‘కార్తీక్ సుబ్బరాజ్‌గారి సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను.
మా నాన్నగారికి నేను పెద్ద అభిమానిని. అనిరు«ద్ పాటలన్నీ అదే పనిగా వినేవాణ్ణి. ఈ ముగ్గురితో కలిసి పని చేయడం కల నిజమైనట్టు ఉంది’’ అన్నారు ధ్రువ్. ఇది విక్రమ్ కెరీర్‌లో 60వ సినిమా కావడం విశేషం. ధ్రువ్‌కి ఇది రెండో సినిమా. తెలుగు ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’ ద్వారా హీరోగా పరిచయమయ్యారు ధ్రువ్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించగలిగారు. ఇక తండ్రితో కలసి ధ్రువ్ నటించనున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు చిత్రబృందం. పోస్టర్‌లో రెండు చేతులు కనిపిస్తున్నాయి. ఒకటి విక్రమ్, మరోటి ధ్రువ్‌ది అని ఊహించవచ్చు. లలిత్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీతం అందించనున్నారు.
∙కుమారుడు ధ్రువ్‌తో విక్రమ్
Comments
Please login to add a commentAdd a comment