జోడీ కుదిరేనా? | Trisha, Simran in Rajinikanth's next movie | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరేనా?

Aug 17 2018 1:13 AM | Updated on Sep 12 2019 10:40 AM

Trisha, Simran in Rajinikanth's next movie - Sakshi

త్రిష, రజనీకాంత్‌

అనుకున్నామని జరగవు అన్నీ. అనుకోలేదని ఆగవు కొన్ని. ఇప్పుడీ సామెత రజనీకాంత్‌ తాజా చిత్రానికి సూట్‌ అయ్యేలా అనిపిస్తుంది. ఎందుకంటే... రజనీకాంత్‌ ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు దాటిపోయాయి. 164 సినిమాలు చేశారాయన. అలాగే కెరీర్‌లో చెన్నై సుందరి త్రిష కూడా హాఫ్‌ సెంచరీ మైలురాయిని దాటారు. సినిమా ఫీల్డ్‌లో లీడ్‌ యాక్ట్రస్‌గా పదిహేను సంవత్సరాలు పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు రజనీకాంత్‌కు జోడీగా త్రిష నటించలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందంటున్నారు కోలీవుడ్‌ వాసులు. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

ఇందులో సిమ్రాన్‌ ఒక కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ త్రిష కూడా నటించబోతున్నారని తాజా సమాచారం. దాదాపు 19ఏళ్ల క్రితం వచ్చిన ‘జోడి’ సినిమాలో సిమ్రాన్‌ ఒక కథానాయికగా నటిస్తే, అందులో త్రిష ఓ స్మాల్‌ రోల్‌ చేశారు. ఆ తర్వాత మళ్లీ త్రిష, సిమ్రాన్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదట. ఇప్పుడు ఈ సినిమాకి కుదురుతుందేమో. రీసెంట్‌గా డెహ్రాడూన్‌లో ఈ సినిమా షెడ్యూల్‌ పూర్తయింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ చెన్నై, మధురైలో స్టార్ట్‌ కానుందని టాక్‌. విజయ్‌ సేతు పతి, బాబీ సింహా, సనత్‌ రెడ్డి, మేఘా ఆకాశ్, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement