
రజనీకాంత్, సిమ్రాన్
సంక్రాంతి పండక్కి వెండితెరపై రజనీకాంత్ సందడి చేయడం కన్ఫార్మ్ అయిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘పేట్టా’. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాష్, మాళవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సిని మాను సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘‘అవును... తలైవర్ (నాయకుడు) రజనీకాంత్ సంక్రాంతికి వస్తున్నారు’’ అని కార్తీక్ సుబ్బరాజ్ పేర్కొన్నారు.
‘‘రజనీకాంత్‌సార్ సరసన నటిస్తానని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు సిమ్రాన్. డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్, నటులు బాబీ సింహా, సనత్‌రెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ సినిమా జనవరి 10న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రజనీకాంత్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి, ట్రెండ్ సెట్ చేసిన ‘బాషా’ తర్వాత సంక్రాంతికి విడుదలవుతున్న ఆయన సినిమా ‘పేట్టా’ కావడం విశేషం. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ ఈ నెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment