
‘పేట’ సినిమాలో రజనీకాంత్ లుక్ చాలా యంగ్‌గా కనిపించింది. ఆ సినిమాలో రజనీ క్యారెక్టర్‌ను అలా డిజైన్ చేశారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. మళ్లీ రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, దర్శక, నిర్మాత, నటుడు ధనుష్ నిర్మాణ సంస్థ వండర్‌బార్ బ్యానర్ నిర్మించనుందట. గతంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రానికి ధనుష్ నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. మరి... రజనీకాంత్–కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెటజ్ వెయిట్ అండ్ సీ. ఇక ప్రస్తుతం ‘దర్బార్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment