
సిమ్రాన్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో సిమ్రాన్ తొలిసారి జోడీ కట్టనున్నారని కోలీవుడ్ టాక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే రజనీకి జోడీగా సిమ్రాన్ నటించనున్నారట. ఈ చిత్రంలో తలైవాకి జోడీగా తొలుత త్రిష, మీనాతో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి. తాజాగా ఆ చాన్స్ సిమ్రాన్‌ని వరించిందట. తెలుగులో సిమ్రాన్ నటించిన ఆఖరి చిత్రం ‘జాన్ అప్పారావ్ 40 ప్లస్’. 2008లో ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా తర్వాత తమిళ చిత్రాలకే పరిమితమయ్యారామె. రజనీకాంత్ చిత్రాలన్నీ ఎలాగూ తెలుగులోనూ విడుదలవుతాయి. సో.. ఈ చిత్రంలో సిమ్రాన్ నటిస్తే పదేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఆమెను వెండితెరపై చూసే అవకాశం రానుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment