ఇక షురూ! | Superstar Rajinikanth's next film to be helmed by Karthik Subburaj | Sakshi

ఇక షురూ!

May 30 2018 2:09 AM | Updated on Sep 12 2019 10:40 AM

Superstar Rajinikanth's next film to be helmed by Karthik Subburaj - Sakshi

వచ్చే నెలలో ఉత్తరాఖండ్‌ వెళ్లేందుకు అంతా ప్రిపేర్‌ చేసుకుంటున్నారట సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఎందుకంటే ఆయన నెక్ట్స్‌ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ అక్కడే స్టార్ట్‌ కానుందని కోలీవుడ్‌ సమాచారమ్‌. రజనీకాంత్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ పతాకంపై ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ఉత్తరాఖండ్‌లో షురూ చేయనున్నారట. అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాలో సిమ్రాన్‌ ఓ కథానాయికగా నటించనున్నారన్న వార్తలు వస్తున్నాయి. అలాగే విజయ్‌సేతుపతితో పాటు బాబీ సింహా, సనాత్, యోగిబాబు కీలక పాత్రలు చేయనున్నారని చెన్నై టాక్‌. ఈ సంగతి ఇలా ఉంచితే.. రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’ ఫేమ్‌ పా.రంజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కాలా’ చిత్రం జూన్‌ 7న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement