
త్రిష
కన్‌ఫ్యూజన్ క్లియర్ అయింది. సూపర్ స్టార్‌తో యాక్ట్ చేసే హీరోయిన్ ఎవరో కన్ఫార్మ్ అయింది. రజనీకాంత్ నెక్ట్స్ సినిమాలో ఆయన సరసన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఎవరంటూ? కొన్ని రోజులుగా గందరగోళం ఏర్పడింది. తలైవర్‌తో డ్యాన్స్ చేసేది త్రిష అని కొంతమంది అంటే.. కాదు మాళవికా మోహనన్ అని కొందరు వాదించారు. వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ కన్‌ఫ్యూజన్‌ని క్లియర్ చేశారు సన్ నెటవర్క్ సంస్థ ప్రతినిధులు. రజనీకాంత్ సరసన నటించనున్న హీరోయిన్ త్రిష అని అఫీషియల్‌గా ప్రకటించారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
సిమ్రాన్ ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి జోడీగా నటించబోతున్నది త్రిష అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు సన్ నెటవర్క్ ప్రతినిధులు. ‘‘కొన్ని సార్లు నిద్రలేచినా కూడా ఇంకా కలలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఈ వార్త నాకు అలాంటిదే’’ అని త్రిష ఆనందాన్ని పంచుకున్నారు. అన్నట్లు.. కొన్ని రోజుల క్రితం రజనీతో త్రిష జోడీ కుదిరింది అని ‘సాక్షి’ ప్రచురించిన సంగతి గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరు«ద్ స్వరకర్త. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment